MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/oorvashi-sharada-5230c55b-2b65-4ca5-bacc-4c7b50a4e764-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/oorvashi-sharada-5230c55b-2b65-4ca5-bacc-4c7b50a4e764-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో కథానాయికలుగా ఇప్పటివరకు రంగప్రవేశం చేసిన అనేకమందిలో, ఇండస్ట్రీ లో తమకంటూ ఒక మంచి పేరుని అలానే ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని దక్కించుకున్న వారు కొందరు ఉన్నారు. అయితే వారిలో మన తెలుగు ప్రేక్షకులు ఒకింత గర్వంగా చెప్పుకోదగ్గ నటీమణి ఊర్వశి శారద. నటిగా తన కెరీర్ లో తెలుగు సహా పలు ఇతర భాషల్లోని ఎందరో మహామహులైన నటులతో ఎన్నో గొప్ప పాత్రల్లో నటించి ప్రేక్షకాభిమానుల హృదయాల్లో మంచి ముద్ర వేసిన శారద కెరీర్ పరంగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. sharada death{#}Sharada;chalam;urvashi;Ee Rojullo;News;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Apple;media;Industry;Audience;Telugu;Cinemaప్రముఖ నటి ఊర్వశి శారద మరణం : అసలు వాస్తవం ఇదే .... !!ప్రముఖ నటి ఊర్వశి శారద మరణం : అసలు వాస్తవం ఇదే .... !!sharada death{#}Sharada;chalam;urvashi;Ee Rojullo;News;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Apple;media;Industry;Audience;Telugu;CinemaSun, 08 Aug 2021 13:36:53 GMTతెలుగు సినిమా పరిశ్రమలో కథానాయికలుగా ఇప్పటివరకు రంగప్రవేశం చేసిన అనేకమందిలో, ఇండస్ట్రీ లో తమకంటూ ఒక మంచి పేరుని అలానే ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని దక్కించుకున్న వారు కొందరు ఉన్నారు. అయితే వారిలో మన తెలుగు ప్రేక్షకులు ఒకింత గర్వంగా చెప్పుకోదగ్గ నటీమణి ఊర్వశి శారద. నటిగా తన కెరీర్ లో తెలుగు సహా పలు ఇతర భాషల్లోని ఎందరో మహామహులైన నటులతో ఎన్నో గొప్ప పాత్రల్లో నటించి ప్రేక్షకాభిమానుల హృదయాల్లో మంచి ముద్ర వేసిన శారద కెరీర్ పరంగా ఎన్నో అవార్డులు అందుకున్నారు.
ఏకంగా మూడు సార్లు జాతీయ పురస్కారం అందుకుని అందరి నుండి ప్రశంసలు అందుకున్న శారద తొలిసారిగా కన్యాశుల్కం సినిమాలో చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేసారు. అక్కడి నుండి ఒక్కొక్కటిగా తన టాలెంట్ తో అవకాశాలు అందుకుని దూసుకెళ్లిన శారద ప్రముఖ నటుడు చలం ని వివాహమాడారు. అయితే కొన్నాళ్ల అనంతరం వారిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక అప్పటి నుండి శారదా తన సోదరుల వద్దనే చెన్నైలో నివాసం ఉంటున్నారు.
అయితే అసలు విషయం ఏమిటంటే శారద హఠాత్తుగా కన్ను మూశారు అంటూ ఒక వార్త కొద్దిసేపటి క్రితం నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. కొందరు అయితే ఆమె నిజంగానే కాలం చేసారు అంటూ నమ్మేశారు. నిజానికి టెక్నాలజీ వినియోగం రాకెట్ వేగంలో దూసుకెళ్తున్న ఈ రోజుల్లో ఫేక్ వార్తలు పుట్టుకురావడం కొత్తేమి కాదు. అయితే తన అకాల మరణ వార్త విషయం శారద వద్దకు చేరడంతో అది పూర్తిగా అవాస్తవం అని, తాను ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా కుటుంబ సభ్యులతో జీవనం కొనసాగిస్తున్నానని, అలానే తనకు ఎటువంటి అనారోగ్యం లేదు, దయ చేసి పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా ఇటువంటి తప్పుడు పుకార్లను నమ్మవద్దని ఆమె ఒక స్టేట్మెంట్ ద్వారా అందరినీ విజ్ఞప్తి చేసారు .... !!  



డైలామా!: ప్ర‌జా రాజ‌ధాని నిర్మాణం ఎవ‌రితో సాధ్యం?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>