PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/anantapuram-tdp41f0fc43-038b-424c-8ce7-ff5c58898075-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/anantapuram-tdp41f0fc43-038b-424c-8ce7-ff5c58898075-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. కొన్ని జిల్లాల్లో టీడీపీ స్కోరు సున్నా. రెండు ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించిన అనంతపురం జిల్లా పార్టీ పరువుని కాస్త నిలబెట్టింది. ఆ జిల్లాలో మొదటినుంచీ టీడీపీకి పట్టుంది. కానీ ఫ్యాన్ గాలికి అక్కడ కూడా టీడీపీ విలవిల్లాడింది. జగన్ హవాకి తోడు, టీడీపీలో అంతర్గత పోరు వల్ల కూడా అక్కడ పార్టీకి బాగా నష్టం జరిగిందని అంటారు. ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో టీడీపీలో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుకుంది. anantapuram tdp{#}CBN;choudary actor;Jagan;Hanu Raghavapudi;Scheduled caste;Ananthapuram;Panchayati;MLA;TDP;local language;Yevaru;Partyఅనంత టీడీపీలో ఆధిపత్య పోరు.. బాబుకి కొత్త తలనొప్పి..అనంత టీడీపీలో ఆధిపత్య పోరు.. బాబుకి కొత్త తలనొప్పి..anantapuram tdp{#}CBN;choudary actor;Jagan;Hanu Raghavapudi;Scheduled caste;Ananthapuram;Panchayati;MLA;TDP;local language;Yevaru;PartySun, 08 Aug 2021 08:00:00 GMT2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. కొన్ని జిల్లాల్లో టీడీపీ స్కోరు సున్నా. రెండు ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించిన అనంతపురం జిల్లా పార్టీ పరువుని కాస్త నిలబెట్టింది. ఆ జిల్లాలో మొదటినుంచీ టీడీపీకి పట్టుంది. కానీ ఫ్యాన్ గాలికి అక్కడ కూడా టీడీపీ విలవిల్లాడింది. జగన్ హవాకి తోడు, టీడీపీలో అంతర్గత పోరు వల్ల కూడా అక్కడ పార్టీకి బాగా నష్టం జరిగిందని అంటారు. ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో టీడీపీలో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుకుంది.

కల్యాణదుర్గం నియోజకవర్గంలో 2014లో టీడీపీ జెండా రెపరెపలాడింది. హనుమంతరాయ చౌదరి అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 వచ్చే సరికి అక్కడ పరిస్థితి మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని కాదని, ఉమా మహేశ్వరనాయుడికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అదే ఆయన చేసిన పెద్ద తప్పు అని ఆ తర్వాత తేలింది. హనుమంతరాయ వర్గం సహాయనిరాకరణ చేయడంతో అక్కడ పార్టీ గల్లంతయింది. అయితే ఇప్పటి వరకూ అక్కడ పార్టీ పరిస్థితి ఇంకా చక్కబడలేదు. ఈమధ్యలో చాలా సార్లు చంద్రబాబు వద్దకు పంచాయతీ వెళ్లింది. ఆయన సర్దుబాట్లు చేసినా కూడా రెండు వర్గాలు శాంతించలేదు. దీంతో చంద్రబాబే స్వయంగా అనంతపురం జిల్లా పర్యటనకు రావాలనుకుంటున్నారు. గ్రూపు తగాదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.

అసలే పార్టీ అధికారంలో లేదు, ఈ దశలో అంతర్గత పోరు అంటే అది మరింత నష్టం. ఈ విషయం తెలిసినా కూడా శింగనమల నియోజకవర్గంలో టీడీపీలో ఆధిపత్యపోరు ముదురుతోంది. ఇక్కడ కూడా 2014లో టీడీపీయే గెలిచింది. యామినీబాల అప్పటి ఎమ్మెల్యే. అయితే 2019లో శ్రావణికి టికెట్ ఇచ్చారు. ఆమె ఓడిపోయారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ డ్ కావడంతో అధికారంలో ఎవరు ఉన్నా అక్కడ ఇతర కమ్యూనిటీల ఆధిపత్యం కూడా కొనసాగేది. అలా శింగనమల టీడీపీలో కూడా అంతర్గత పోరు మొదలైంది. ఓ దశలో ఇక్కడ మూకుమ్మడి రాజీనామాలకు కూడా టీడీపీ నేతలు సిద్ధమయ్యారని సమాచారం. అప్పటికప్పుడు చంద్రబాబు ఈ అశాంతిని చల్లార్చినా ఇప్పుడు మళ్లీ గొడవలు ముదురుతున్నాయట. స్థానిక ఎన్నికల్లో కూడా ఈ అనైక్యత వల్లే చాలా చోట్ల పార్టీ బలపరచిన అభ్యర్థులు ఓడిపోయారని తెలుస్తోంది. ఈ దశలో చంద్రబాబు అనంతపురం జిల్లాపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారని అంటున్నారు.



'అమ‌రావ‌తి'కి 600 రోజులు

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>