MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-sarkaru-vari-pata-first-lookcaeb6729-d29a-40c3-83f6-9b19d0c79800-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-sarkaru-vari-pata-first-lookcaeb6729-d29a-40c3-83f6-9b19d0c79800-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు నుండి సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆ మూవీపై ఎంతో భారీగా అంచనాలు నెలకొని ఉంటాయి. ఇక ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. తొలిసారిగా తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక డిఫరెంట్ రోల్ ని ఈ సినిమాలో మహేష్ చేస్తున్నట్లు ఇన్నర్ వర్గాల సమాచారం. మహానటి కథానాయిక కీర్తి సురేష్ తొలిసారిగా మహేష్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమాలో సమsarkaru vaari paata{#}Mahanati;Mass;January;keerthi suresh;thaman s;Samuthirakani;Makar Sakranti;Success;Yuva;parasuram;Rajani kanth;CBN;Cinemaమహేష్ మడతేసి కొట్టేది వీళ్ళనేనట .... ??మహేష్ మడతేసి కొట్టేది వీళ్ళనేనట .... ??sarkaru vaari paata{#}Mahanati;Mass;January;keerthi suresh;thaman s;Samuthirakani;Makar Sakranti;Success;Yuva;parasuram;Rajani kanth;CBN;CinemaSun, 08 Aug 2021 16:33:43 GMTమహేష్ బాబు నుండి సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆ మూవీపై ఎంతో భారీగా అంచనాలు నెలకొని ఉంటాయి. ఇక ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. తొలిసారిగా తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక డిఫరెంట్ రోల్ ని ఈ సినిమాలో మహేష్ చేస్తున్నట్లు ఇన్నర్ వర్గాల సమాచారం. మహానటి కథానాయిక కీర్తి సురేష్ తొలిసారిగా మహేష్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా యాక్ట్ చేస్తున్నట్లు టాక్.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, ఫస్ట్ నోటిస్, అలానే నిన్న విడుదలైన బ్లాస్టర్ జిఐఎఫ్ ఇలా అన్ని కూడా సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసాయి. రేపు మహేష్ పుట్టినరోజు సందర్భంగా బ్లాస్టర్ టీజర్ విడుదల కానుంది. మంచి మెసేజ్ తో పాటు భారీ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా యువ దర్శకుడు పరశురామ్ తీస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మది ఛాయాగ్రాహకుడిగా వర్క్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి నేడు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా ఆ ఫొటోల్లో కొందరు వ్యక్తులు మాస్ స్టయిల్లో లుంగీలు, గళ్ళ షర్ట్ లు వేసుకుని ఉండడం గమనించవచ్చు. సర్కారు వారి పాట లోని ఒక కీలక సన్నివేశంలో వచ్చే భారీ మాస్ ఫైట్ కోసం కొందరిని ఈ విధమైన డ్రెస్ లతో కాస్ట్యూమ్ టెస్ట్ లు చేస్తున్నట్లు సమాచారం. ఆ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతుండగా, ఈ మూవీలో మహేష్ మడతేసి కొట్టే ఈ బాబులు రేపు సినిమాలో ఎంతవరకు ఆకట్టుకుంటారో, ఆ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలని పలువురు ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో ఆసక్తికరంగా కామెంట్స్ మొదలెట్టేసారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది .... !!






చెల్లెలి కోసం మొగుడిని వెతికే పనిలో నాగ శౌర్య

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>