PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-elections40d2215a-e1f4-4bed-ac08-94548aebb9d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-elections40d2215a-e1f4-4bed-ac08-94548aebb9d9-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాలు హుజురాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ హీట్ హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసేవరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికలో గెలుపుకోసం అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఎప్పటి లాగే అధికార పార్టీ పథకాలను ప్రవేశ పెట్టి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.HUJURABADH BY ELECTIONS{#}prem;Bharatiya Janata Party;Kanna Lakshminarayana;politics;Success;Huzurabad;Minister;Revanth Reddy;Congress;Partyరేవంత్ రెడ్డి ప్లాన్... బెడిసి కొట్టిందా ?రేవంత్ రెడ్డి ప్లాన్... బెడిసి కొట్టిందా ?HUJURABADH BY ELECTIONS{#}prem;Bharatiya Janata Party;Kanna Lakshminarayana;politics;Success;Huzurabad;Minister;Revanth Reddy;Congress;PartySun, 08 Aug 2021 09:00:00 GMTతెలంగాణ రాజకీయాలు హుజురాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ హీట్ హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసేవరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికలో గెలుపుకోసం అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఎప్పటి లాగే అధికార పార్టీ పథకాలను ప్రవేశ పెట్టి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మరో వైపు బీజేపీ నుండి పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం కాబట్టి గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఈయన ప్రధానంగా అధికార పార్టీ చేస్తున్న పధకాలు మరియు అందిస్తున్న సంక్షేమానికి నేనే కారణమంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కానీ ఈ హుజురాబాద్ ఎన్నికలో పాల్గొంటున్న కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఏ మాత్రం బాగాలేదని చెప్పాలి.

కాంగ్రెస్ లో ప్రత్తి అభివృద్ధి కన్నా కూడా స్వార్ధ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ సందర్భంలోనే పార్టీలో ఒకరిపై ఒకరికి బేధాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. వీటిని సరి చేసుకోవడానికే సమయమంతా సరిపోతుంది. ఇక ఎన్నికల మాట దేవుడెరుగు. అయినప్పటికి కొత్తగా ఎన్నికయిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నింటినీ సరిచేసుకుంటూ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి అనేక ప్రయత్నాలను చేస్తున్నారు. ఇందులో భాగంగానే హుజురాబాద్ ఎన్నికల్లో దళిత వర్గానికి చెందిన ఓటర్లను ఆకర్శించడానికి దళిత గిరిజన దండోరాకు సిద్దమవుతున్న వేళ అయితే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతల మధ్యన పొరపొచ్చాలు రావడంతో ఇది సాధ్యపడేలా లేదు.

చివరాఖరుకు రంగంలోకి కాంగ్రెస్వా సీనియర్లు దిగారు. వారిద్దరి మధ్యన విభేదాల్ని దాదాపుగా పరిష్కరించినట్లే అని తెలుస్తోంది. అయినప్పటికీ ప్రేమ్ సాగర్ రావ్ కు మరియు మహేశ్వర్ రెడ్డికి మధ్యన విబేధాలు తొలగిపోవడం లేదు. ఇలాంటి వాటిని ముందు ముందు రేవంత్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారో చూడాలి. అంతే కాకుండా రేపు హుజురాబాద్ లో సభ జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యేలా కనబడడం లేదు. మైరి రేపు ఏమి జరగనుందో చూడాలి.





గోల్డెన్ 'బాయ్'కి మిలియన్ గ్రోత్!

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>