PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-elections-sharmila-support49fd5018-ea07-4d44-b638-b01da414561d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-elections-sharmila-support49fd5018-ea07-4d44-b638-b01da414561d-415x250-IndiaHerald.jpgఎన్నో ఆశలతో ఆశయాలతో తెలంగాణలో వైఎస్ రాజశేఖరరెడ్డి వారసురాలు వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని గత నెలలోనే స్థాపించారు. పూర్వం ఎలా అయితే రాజశేఖర్ రెడ్డి మంచి మంచి పథకాలను ప్రజలకు చేరువగా తీసుకెళ్ళాడో అదే విధంగా షర్మిల నాన్న పథకాలను ప్రజల్లో బ్రతికించడానికి తన వంతు కృషి చేస్తోంది.HUJURABADH ELECTIONS-SHARMILA SUPPORT{#}tuesday;politics;Father;Sharmila;dr rajasekhar;KCR;Y. S. Rajasekhara Reddy;Reddy;Telangana Rashtra Samithi TRS;Congress;Huzurabad;Telangana;Bharatiya Janata Partyహుజురాబాద్ లో షర్మిల మద్దతు ఈ పార్టీకే ?హుజురాబాద్ లో షర్మిల మద్దతు ఈ పార్టీకే ?HUJURABADH ELECTIONS-SHARMILA SUPPORT{#}tuesday;politics;Father;Sharmila;dr rajasekhar;KCR;Y. S. Rajasekhara Reddy;Reddy;Telangana Rashtra Samithi TRS;Congress;Huzurabad;Telangana;Bharatiya Janata PartySat, 07 Aug 2021 20:48:46 GMTఎన్నో ఆశలతో ఆశయాలతో తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలు వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని గత నెల లోనే స్థాపించారు. పూర్వం ఎలా అయితే రాజశేఖర్ రెడ్డి మంచి మంచి పథకాలను ప్రజలకు చేరువగా తీసుకెళ్ళాడో అదే విధంగా షర్మిల నాన్న పథకాలను ప్రజల్లో బ్రతికించడానికి తన వంతు కృషి చేస్తోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మహా రంజుగా ఉన్నాయి. అధికార తెరాస పార్టీకి ప్రజల్లో సంక్షేమ పథకాల పట్ల సదభిప్రాయం ఉన్నప్పటికీ, యువత మరియు అభివృద్ధిలో వెనకబడిందనే విమర్శలను మూట గట్టుకుంది. అయితే ఇదే అంశాన్ని షర్మిల టార్గెట్ చేస్తూ కేసీఆర్ పై విమర్శలు చేస్తోంది.

ఈమెకు అందరికీ సంక్షేమ పథకాలన్నీ అందించడమే లక్ష్యంగా ముందుకెళుతోంది.  ఇప్పుడు మన ద్యేయం వైఎస్సార్ పాలనను అందించడమే ప్రతి సభలో చెబుతూ వస్తోంది. అంతే కాకుండా నిరుద్యోగుల సమస్యను పరిష్కరిచేందుకు ప్రతి మంగళవారం ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ పోరాటం ద్వారా అధికార పార్టీకి వెన్నులో వణుకు పుడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనికి యువత నుండి మంచి గానే రెస్పాన్స్ వస్తోంది.  

అయితే ప్రస్తుతానికి షర్మిల తన ముందున్న ప్రధాన లక్ష్యం.. హుజురాబాద్ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికి ప్రకటిస్తుందో చూడాలి. అధికారికంగా ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తుందో లేదో తెలియక పోయినా, తన మద్దతు ఎవరికి తెలుపుతుందో అని అంతా ఆలోచిస్తున్నారు. అక్కడ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లను చీల్చే విధముగా ప్రణాళికలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ కొందరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాన్ని చూస్తే తన నాన్న కొనసాగిన కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే బీజేపీ మరియు తెరాస ల బలం ముందు వీరిద్దరూ ఏకమయినా ఏమీ చేయలేరని బయట సమాచారం. మరి ఏమి జరగనుందో తెలియాల్సి ఉంది.



లైట్ గా తీసుకుంటున్న మోడీ... ?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>