PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp96a7fe5d-59bc-44da-8530-8bc807742a78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp96a7fe5d-59bc-44da-8530-8bc807742a78-415x250-IndiaHerald.jpgఎక్కడైనా అధికార పార్టీలో రాజకీయంగా బలపడటానికి మంత్రులకు మంచి ఛాన్స్ ఉంటుంది. తమ పదవితో ఇంకా బలపడి ప్రత్యర్ధులకు అందనంత ఎత్తుకు ఎదగవచ్చు. అలాగే పదవి ద్వారా తమ నియోజకవర్గాలకు మంచి మంచి కార్యక్రమాలు చేసి, ఇంకా ఫాలోయింగ్ పెంచుకోవచ్చు. కానీ కొందరు మంత్రులు అలాంటి కార్యక్రమాల కంటే సొంత కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని పక్కనబెడతారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన చాలామంది చిత్తుగా ఓడిపోయారు. ఏదో అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప ysrcp{#}Jagan;Service;TDP;YCPఆ మంత్రులు మళ్ళీ గెలవడం కష్టమేనా?ఆ మంత్రులు మళ్ళీ గెలవడం కష్టమేనా?ysrcp{#}Jagan;Service;TDP;YCPSat, 07 Aug 2021 01:00:00 GMTఎక్కడైనా అధికార పార్టీలో రాజకీయంగా బలపడటానికి మంత్రులకు మంచి ఛాన్స్ ఉంటుంది. తమ పదవితో ఇంకా బలపడి ప్రత్యర్ధులకు అందనంత ఎత్తుకు ఎదగవచ్చు. అలాగే పదవి ద్వారా తమ నియోజకవర్గాలకు మంచి మంచి కార్యక్రమాలు చేసి, ఇంకా ఫాలోయింగ్ పెంచుకోవచ్చు. కానీ కొందరు మంత్రులు అలాంటి కార్యక్రమాల కంటే సొంత కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని పక్కనబెడతారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన చాలామంది చిత్తుగా ఓడిపోయారు. ఏదో అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప లాంటి వారు మాత్రమే గెలవగలిగారు.

ఇక టీడీపీ విషయాన్ని  పక్కనబెడితే ఇప్పుడు వైసీపీ మంత్రుల పరిస్తితి ఏంటంటే...వైసీపీ మంత్రులు కూడా అప్పుడు టీడీపీలో పనిచేసిన మంత్రులకు ఏ మాత్రం తీసిపోరని తెలుస్తోంది. జగన్ క్యాబినెట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు. ఈ 25 మంత్రులు ఎంతమంది తమ శాఖలపై పట్టు తెచ్చుకుని, ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారంటే...చెప్పడం చాలా కష్టమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

అన్నీ పనులు జగన్ చూసుకుండటంతో కొందరు మంత్రులకు ఇబ్బందులు రావడం లేదు గానీ, లేదంటే క్యాబినెట్‌లో సగం మంత్రులు మంచి పనితీరు కనబర్చడంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని అంటున్నారు. అందులో ఒక 9 మంది మంత్రులైతే అసలు మంచి ప్రదర్శన చేయడంలో విఫలమయ్యారని తెలుస్తోంది.

అంటే ఆ 9 మంత్రులు తమ శాఖలపై పట్టు తెచ్చుకోవడం కావొచ్చు, ప్రజలకు సేవ చేసే విషయం కావొచ్చు...ఎందులోనైనా వారు పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. పైగా మంత్రులు అయ్యాక వారు తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటంలో కూడా వెనుకబడి ఉన్నారని అంటున్నారు. ఆ నియోజకవర్గాల్లో మంత్రులు గడ్డు పరిస్తితిని ఎదురుకుంటున్నారని, ఎన్నికల సమయంలో వీరికి గెలుపు అంత సులువు కాదని చెబుతున్నారు. ఇప్పటికే ఆ మంత్రుల నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుంటుందని, ఇంకా పుంజుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆ మంత్రులు ఓడిపోవడం ఖాయమని అంటున్నారు.



ఆ మంత్రులు మళ్ళీ గెలవడం కష్టమేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?

చైల్డ్ పోర్నోగ్రఫిని అరికట్టడానికి ఆపిల్ సరికొత్త టెక్నాలజీ..

"ఎస్ఆర్ కళ్యాణమండపం"లో ఆ 20 నిమిషాలే కీలకమట !

టాప్ సెలెబ్రిటీల వాట్సాప్ చాట్ లీక్... అందులో ఏముందంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>