MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjuna7622a93-0c09-4983-9da4-92b37f87676f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjuna7622a93-0c09-4983-9da4-92b37f87676f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో వారసులు, వారసత్వం అనేది ఉన్నా టాలెంట్ లేకపోతే వారు హీరోగా ఎదిగిన సందర్భాలు అయితే లేవు. చాలామంది బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి టాలెంట్ లేక వెంటనే కనుమరుగైపోయారు. ఇంకొంతమంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా సూపర్ స్టార్స్ గా ఎదిగారు. ఆ విధంగా మెగా ఇమేజ్ తో గంగోత్రి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య ఆశీర్వాదాలతో, తండ్రి అల్లు అరవింద్ అండతో, మామయ్య మెగాస్టార్ చిరంజీవి దారిలో కి వచ్చిన అల్లు అర్జున్ తొలి సినిమాallu arjun{#}allu ramalingaiah;gunasekhar;Industry;Rudramadevi;Tollywood;Father;arya;Desamuduru;Gangothri;Aryaa;Allu Aravind;Allu Arjun;Chiranjeevi;Telugu;Blockbuster hit;India;Cinemaఅంచెలచెలుగా ఎదిగిన అల్లు అర్జున్.. ఏ సినిమా లైఫ్ ఇచ్చింది ?అంచెలచెలుగా ఎదిగిన అల్లు అర్జున్.. ఏ సినిమా లైఫ్ ఇచ్చింది ?allu arjun{#}allu ramalingaiah;gunasekhar;Industry;Rudramadevi;Tollywood;Father;arya;Desamuduru;Gangothri;Aryaa;Allu Aravind;Allu Arjun;Chiranjeevi;Telugu;Blockbuster hit;India;CinemaSat, 07 Aug 2021 12:00:00 GMT
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వారసులు, వారసత్వం అనేది ఉన్నా టాలెంట్ లేకపోతే వారు హీరోగా ఎదిగిన సందర్భాలు అయితే లేవు. చాలామంది బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి టాలెంట్ లేక వెంటనే కనుమరుగైపోయారు. ఇంకొంతమంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా సూపర్ స్టార్స్ గా ఎదిగారు. ఆ విధంగా మెగా ఇమేజ్ తో గంగోత్రి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య ఆశీర్వాదాలతో, తండ్రి అల్లు అరవింద్ అండతో, మామయ్య మెగాస్టార్ చిరంజీవి దారిలో కి వచ్చిన అల్లు అర్జున్ తొలి సినిమాతోనే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.


కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన గంగోత్రి సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. అసలు ఇతను హీరోనా అనే  కామెంట్స్ ఎదుర్కొని ఇప్పుడు స్టైలిష్ స్టార్ గా ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. తొలి సినిమా మంచి విజయం సాధించడంతో అల్లుఅర్జున్ తన తదుపరి సినిమా గా ఆర్య చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకున్నాడు. ఆ సినిమా ఆయనకు ఇచ్చిన నా బలం అంతా ఇంతా కాదు.  ఆ తర్వాత బన్నీ, హ్యాపీ, దేశముదురు వంటి సినిమాలతో వరుస విజయాలు సాధించి టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. 

ఆయన చేసిన తొలి పది సినిమాల వరకు ఒక్క ఫ్లాప్ ను కూడా ఎదుర్కోలేదు అంటే అల్లు అర్జున్ సినిమాల పట్ల ఎంత క్లారిటీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. వరుడు సినిమా ద్వారా తొలి ఫ్లాప్ ను అందుకున్న ఆయన మల్టీస్టారర్ సినిమాలను 2010లోనే మొదలుపెట్టారు వేదం సినిమాతో. ఆ తరువాత జులాయి, రేసుగుర్రం, సరైనోడు, సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం, అలవైకుంఠపురంలో వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్ లు చేసి ఐకాన్ స్టార్ గా ఎదిగారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన రుద్రమదేవి సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషించారు. ఇప్పుడు పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో ఆర్య సినిమా ఆయనను హీరోగా స్టైలిష్ స్టార్ గా నిలబెట్టింది అని చెప్పవచ్చు. 



అమరావతి ర్యాలీకి నో పర్మిషన్

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>