PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-ccfb50c2-9cc2-4c24-87a2-c3c567fe0b74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-ccfb50c2-9cc2-4c24-87a2-c3c567fe0b74-415x250-IndiaHerald.jpgద్రోహం చేసే వ్యక్తులను కూడా పార్టీకి దూరం పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి, టిఆర్ఎస్ కు గట్టిపోటీ ఇవ్వడానికంటే ముందు ఎక్కువగా వీటిపై దృష్టి సారించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎప్పుడు దూకుడుగా ప్రదర్శించే రేవంత్ రెడ్డి రాబోవు 2023లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడని, దాని కోసం పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడని, ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్లాలని అతనితోపాటు అందరికీ అదే ప్రణాళిక ప్రకారం నిPolitical {#}News;Revanth Reddy;Huzurabad;Dookudu;revanth;Party;Delhi;Congress;Telanganaకాంగ్రెస్ లో ఉన్న టిఆర్ఎస్ కోవర్టులు.. వీరేనా..?కాంగ్రెస్ లో ఉన్న టిఆర్ఎస్ కోవర్టులు.. వీరేనా..?Political {#}News;Revanth Reddy;Huzurabad;Dookudu;revanth;Party;Delhi;Congress;TelanganaSat, 07 Aug 2021 13:05:00 GMT తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని  మళ్లీ ఈ కింది స్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఢిల్లీ పెద్దలు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. దీంతో రేవంత్ రెడ్డి  ఇంకాస్త దూకుడు పెంచి ఆలోచనతో  పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు అని చెప్పవచ్చు. తెలంగాణలో పీసీసీ చీఫ్ పదవి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడం కోసం తనదైన మార్కు రాజకీయంతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక పని చేయాలని అనుకున్నట్టు  తెలుస్తూ ఉన్నది. అయితే రాష్ట్ర స్థాయిలో  కాంగ్రెస్ పార్టీ బలం పెంచేది ఎలా అని అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కు రేవంత్ రెడ్డి వివరించారు.
 పార్టీని ప్రక్షాళన చేయడం ఎంతో అవసరమని, కాంగ్రెస్ లోనే కొనసాగుతూ కొంత మంది టిఆర్ఎస్ కోవర్టులు కూడా ఉన్నారని ముందు వారిపై కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుం దని ఆయన హైకమాండ్ తెలియజేసినట్లు తెలుస్తోంది.

ముందుగా అలాంటి వ్యక్తులను బయటకు పంపితే , బాగుంటుందని తెలిపినట్లు సమాచారం. టిఆర్ఎస్ కెసిఆర్ కోవర్టుల వల్లే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనపడుతుందని  హైకమాండ్ కు రేవంత్ రెడ్డి వివరించినట్లు సమాచారం. ఎలాగైనా వారిని బయటకు పంపితే, ప్రజలకు కూడా కాంగ్రెస్ పై నమ్మకం ఏర్పడుతుందని అధిష్టానానికి వివరించాడని టాక్ వినిపిస్తోంది. వీటితో పాటుగా పార్టీ యొక్క క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై కూడా కఠినంగా చర్యలు తీసుకో వాలని, దీనికొరకు నాకు ఫ్రీడం కావాలని  ఆయన అధిష్టా నానికి కోరినట్టు తెలుస్తోంది. ఇలాంటి చీడ పురుగులను ఏరి వేస్తేనే మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ పూర్వవైభవాన్ని సాధిస్తుందని  ఆయన అధిష్టానానికి వివరించినట్లు సమా చారం. దీనిపై ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు  రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్టుగా ఉంటామని చెప్పినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అందుకే క్రమశిక్షణ తప్పి నటువంటి నేతలపై రేవంత్ రెడ్డి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడని పార్టీ నాయకుల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

రాబోయే రోజుల్లో  ఈ విషయం పై రేవంత్ ఇంకా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని, దీంతోపాటుగా పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులను కూడా పార్టీకి దూరం పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి  హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి, టిఆర్ఎస్ కు గట్టిపోటీ ఇవ్వడానికంటే ముందు ఎక్కువగా వీటిపై దృష్టి సారించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎప్పుడు దూకుడుగా ప్రదర్శించే రేవంత్ రెడ్డి  రాబోవు 2023లో  కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడని, దాని కోసం పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడని, ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్లాలని అతనితోపాటు అందరికీ అదే ప్రణాళిక ప్రకారం నియమాలు వర్తిస్తాయని ఆ నియమాలు  ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసినట్టు సమాచారం.



మతిపోగొడుతున్న ‘మాస్ట్రో’ భామ అందాలు..!

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>