PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-family-success-secret9bfb9236-7399-4852-a135-0be9ba0963fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-family-success-secret9bfb9236-7399-4852-a135-0be9ba0963fb-415x250-IndiaHerald.jpgరాజన్న వారసుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన బాటలో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. అటు ఈయన సోదరి, రాజన్న తనయురాలు వై ఎస్ షర్మిల కూడా అదే బాటలో నడవడానికి అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో పార్టీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆమె ఇపుడు మరో సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.YS FAMILY SUCCESS SECRET{#}dr rajasekhar;Varasudu;Sharmila;Yatra;Telangana Chief Minister;Jagan;Andhra Pradesh;Yevaru;Congress;Revanth Reddy;Party;Telanganaపాదయాత్రే...వైఎస్ ఇంటి విజయ రహస్యమా ?పాదయాత్రే...వైఎస్ ఇంటి విజయ రహస్యమా ?YS FAMILY SUCCESS SECRET{#}dr rajasekhar;Varasudu;Sharmila;Yatra;Telangana Chief Minister;Jagan;Andhra Pradesh;Yevaru;Congress;Revanth Reddy;Party;TelanganaSun, 08 Aug 2021 14:00:00 GMTరాజన్న వారసుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన బాటలో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. అటు ఈయన సోదరి, రాజన్న తనయురాలు వై ఎస్ షర్మిల కూడా అదే బాటలో నడవడానికి అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో పార్టీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆమె ఇపుడు మరో సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో పాలిటిక్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉండాల్సిన ఈమె ఇపుడు అదే ప్రణాళికను అమలు చేస్తున్నట్లు, ప్రజలకు చేరువయ్యే మార్గమును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈటల రాజేంద్ర, బండి సంజయ్, రేవంత్ రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు పాదయాత్రను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచినా ఇప్పుడు....అసలు పాదయాత్రకు మొదట పాదం కదిపిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో ఆయన వారసురాలిగా అదే దారిలో నడిచేందుకు వైయస్ షర్మిల నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సన్నిహితులు అనుకుంటున్నారట.

తెలంగాణలో త్వరలో తన పాదయాత్రను ప్రకటించి ప్రజలకు మరింత చేరువ కావాలని, అంతే కాకుండా నిరంతరం పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు తమ పార్టీని మరింత చేరువ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం వైఎస్ షర్మిల పాదయాత్ర రాజకీయాల్లో పెద్ద  హాట్ టాపిక్ గా మారింది. అందరూ పాద యాత్ర చేయడం వేరే రాజన్న వారసురాలు పాద యాత్ర చేస్తే ఆ లెక్క వేరే అంటున్నారట రాజకీయ విశ్లేషకులు. ఒక్కసారి పాద యాత్రలో  అడుగు వేశారు అంటే  ఇక ఆమె విజయ యాత్ర మొదలైనట్లే..అంటున్నారు.

2004లో దివంగత రాజకీయనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రలో కాంగ్రెస్ తరపున పాద యాత్ర చేసి చివరకు ఆ పార్టీని అధికారంలోకి  తీసుకొచ్చి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 2019కు ముందు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  కూడా పాదయాత్ర చేసి ప్రజల మనసును గెలుచుకుని ఆంధ్రకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇపుడు అదే ఇంటి వారసురాలు వై ఎస్ షర్మిల పాదయాత్ర మొదలు పెట్టారు అంటే ఇక ఆమెను ఎవరు అడ్డుకోలేరు... ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బహుశా వైఎస్ ఇంటి విజయ రహస్యం పాదయాత్రే కాబోలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి మా షర్మిలమ్మ అన్న నినాదాలు జోరుగా విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వై ఎస్ షర్మిల ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారు అన్న విషయంపై ఇపుడు  తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.



చిరు, బాలయ్య ల సినిమాలకు ఈ దుస్థితా!!

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>