EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokeshbc030adc-cc02-4d3b-ba9a-00665376d6a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokeshbc030adc-cc02-4d3b-ba9a-00665376d6a7-415x250-IndiaHerald.jpgఏపీలో వైసీపీ సర్కారు కొన్ని విషయాల్లో దూకుడుగా వెళ్తోంది. ప్రత్యర్థులను వేటాడటంలో ఆ దూకుడు కనిపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో టీడీపీకి చెందిన అనేక మంది నాయకులకు చుక్కలు చూపించారు. ఇంకా చూపిస్తున్నారు కూడా. గతంలో జగన్ కూడా సీబీఐ కేసుల్లో భాగంగా జైలుకు వెళ్లొచ్చారు. తనను అనవసరంగా జైల్లో పెట్టించారన్న కోపమో.. ఏమో తెలియదు కానీ.. ఇప్పుడు జగన్ మాత్రం ఏ మాత్రం ఛాన్స్ దొరికినా టీడీపీ నేతలకు జైలు భోజనం రుచి చూపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లోనే మాజీ మంత్రి కొల్లు రlokesh{#}Mylavaram;Devineni Uma Maheswara Rao;Dookudu;Nara Lokesh;CBI;devineni avinash;Vijayawada;TDP;YCP;Raccha;Party;Jagan;police;Minister;politicsకొల్లు, అచ్చెన్న, ధూళిపాళ్ల, ఉమ.. తర్వాత లోకేశేనా..?కొల్లు, అచ్చెన్న, ధూళిపాళ్ల, ఉమ.. తర్వాత లోకేశేనా..?lokesh{#}Mylavaram;Devineni Uma Maheswara Rao;Dookudu;Nara Lokesh;CBI;devineni avinash;Vijayawada;TDP;YCP;Raccha;Party;Jagan;police;Minister;politicsSat, 07 Aug 2021 00:00:00 GMTఏపీలో వైసీపీ సర్కారు కొన్ని విషయాల్లో దూకుడుగా వెళ్తోంది. ప్రత్యర్థులను వేటాడటంలో ఆ దూకుడు కనిపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో టీడీపీకి చెందిన అనేక మంది నాయకులకు చుక్కలు చూపించారు. ఇంకా చూపిస్తున్నారు కూడా. గతంలో జగన్ కూడా సీబీఐ కేసుల్లో భాగంగా జైలుకు వెళ్లొచ్చారు. తనను అనవసరంగా జైల్లో పెట్టించారన్న కోపమో.. ఏమో తెలియదు కానీ.. ఇప్పుడు జగన్ మాత్రం ఏ మాత్రం ఛాన్స్ దొరికినా టీడీపీ నేతలకు జైలు భోజనం రుచి చూపిస్తున్నారు.


వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లోనే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఓ కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడినీ అరెస్టు చేశారు. పాపం.. ఆయన తనకు పైల్ల్ ఉన్నాయి మొర్రో అంటున్నా వినకుండా గంటల తరబడి పోలీసులు జీబులో విజయవాడ తీసుకొచ్చారు.


ఇక ఇప్పుడు నారా లోకేశ్ వంతు వచ్చిందన్న అంచనాలు వస్తున్నాయి. ఈ విషయం సాక్షాత్తూ టీడీపీ నేతలే చెబుతున్నారు. ఇటీవల మైలవరం మైనింగ్ అంశంపై కాస్త రచ్చ చేసి జైలుకు వెళ్లిన దేవినేని ఉమ..  బెయిల్ పై విడుదలైన సమయంలో చేసిన కామెంట్లు భవిష్యత్ పరిణామాలను సూచిస్తున్నాయా అనిపిస్తోంది.   నారా లోకేశ్‌ను నెల రోజుల్లో అరెస్టు చేసేందుకు కుట్ర జరుగుతోందని దేవినేని ఉమా ఆరోపిస్తున్నారు కూడా.


మరి దేవినేని ఉమ కావాలనే ఈ మాట అన్నారా.. లేక ఏదైనా సమాచారంతో అలా అన్నారో తెలియదు కానీ.. అదే జరిగితే.. మరోసారి రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడం ఖాయం. నారా లోకేశ్ కూడా ఈ మధ్య దూకుడు పెంచారు. అనేక అంశాలపై ఆందోళనకు దిగుతున్నారు. జనంలోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పై కూడా ఏదైనా కేసు పెట్టి జైలుకు పంపుతారేమో అన్న ఆందోళన టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. దేవినేని ఉమ మాటలు అందుకు మరింత బలాన్నిస్తున్నాయి. మరి జగన్ సర్కారు అంత పని చేస్తుందా.. లేదా.. అన్నది ఓ నెల రోజుల్లో తేలిపోతుంది.





డేంజర్ జోన్‌లో ఆ టీడీపీ ఎమ్మెల్యేలు...నెక్స్ట్ వైసీపీకే ఛాన్స్?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?

చైల్డ్ పోర్నోగ్రఫిని అరికట్టడానికి ఆపిల్ సరికొత్త టెక్నాలజీ..

"ఎస్ఆర్ కళ్యాణమండపం"లో ఆ 20 నిమిషాలే కీలకమట !

టాప్ సెలెబ్రిటీల వాట్సాప్ చాట్ లీక్... అందులో ఏముందంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>