తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఇద్దరు నిందితుల అరెస్ట్- రేప్ కు ముందు మరో హత్య- పరారీలో ఒకరు
ఏపీలో సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో సీతానగరంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ప్రకటించారు. అరెస్టు చేసిన నిందితులను ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది ఇసుకతిన్నెల్లో సేద తీరేందుకు వచ్చిన ఓ యువ జంటపై దాడి చేసి యువతిని దారుణంగా గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను పట్టుకునేందుకు గుంటూరు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. నిందితులు ఫోన్ వాడకపోవడంతో వీరిని పట్టుకోవడం కష్టమైంది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం ఇద్దరు నిందితుల్ని పట్టుకున్న పోలీసులు.. ఇవాళ అరెస్టు చూపించారు. మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టిన అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్.. ఘటన వివరాలను వెల్డడించారు.

జూన్ 19న రాత్రి సమయంలో ఈ గ్యాంగ్ రేప్ జరిగిందని గుంటూరు అర్బన్ ఎస్పీ తెలిపారు. నిందితుల్లో ఒకడైన కృష్ణ కిషోర్ ను విజయవాడ రైల్వే ట్రాక్ పై పట్టుకున్నామన్నారు. అయితే ఇతన్ని నిందితుడుగా నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు దొరకడం ఆలస్యమైందన్నారు. ఈ కేసులో ఇతనే ప్రధాన నిందితుడన్నారు. షేక్ హబీబ్ అనే మరో వ్యక్తి కూడా ఈ ఘటనలో పాలుపంచుకున్నాడని పోలీసులు తెలిపారు. అతన్ని కూడా అరెస్టు చేశారు. మరో నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడు.
గ్యాంగ్ రేప్ కు ముందు వీరు ఓ వ్యక్తిని సమీపంలోనే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే వంతెనపై రాగి తీగలు చోరీ చేస్తుండగా చూశాడని, శనక్కాయలు అమ్ముకునే వ్యక్తిని వీరు హత్య చేశారు. ఆ మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశారు. ఆ తర్వాత ఒంటరిగా కనిపించిన జంటపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు నిర్దారించారు. నిందితులకు గతంలో నేర చరిత్ర ఉందని, చిల్లర దొంగతనాలు, దాడులు చేసిన నేరాలు వీరిపై ఉన్నాయని పోలీసులు తెలిపారు
తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఇద్దరు నిందితుల అరెస్ట్- రేప్ కు ముందు మరో హత్య- పరారీలో ఒకరు#guntur, #tadepalli, pic.twitter.com/LxRPtQwtqF
— oneindiatelugu (@oneindiatelugu) August 7, 2021