BusinessPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money-post-office-sceame5b9fadf-1367-41d7-bf8e-5a63ac208bcf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money-post-office-sceame5b9fadf-1367-41d7-bf8e-5a63ac208bcf-415x250-IndiaHerald.jpgజెఫ్‌బేజోస్ అమెజాన్ అధినేత‌గా ప్ర‌పంచాన్ని త‌న వైపు తిప్పుకున్నాడు. బిల్‌గేట్స్‌ను వెన‌క్కు నెట్టి ప్ర‌పంచ కుబేరుడిగా నిలిచాడు. గ‌త కొన్ని రోజుల క్రితం అంత‌రిక్షం ప్రయాణం చేసి విజ‌య‌వంతంగా తిరిగి భూమికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ రిచెస్ట్ మ్యాన్ గా ఉన్న జెఫ్‌బెజోస్ ఇప్ప‌డు రెండో స్థానానికి వెళ్లిపోయాడు. కొత్త‌గా ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సంపాధ‌న‌తో నెంబర్‌ వన్‌ సంపన్నుడిగా ప్రముఖ లగ్జరీ గూడ్స్‌ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ (ఎల్‌వీఎమ్‌హెచ్‌) కంపెనీ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాworld richest person{#}santhanam;Tesla;Microsoft;Amazon;December;Forbes;Jeff Bezos;Aaviri;Januaryప్ర‌పంచానికి న‌యా కుబేరుడు.. వెనుక‌బ‌డ్డ జెఫ్‌బెజోస్‌..!ప్ర‌పంచానికి న‌యా కుబేరుడు.. వెనుక‌బ‌డ్డ జెఫ్‌బెజోస్‌..!world richest person{#}santhanam;Tesla;Microsoft;Amazon;December;Forbes;Jeff Bezos;Aaviri;JanuarySun, 08 Aug 2021 09:53:04 GMT జెఫ్‌బేజోస్ అమెజాన్ అధినేత‌గా ప్ర‌పంచాన్ని త‌న వైపు తిప్పుకున్నాడు. బిల్‌గేట్స్‌ను వెన‌క్కు నెట్టి ప్ర‌పంచ కుబేరుడిగా నిలిచాడు. గ‌త కొన్ని రోజుల క్రితం అంత‌రిక్షం ప్రయాణం చేసి విజ‌య‌వంతంగా తిరిగి భూమికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ రిచెస్ట్ మ్యాన్ గా ఉన్న జెఫ్‌బెజోస్ ఇప్ప‌డు రెండో స్థానానికి వెళ్లిపోయాడు. కొత్త‌గా ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సంపాధ‌న‌తో నెంబర్‌ వన్‌ సంపన్నుడిగా ప్రముఖ లగ్జరీ గూడ్స్‌ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ (ఎల్‌వీఎమ్‌హెచ్‌) కంపెనీ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్డ్ నిలిచాడు. ఇటీవ‌ల‌ ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్ట్ మొత్తం నికర ఆస్తుల విలువ 198.9 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.


ప్ర‌పంచ ధ‌న‌వంతుల జాబితా మొద‌టి స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్  క‌రోనా కార‌ణంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. పాండ‌మిక్ తో ఆయ‌న సంప‌ద ఆవిరి అయింది.  ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా 194.9 బిలియన్‌ డాలర్లతో కొనసాగుతున్నాడు అమెజాన్ అధినేత జెఫ్‌ బెజోస్‌. మూడో స్థానంలో 185. 5 బిలియన్ల డాలర్లతో స్పెస్‌ ఎక్స్‌, టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌  నిలిచాడు. అంతకు ముందు డిసెంబర్ 2019, జనవరి 2020,  మే 2021 లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా బెర్నార్డ్‌ ఆర్నాల్ట్ నిలిచాడు. తాజాగా మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించాడు ఆర్నాల్డ్‌.

 ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 14 బిలియన్‌ యూరోలను ఆర్జించింది ఎల్‌వీఎమ్‌హెచ్‌ కంపెనీ. ఆ సమయంలో ఎలన్‌ మస్క్‌ స్థానాన్ని దాటాడు  బెర్నార్డ్ ఆర్నాల్డ్‌. గత ఏడాదితో పోలిస్తే 38 శాతం మేర ఆర్నాల్డ్‌ అధిక సంప‌ద‌న‌ను ఆర్జించాడు. ఎల్‌వీఎమ్‌హెచ్‌ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 70 బ్రాండ్‌లను కలిగి ఉంది. లూయిస్‌ విట్టన్‌, సెఫోరా, టిఫనీ అండ్‌ కో, స్టెల్లా, మాక్కార్ట్నీ, గూచీ, క్రిస్టియన్‌ డియోర్‌, గివెన్చీ లాంటి బ్రాండ్‌లను ఆర్నాల్డ్ మెయింటెన్ చేస్తున్నాడు. ఆర్నాల్డ్‌కు ఐదుగురు సంతానం ఉండ‌గా వారిలో న‌లుగ‌రు ప్ర‌స్తుతం ఆయ‌న వ్యాపారాన్ని కొన‌సాగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్‌, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూక‌ర్ బ‌ర్గ్‌, లారీ పెజ్‌, వారెన్ బ‌ఫెట్ లాంటి త‌దిత‌రులు టాప్ 10 జాబితాలో నిలిచారు.



అమరావతిలోకి మీడియాకి నో ఎంట్రీ!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>