Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ragurama22cd3b2e-92ba-4225-ad43-2a453902ed85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ragurama22cd3b2e-92ba-4225-ad43-2a453902ed85-415x250-IndiaHerald.jpgఅసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికైన వారు ఎలాగైతే తన నియోజకవర్గం తరఫున అసెంబ్లీలో పోరాటం చేయాలో అటు పార్లమెంటు ఎన్నికలలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు కూడా పార్లమెంటులో ఇక రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో విషయాలపై పోరాటం చేయాల్సి ఉంటుంది. ప్రతి విషయం పై పూర్తి స్థాయి అవగాహన తో తీసుకువెళ్లాలి. అయితే ఇటీవల ఏపీ నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ఎవరు పార్లమెంటులో రాష్ట్రం తరఫున ఎక్కువగా పోరాడారు ఎవరు నిబద్దత చూపించారు అన్న విషయం ఇటీవల బయటపడింది. అయితే ఇలా పార్లమెంటులో అద్భుతమైన ఫరRagurama{#}Nani;Telugu Desam Party;Guntur;devineni avinash;MP;Survey;narasapuram;Narsapur;Parliament;kadapa;Parliment;Yevaru;Congress;YCP;Andhra Pradesh;Partyజగన్ ను తిడతాడు కానీ.. ఆ విషయంలో రఘురామే టాప్?జగన్ ను తిడతాడు కానీ.. ఆ విషయంలో రఘురామే టాప్?Ragurama{#}Nani;Telugu Desam Party;Guntur;devineni avinash;MP;Survey;narasapuram;Narsapur;Parliament;kadapa;Parliment;Yevaru;Congress;YCP;Andhra Pradesh;PartySat, 07 Aug 2021 10:20:00 GMTఅసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికైన వారు ఎలాగైతే తన నియోజకవర్గం తరఫున  అసెంబ్లీలో పోరాటం చేయాలో అటు పార్లమెంటు ఎన్నికలలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు కూడా పార్లమెంటులో ఇక రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో విషయాలపై పోరాటం చేయాల్సి ఉంటుంది.  ప్రతి విషయం పై పూర్తి స్థాయి అవగాహన తో తీసుకువెళ్లాలి. అయితే ఇటీవల ఏపీ నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ఎవరు పార్లమెంటులో రాష్ట్రం తరఫున ఎక్కువగా పోరాడారు ఎవరు నిబద్దత చూపించారు అన్న విషయం ఇటీవల బయటపడింది.



 అయితే ఇలా పార్లమెంటులో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చూపించిన వారిలో రఘురామకృష్ణంరాజు టాప్ లో కొనసాగుతున్నట్లు తేలింది. ఏకంగా పార్లమెంటులో రఘురామకృష్ణంరాజు హాజరు శాతం 96% గా ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు పార్లమెంటు సమావేశాల్లో ఎన్నో డిబేట్ లలో పాల్గొన్న రఘురామకృష్ణంరాజు రాష్ట్రం తరఫున ఎన్నో ప్రశ్నలను కేంద్రానికి సంధించారు అన్న విషయం ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఓవైపు ఇక రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఇక ప్రభుత్వ తీరును ఖండిస్తూ ప్రస్తుతం వైసిపి రెబల్ ఎంపీగా కొనసాగుతున్నారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. అయితే రాష్ట్రంలో రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ పార్లమెంటు విషయానికి వచ్చేసరికి మాత్రం రామకృష్ణంరాజు  ఎంతో నిబద్ధతతోనే ఉంటున్నారు అని ఇటీవల సర్వే చెబుతోంది.



 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే కాదు తెలుగుదేశం పార్టీ ఎంపీలను సైతం దాటి పర్ఫామెన్స్ చేశాడు రఘురామకృష్ణంరాజు. ఇప్పటి వరకు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రెండున్నర సంవత్సరాలలో రఘురామకృష్ణంరాజు 50 డిబేట్ లలో పాల్గొన్నారట. అంతేకాదు 145 ప్రశ్నలు సంధించారట రఘురామకృష్ణంరాజు. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి  హాజరు శాతం తక్కువగా ఉన్నప్పటికీ ఆయన పాల్గొన్న డిబేట్ లలో మాత్రం ఎక్కువగానే  పర్ఫామెన్స్ చేసారట. ఇప్పటివరకు ఏకంగా ఆయన 146 ప్రశ్నలు సంధించాడట. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ 89 శాతం హాజరు శాతం ఉండగా 133 ప్రశ్నలు సంధించారు.  ఇక అటు మరో ఎంపీ కేశినేని నాని కూడా అటు గల్లా జయదేవ్కు సమానంగా పర్ఫామెన్స్ చేశారట. ఇలా పర్ఫామెన్స్ పరంగా రఘురామకృష్ణంరాజు టాప్ లో ఉన్నారు..



6 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఫస్ట్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్..

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>