PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/wallpapers/143/rahul-gandhi-birthday-special-gallery415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/wallpapers/143/rahul-gandhi-birthday-special-gallery415x250-IndiaHerald.jpgఈ మధ్య ట్విట్టర్‌, కేంద్రం మధ్య ప్రచ్చన్న యుద్ధం సాగిన సంగతి తెలిసిందే. కొందరు కేంద్రమంత్రుల ట్విట్టర్‌ ఖాతాలకు బ్లూ టిక్‌ తీసేయడం.. తర్వాత మళ్లీ ఇవ్వడం...! పోస్టులకు ఫేక్‌ అని వార్నింగ్‌ ఇవ్వడం.. తర్వాత సంజాయిషీ ఇవ్వడం.. ఇవన్నీ హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ అకౌంట్‌ సస్పెండ్‌ కావడంతో.. సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ సాగింది. రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ అకౌంట్‌ సస్పెండ్‌ అయిందంటూ ప్రచారం జరిగింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి ఫిర్యాదుతో ట్విట్టర్‌ ఈ నిర్rahul gandhi{#}Rahul Gandhi;Donald Trump;twitter;rahul;Mohandas Karamchand Gandhi;war;MP;Rahul Sipligunjఅక్కడ ట్రంప్ ఇక్కడ రాహుల్...ట్విట్టర్ టార్గెట్ అదే ?అక్కడ ట్రంప్ ఇక్కడ రాహుల్...ట్విట్టర్ టార్గెట్ అదే ?rahul gandhi{#}Rahul Gandhi;Donald Trump;twitter;rahul;Mohandas Karamchand Gandhi;war;MP;Rahul SipligunjSun, 08 Aug 2021 17:36:00 GMTఎంపీ  రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ అకౌంట్‌ సస్పెండ్‌ కావడంతో.. సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ సాగింది. రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ అకౌంట్‌ సస్పెండ్‌ అయిందంటూ ప్రచారం జరిగింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి ఫిర్యాదుతో ట్విట్టర్‌ ఈ నిర్ణయం తీసుకుందని భావించారు. దీంతో సోషల్‌ మీడియాలో దీనిపై జోరుగా చర్చ సాగింది. 

దీంతో స్పందించిన ట్విట్టర్‌.. క్లారిటీ ఇచ్చింది. రాహుల్‌ ట్విట్టర్‌ను నిలిపివేయలేదని.. సర్వీస్‌లో భాగంగా తాత్కాలికంగా లాక్‌ అయినట్లు తెలిపింది. ఆ అకౌంట్‌ తిరిగి యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.  రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ అకౌంట్‌పై చర్యలకు ప్రధాన కారణం.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఫిర్యాదు. ఢిల్లీలో హత్యాచారం జరిగిన బాలిక కుటుంబాన్ని రాహుల్‌ గాంధీ పరామర్శించారు. ఆ సమయంలో తీసిన ఫోటోను ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అయితే ఇది పోక్సో చట్టం నిబంధనలను అతిక్రమిస్తోందని జాతీయ బాలల హక్కుల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబం వివరాలను బహిరంగ పరిచారంటూ తప్పు పట్టింది. పోస్ట్‌ను వెంటనే తొలగించాలని ట్విట్టర్‌ను ఆదేశించింది.

దీంతో ట్విట్టర్‌ చర్యలు చేపట్టగా.. అది లాక్‌ అయినట్లు చెబుతోంది. అయితే గతంలో ట్రంప్ విషయంలోనూ ట్విటర్ ఇలాగే స్పాందించింది. తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ.. ఏకంగా ట్రంప్ ట్వీట్లను డిలీట్ చేసింది ట్విటర్. ఐనప్పటికే ట్రంప్.. అలానే వ్యవహరించడం తో.. ఫైనల్ గా ట్విట్టర్ అకౌంట్ కూడా లేపేసింది. ఇదే తరహాలో రాహుల్ గాంధీ వ్యవహరిస్తే.. ట్రంప్ ను టార్గెట్ చేసినట్లే.. రాహుల్ ను ట్విటర్ చేసే అవకాశాలు లేక పోలేదు. ఈ నేపథ్యంలో  ట్విట్టర్ విషయంలో..  రాహుల్ గాంధీ చాలా జాగ్రత్తగా ఉండక తప్పని పరిస్థితి.
" style="height: 370px;">




ఒక పాట ఒక వివాదం

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>