MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamila-thambilaku-antha-thegimpa6a81986a-ddac-4c29-bc0c-530d79ec36e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamila-thambilaku-antha-thegimpa6a81986a-ddac-4c29-bc0c-530d79ec36e4-415x250-IndiaHerald.jpgప్రముఖ నటుడు దర్శకుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నిన్న తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. "దుర్గ" అనే సినిమాను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. రాఘవ లారెన్స్ ఈ పోస్టర్ లో కనిపించిన విధానం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పాటుకు రావాల్సిందే. గత కొంతకాలం నుంచి హారర్ థ్రిల్లర్ సినిమాలు వస్తున్న రాఘవ ఈ సినిమాకు కూడా అదే బాట పట్టాడు. నుదుటిపై కుంకుమ బొట్టుతో కళ్ళు తేలేసి, తెల్లటి గడ్డం, గుబురు మీసంతో వణుకు పుట్టిస్తున్నాడు. "ముని" నుంచి మొదలైDurga movie first look;{#}Balakrishna;Prabhu Deva;raghava lawrence;Telugu;Tamil;Director;Thriller;Hero;Posters;Darsakudu;Tollywood;Cinemaతమిళ తంబీలకి అంత తెగింపా?తమిళ తంబీలకి అంత తెగింపా?Durga movie first look;{#}Balakrishna;Prabhu Deva;raghava lawrence;Telugu;Tamil;Director;Thriller;Hero;Posters;Darsakudu;Tollywood;CinemaSat, 07 Aug 2021 08:00:00 GMTప్రముఖ నటుడు దర్శకుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నిన్న తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. "దుర్గ" అనే సినిమాను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. రాఘవ లారెన్స్పోస్టర్ లో కనిపించిన విధానం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పాటుకు రావాల్సిందే. గత కొంతకాలం నుంచి హారర్ థ్రిల్లర్ సినిమాలు వస్తున్న రాఘవ ఈ సినిమాకు కూడా అదే బాట పట్టాడు. నుదుటిపై కుంకుమ బొట్టుతో కళ్ళు తేలేసి, తెల్లటి గడ్డం, గుబురు మీసంతో వణుకు పుట్టిస్తున్నాడు. "ముని" నుంచి మొదలైన ఆయన హారర్ థ్రిల్లర్ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తమిళంలో ఇలాంటి చిత్రాలు చేయడానికి, ప్రయోగాత్మక పాత్రలు పోషించడానికి నటీనటులు ఎప్పుడూ ముందుంటారు. దర్శకనిర్మాతలు కూడా అలాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించడానికి అసలు వెనకాడరు. కానీ టాలీవుడ్ లో మాత్రం ఇంకా ఇప్పటికి అదే మూస ధోరణి కొనసాగుతోంది. ఇటీవల కాలంలో తెలుగు కథల్లో కాస్త మార్పు కనిపించినప్పటికీ కమర్షియల్ సినిమాలను మన స్టార్ హీరోలు వదలడం లేదు. కానీ తమిళ హీరోలు మాత్రం ఎలాంటి పాత్ర చేయడానికైనా తెగించేస్తున్నారు. 

ఇప్పుడు రాఘవ "దుర్గ"తో ఇలా కనిపించాడు. రీసెంట్ గా మరో కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా ఒక ఆర్టిఫిషియల్ లెగ్ తో, చేతిలో చిన్న పాపను పట్టుకుని సీరియస్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది ఆయన నెక్స్ట్ మూవీ ఫస్ట్ లుక్. మన టాలీవుడ్ లో మాత్రం అలాంటి షాకింగ్ లుక్స్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఇటీవల కాలంలో బాలయ్య "అఖండ"లో అఘోరి పాత్రలో కనిపించగా, మరో సీనియర్ హీరో వెంకటేష్ "నారప్ప" కోసం డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఒకరిద్దరు తప్పితే మరే స్టార్ హీరో కూడా ఇలాంటి సాహసాలు చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవడానికి ధైర్యం చేయడం లేదు. తెలుగు ప్రేక్షకులు కూడా ఇటీవల కాలంలో కొత్త కంటెంట్ ను ఇష్టపడుతున్నారు. కానీ ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ ను స్టార్ హీరోలు చేస్తే అభిమానులు తీసుకోగలరా లేదా అని మన హీరోలు భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి టాలీవుడ్ లో తమిళ తంబీల్లాగా ఎలాంటి పాత్రల కోసమైనా తెగించే తెగింపు ఎప్పటికి వస్తుందో చూడాలి.



కడపలో ఘోర ప్రమాదం.. 4గురు మృతి.. !

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?

చైల్డ్ పోర్నోగ్రఫిని అరికట్టడానికి ఆపిల్ సరికొత్త టెక్నాలజీ..

"ఎస్ఆర్ కళ్యాణమండపం"లో ఆ 20 నిమిషాలే కీలకమట !

టాప్ సెలెబ్రిటీల వాట్సాప్ చాట్ లీక్... అందులో ఏముందంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>