PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpe7714286-954d-434d-bae4-eaa4297705cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpe7714286-954d-434d-bae4-eaa4297705cb-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి...ప్రజలకు ఆవసరాలకు తగ్గట్టుగా నడవాల్సిన నాయకులు, ప్రతిపక్షాలని అణచడంలో ముందున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఈ తరహా రాజకీయాలు ఏపీలో ఎప్పుడు కనిపించలేదు. అప్పుడు అధికార, ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేసేవారు గానీ, ఇప్పుడు మాదిరిగా కక్ష పూరితమైన రాజకీయాలైతే చేసినట్లు లేరు. ysrcp{#}Jagan;politics;police;TDP;YCP;Arrestఆధిపత్యం కోసం వైసీపీ...టీడీపీకి ఊహించని ప్లస్..ఆధిపత్యం కోసం వైసీపీ...టీడీపీకి ఊహించని ప్లస్..ysrcp{#}Jagan;politics;police;TDP;YCP;ArrestSat, 07 Aug 2021 02:00:00 GMTఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి...ప్రజలకు ఆవసరాలకు తగ్గట్టుగా నడవాల్సిన నాయకులు, ప్రతిపక్షాలని అణచడంలో ముందున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఈ తరహా రాజకీయాలు ఏపీలో ఎప్పుడు కనిపించలేదు. అప్పుడు అధికార, ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేసేవారు గానీ, ఇప్పుడు మాదిరిగా కక్ష పూరితమైన రాజకీయాలైతే చేసినట్లు లేరు.

అయితే ఈ కక్షపూరిత రాజకీయాలు గత టీడీపీ ప్రభుత్వంలోనే కాస్త మొదలయ్యాయని చెప్పొచ్చు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు, కార్యకర్తలని ఏ విధంగా పెట్టారో అందరికీ తెలిసిందే. ప్రతి అంశంలోనూ వైసీపీని ఇబ్బంది పెడుతూనే వచ్చారు. అలాగే పోలీసు కేసులు కూడా పెట్టి, అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక జగన్‌ని ఎన్ని రకాలుగా అవమానించారో అన్నీ రకాలుగా అవమానించారు.

అలా జరగడం వల్లే ప్రజలకు జగన్ మీద సానుభూతి, టీడీపీ మీద ఆగ్రహం పెరిగి, వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కక్షపూరితమైన పాలన చేయడం లేదా? అంటే దానికి ప్రజల దగ్గరే సమాధానం ఉందని చెప్పొచ్చు. వైసీపీ వచ్చాక టీడీపీ నేతలకు ఏ రేంజ్‌లో చుక్కలు కనబడుతున్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకు ఎంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు జైలుకు వెళ్లారో కూడా చెప్పాల్సిన పని లేదు.

అయితే టీడీపీని అణిచివేసే కార్యక్రమంలో వైసీపీ నేతలు ఆధిపత్యం దక్కించుకోవడం కోసం ఎక్కడకక్కడ టీడీపీ నేతలని, కార్యకర్తలని అరెస్టులు చేయిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఇవన్నీ సక్రమమైన అరెస్టులా అంటే? అందులో ఎన్ని సక్రమమో వైసీపీకే తెలుసు. ఈ విధంగా వైసీపీ కూడా ముందుకెళ్లడంతో జనంలో టీడీపీ మీద సానుభూతి పెరిగేలా కనిపిస్తోంది. ఏదో తాము టీడీపీని అణిచివేస్తున్నామని వైసీపీ నేతలు ఫీల్ అవుతున్నారు తప్ప, వాస్తవానికి ఆ పరిస్తితి ఉన్నట్లు కనిపించడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే కష్టాల్లో ఉన్న టీడీపీని వైసీపీనే పైకి తీసుకోస్తున్నట్లు ఉంది.



ఆధిపత్యం కోసం వైసీపీ...టీడీపీకి ఊహించని ప్లస్..

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?

చైల్డ్ పోర్నోగ్రఫిని అరికట్టడానికి ఆపిల్ సరికొత్త టెక్నాలజీ..

"ఎస్ఆర్ కళ్యాణమండపం"లో ఆ 20 నిమిషాలే కీలకమట !

టాప్ సెలెబ్రిటీల వాట్సాప్ చాట్ లీక్... అందులో ఏముందంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>