EditorialRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tokyo-840404d9-4ba8-4c93-8c63-c97e6be1f7a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tokyo-840404d9-4ba8-4c93-8c63-c97e6be1f7a7-415x250-IndiaHerald.jpgదేశానికి ఈ పండుగ‌తో కొత్త ఆనందాలు రావాలి.ఎవ్వ‌రూ గుర్తించ‌నివి,గ‌మ‌నించనివి కొన్ని ఆట‌లు ఉన్నాయి. వాటిపై కూడా మ‌క్కువ పెంచుకుంటే మ‌న దేశంలో కొత్త కొత్త దారుల సృష్టికి మార్గం సుగ‌మం అవుతుంది.నీర‌జ్ చోప్రా ఆ ప‌ని చేశాడు. ర‌వి ఆ ప‌ని చేశాడు. ఇంకొంద‌రు కూడా ఇలాంటివి ఇంకొన్ని మంచి ప‌నులు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రోత్స‌హించ‌డం మీ వంతు.. వందేళ్ల క‌ల ఇది అని రాయ‌డం పెద్ద విడ్డూరం కాదు కానీ వందేళ్ల క‌ల‌కు ఇక్క‌డి మ‌నుషుల ప్రోత్సాహం ఎంత అన్న‌దే కీల‌కం. అదే ముఖ్యం కూ డా! దేశాన్ని న‌డిపించే శ‌క్తులు tokyo {#}Kurraduవిజేత‌కు వంద‌నం : బంగరు దేశానికి బంగారు ప‌త‌కంవిజేత‌కు వంద‌నం : బంగరు దేశానికి బంగారు ప‌త‌కంtokyo {#}KurraduSat, 07 Aug 2021 19:46:26 GMTమీ క‌ల‌ల‌ను పండించండి
మీ క‌ల నుంచి క‌ల వ‌ర‌కూ
ఈ దేశం ఈ దునియా మీ తోడు
మీరు ఓడినా గెలిచినా
మాకొక్క‌టే నూటా ముప్పై కోట్ల మందికి
నేనొక్క డినే అని చెప్ప‌డంలో గ‌ర్వం ఉంది
దానిని విజ‌య గ‌ర్వం అని అనాలె
కొత్త కుర్రాడి గెలుపు విశ్వాసం అన్నీ మ‌న‌వి
నీర‌జ్ చోప్రా  ఎవ‌రు స‌ర్
జావెలెన్ త్రో లో స్వ‌ర్ణ ప‌త‌కం తెచ్చిన వీరుడు

హ‌రియాణాలో పండుగ‌లు ఒక‌టి కాదు రెండు పండుగ‌లు అని రాయాలి. ఒకటి ర‌వి ద‌హియాది రెండ‌వి నీర‌జ్ ది. ర‌వి ద‌హియా రెజ్లింగ్ లో ర‌జ‌త ప‌త‌కం గెలుచుకుని, విజ‌య ప‌తాకం ఎగురవేస్తే మ‌రొక‌రు స్వ‌ర్ణంతో మ‌న ఇంట గెలుపును స్థిరం చేశారు. ఎ క్కువ‌గా రైతు కుటుంబాల నుంచి వ‌చ్చిన బిడ్డ‌లే ఈ ఏడాది  మ‌న దేశాన్నికొత్త దిశ‌గా న‌డిపిస్తున్నారు. వ్య‌వ‌సాయం ఉంటేనే రోజు గ‌డిచేది..అలాంటి కుటుంబంలో ఈ కుర్రాడు సునాయాస విజ‌యాలే త‌న కేరాఫ్ గా మ‌లుచుకున్నాడు. ఫ‌లానా వారి గెలుపు అంటే ఫ‌లానా వారి ప్ర‌తిభ‌కు అది కొల‌మానం అని న‌మ్మ‌కు..కానీ అది వారి స్వీయ సంక‌ల్పానికి ప్ర‌తీక అన్న‌ది మాత్ర‌మే గుర్తించు.

దేశానికి ఈ పండుగ‌తో కొత్త ఆనందాలు రావాలి.ఎవ్వ‌రూ గుర్తించ‌నివి,గ‌మ‌నించనివి కొన్ని ఆట‌లు ఉన్నాయి. వాటిపై కూడా మ‌క్కువ పెంచుకుంటే మ‌న దేశంలో కొత్త కొత్త దారుల సృష్టికి మార్గం సుగ‌మం అవుతుంది.నీర‌జ్ చోప్రా ఆ ప‌ని చేశాడు. ర‌వి ఆ ప‌ని చేశాడు. ఇంకొంద‌రు కూడా ఇలాంటివి ఇంకొన్ని మంచి ప‌నులు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రోత్స‌హించ‌డం మీ వంతు.. వందేళ్ల క‌ల ఇది అని రాయ‌డం పెద్ద విడ్డూరం కాదు కానీ వందేళ్ల క‌ల‌కు ఇక్క‌డి మ‌నుషుల ప్రోత్సాహం ఎంత అన్న‌దే కీల‌కం. అదే ముఖ్యం కూ డా! దేశాన్ని న‌డిపించే శ‌క్తులు వీటిని గ‌మ‌నిస్తే కొత్త క‌ల‌ల సృష్టి సాధ్యం అవుతుంది.మ‌న దేశంలో ఇప్పుడున్నంత ఉత్సాహం,ఉత్తేజం కొద్ది రోజుల‌కు ఉంటుందా? మ‌ళ్లీ మ‌న కొట్లాట‌ల్లో ఎంద‌రో ప్ర‌తిభావంతులు స‌రైన దారి లేక అవ‌స్థలు ప‌డుతుంటే అప్పుడు ఈ ప్ర‌ధా ని ఊతం ఇస్తే ఆ రోజు ఇలాంటి గెలుపుల‌కు సార్థ‌క‌త. గెలుపున‌కు సార్థ‌కత అంటే ఎలాంటి నిరాశలు ఎదురయినా, ఒక అప‌జ‌యం వెంటాడి వ‌చ్చినా వాటికి తిరిగి స‌మాధానం చెప్పేందుకు సిద్ధం అయిన కాల‌మే గెలుపు. ఆ గెలుపు ప‌త‌కాల్లో ఉంటుంద‌ని అను కోను కానీ కాలంలో ఉంటుంది. ఇది కాలం తెచ్చిన గెలుపు.. హ‌రియాణా వీరుడు ఇచ్చిన వ‌రం..వరం క‌దా జాగ్ర‌త్త‌! మ‌ళ్లీ ద‌క్కాలంటే మ‌రో వందేళ్ల స‌మ‌యం ప‌ట్ట‌కుండా ఉంటే చాలు. అది కూడా గెలుపున‌కు సార్థ‌క‌తే! టేకాఫ్ కుదిరిందా స‌ర్ .. అమితం అయిన ఉ త్సాహం..జీవితాల‌ను కొత్త మలుపుల‌కు తీసుకు వెళ్తాయి.. ప్ర‌తి మ‌లుపు లో ప్ర‌మాదంతో పాటు అప్ర‌మ‌త్త‌త అనే సూచిక కూడా ఉంటుంది.. ఈ గెలుపు ప్ర‌మాదం కాదు కానీ అప్ర‌మ‌త్త‌త‌కు సంకేతం అయితే మేలు.


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి



సీరియల్ హీరోకి భలే ఆఫర్ వచ్చిందిగా ?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>