PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/ttd40946bb5-c7cc-4fa7-8053-7422f0a9902c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/ttd40946bb5-c7cc-4fa7-8053-7422f0a9902c-415x250-IndiaHerald.jpgతిరుమలలో శ్రీవారి సర్వదర్శనాలు ప్రారంభమయ్యేందుకు మరికొన్నాళ్లు సమయం పట్టే అవకాశముందని ఇప్పటికే స్పష్టమైంది. అయితే టీటీడీ తాజాగా చేసిన ప్రకటనతో సామాన్య భక్తులకు సుదీర్ఘ కాలం శ్రీవారి దర్శనభాగ్యం లభించదని తేలిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనాను డీనోటిఫై చేసే వరకు దర్శనాల విషయంలో ఆంక్షలు ఉంటాయని టీటీడీ ఈవో తాజాగా ప్రకటించారు. అంటే కరోనా కష్టాలు పూర్తిగా తొలగిపోయే వరకు గతంలో లాగా తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడింది అనే మాట వినలేమని అర్థమవుతోంది. ttd{#}Darshana;Chittoor;Tirupati;Tirumala Tirupathi Devasthanam;Coronavirusఅందరివాడు కాదు.. మరికొన్నాళ్లు అందనివాడు..అందరివాడు కాదు.. మరికొన్నాళ్లు అందనివాడు..ttd{#}Darshana;Chittoor;Tirupati;Tirumala Tirupathi Devasthanam;CoronavirusSun, 08 Aug 2021 07:06:40 GMTతిరుమలలో శ్రీవారి సర్వదర్శనాలు ప్రారంభమయ్యేందుకు మరికొన్నాళ్లు సమయం పట్టే అవకాశముందని ఇప్పటికే స్పష్టమైంది. అయితే టీటీడీ తాజాగా చేసిన ప్రకటనతో సామాన్య భక్తులకు సుదీర్ఘ కాలం శ్రీవారి దర్శనభాగ్యం లభించదని తేలిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనాను డీనోటిఫై చేసే వరకు దర్శనాల విషయంలో ఆంక్షలు ఉంటాయని టీటీడీ ఈవో తాజాగా ప్రకటించారు. అంటే కరోనా కష్టాలు పూర్తిగా తొలగిపోయే వరకు గతంలో లాగా తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడింది అనే మాట వినలేమని అర్థమవుతోంది.

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో భక్తులు లేకుండా కేవలం ఏకాంత సేవలతో సరిపెట్టింది టీటీడీ. సెకండ్ వేవ్ లో మాత్రం కొన్ని వెసులుబాట్లతో పరిమితంగా 300రూపాయల టికెట్లు మంజూరు చేసి దర్శనాలు కల్పిస్తోంది. ఆర్జిత సేవలు, సిఫార్సు లెటర్లతో వచ్చే దర్శనాలు వీటికి అదనం. ఇప్పటికీ గరిష్టంగా తిరుమల రోజువారీ దర్శనాలు 20వేల వరకే ఉంటున్నాయి. సెకండ్ వేవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుందనుకుంటున్న వేళ, దర్శనాలు తిరిగి పూర్తి స్థాయిలో మొదలవుతాయని, ఉచిత దర్శనం, కాలినడక దర్శనానికి కూడా అనుమతిస్తారని అనుకున్నారంతా. కానీ ఆ అంచనాలు తలకిందులయ్యాయి. ఏపీలో అత్యథిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో చిత్తూరు కూడా ఒకటి కావడంతో, టీటీడీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దర్శనం టికెట్ ఉంటేనే కొండపైకి అనుమతిస్తున్నారు. కాలినడక దర్శనం, సర్వదర్శనాలను పూర్తిగా పక్కనపెట్టారు.

300రూపాయల దర్శన కోటాను ఇటీవలే పెంచినా అవి కూడా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటడంలేదు. అలా కోటా రిలీజ్ చేయడం, ఇలా సైట్ హ్యాంగ్ అవడం, ఆ వెంటనే అవి బుక్ అయిపోవడం.. ఇలా జరుగుతోందీ వ్యవహారం. ఆన్ లైన్ పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే తిరుమల టికెట్లు దొరుకుతున్నాయి. దాదాపుగా సామాన్య భక్తులెవరికీ దర్శనాలకు అవకాశం దొరకడంలేదు. తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయంతో మరికొన్నాళ్లు భక్తులకు దర్శనాలు దొరకవని తేలిపోయింది. కరోనా పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తర్వాతే టీటీడీ దర్శనాల విషయంలో ధైర్యం చేస్తుందని తేలింది. దర్శన టికెట్లు లేకుండా కొండపైకి వెళ్లి ఇతర తీర్థాలు చూడాలన్నా కూడా ఇప్పుడున్న నిబంధనలతో కష్టమే. దర్శన టికెట్ ఉన్నవారికి మాత్రమే కొండపైకి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు తిరుమలకు దూరమవుతున్నారు.



'అమ‌రావ‌తి'కి 600 రోజులు

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>