MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/small-movies-futurea4ff1639-9c39-4ea8-8533-173f27ea8631-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/small-movies-futurea4ff1639-9c39-4ea8-8533-173f27ea8631-415x250-IndiaHerald.jpgకరోనా పీరియడ్ లో లాక్ డౌన్ కారణంగా మిగిలిన వాటి కంటే కూడా థియేటర్లకు కాస్త ఎక్కువగానే తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. అయితే ఈ మధ్య కరోనా కాస్త తగ్గడంతో థియేటర్లు ఓపెన్ అయి పూర్వ వైభవంతో వెలిగిపోతోన్న సమయంలో, ఇప్పుడు మళ్లీ కరోనా భయం మొదలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. SMALL MOVIES FUTURE{#}cinema theater;Coronavirus;Telugu;Audience;Cinemaచిన్న సినిమాల రాత మారేనా ?చిన్న సినిమాల రాత మారేనా ?SMALL MOVIES FUTURE{#}cinema theater;Coronavirus;Telugu;Audience;CinemaSat, 07 Aug 2021 17:12:05 GMTకరోనా పీరియడ్ లో లాక్ డౌన్ కారణంగా మిగిలిన వాటి కంటే కూడా థియేటర్లకు కాస్త ఎక్కువగానే తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. అయితే ఈ మధ్య కరోనా కాస్త తగ్గడంతో థియేటర్లు ఓపెన్ అయి పూర్వ వైభవంతో వెలిగిపోతోన్న సమయంలో, ఇప్పుడు మళ్లీ కరోనా భయం మొదలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. అయితే నిన్న అనగా 2021 ఆగస్ట్ 6 వ తేదిన ఏకంగా ఏడు తెలుగు సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అందులో ఎస్ ఆర్ కళ్యాణమండపం, ఇప్పుడు కాక ఇంకెప్పుడూ, ముగ్గురు మొనగాల్లు, మెరిసే మెరిసే, తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా అవి మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి.  అయితే మొన్నటి వరకు బయట అంతా బాగానే ఉన్నప్పటికీ కరోనా పేరు మళ్లీ మారుమ్రోగుతూ ఉండడంతో ప్రజల్లో కాస్త ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది. నిన్నటి నుండి లాక్ డౌన్ ఆంక్షలు షురూ అవడంతో ఈ ఎఫెక్ట్ రిలీజైన కొత్త సినిమాలపై పడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ప్రజలు కరోనా భయంతో బయటకు రావడం తగ్గించారు. 

ఎస్ ఆర్ కళ్యాణమండపం వంటి చిత్రాలకు ముందుగానే భారీ హైప్ ఉన్నా.. రిలీజ్ అయ్యే సమయానికి కరోనా కలకలం మళ్ళీ మొదలవడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది.  స్టార్ హీరోల సినిమాలైతే కరోనా కాస్త అటూ ఇటుగా ఉన్నా  ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు భారీగానే తరలి వస్తారు. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన తరుణంలో ఈ విషయం నిరూపితమైంది. ఆ సమయంలో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి రికార్డులు బద్దలు కొట్టింది వకీల్ సాబ్ చిత్రం. అయితే  చిన్న సినిమాలు ఇటువంటి సమయంలో రిస్క్ చేసి మరి థియేటర్ లోకి వెళ్లడం సమంజసమేనా అన్న భావనలో ప్రేక్షకులు ఉన్నట్లు అర్థమవుతుంది. మరి ఇప్పుడే ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతుంటే...రానున్న రోజుల్లో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో ఆచార్య, కేజీ ఎఫ్ చాప్టర్ 2 , పుష్ప , ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ ప్రాజెక్టులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.  వీటి సంగతి పక్కన పెడితే...వీటికి తోడుగా కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

ఇప్పుడిప్పుడే కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో విడుదలైన చిత్రాలే ప్రేక్షకుల్ని పెద్దగా థియేటర్ల వైపు ఆకర్షించలేకపోతున్నాయి. మరి అలాంటప్పుడు కొద్దిరోజుల తర్వాత పెద్ద సినిమాలతో పాటుగా (కాస్త అటూ ఇటుగా) విడుదలవనున్న చిత్రాల పరిస్థితి ఏమిటి...?? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా మరో వైపు అగ్రహీరోల చిత్రాలు ఈ రెండింటి నడుమ చిన్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం కాస్త క్లిష్టమైన పనే. అలాగని ఈ సినిమాల విడుదల ఆపినా నష్టం ప్రమాదముంది. మరి ఇన్ని సందిగ్ధతల నడుమ రానున్న రోజుల్లో చిన్న చిత్రాలు థియేటర్లలో విడుదల అవుతాయా ? లేక ఓటిటి బాట పడతాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతుండడం గమనార్హం.



టాలీవుడ్ లోకి కంగనా రీ ఎంట్రీ... కథిదే ?

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>