PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-for-ys-sharmila-has-not-grow-in-party-ca96dca6-d1e0-4f0e-bf6a-e844e4ef362d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-for-ys-sharmila-has-not-grow-in-party-ca96dca6-d1e0-4f0e-bf6a-e844e4ef362d-415x250-IndiaHerald.jpgదివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చరిత్ర ఉంది. రాజశేఖరరెడ్డి పాలనలో తెలుగు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెబుతుంటారు. ఆయన పాలనలో విద్యార్థులకు, మరియు రైతులకు న్యాయం జరిగిందన్న మాట తరచూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ రెడ్డి వారసురాలు వైయస్ షర్మిల... తెలంగాణలో పార్టీ పెట్టారు. రాజన్న రాజ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పార్టీ ప్రకటించక ముందే... కెసిఆర్ ప్రభుత్వాన్ని వైయస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి పై కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు షర్మిల. ఇక వైయస్ షర్మిల పys sharmila{#}dr rajasekhar;Janasena;tuesday;TDP;Reddy;history;KTR;Yevaru;Telangana Rashtra Samithi TRS;Sharmila;KCR;Congress;Party;Telangana;Teluguషర్మిలా ఆటలో అరటి పండేనా?షర్మిలా ఆటలో అరటి పండేనా?ys sharmila{#}dr rajasekhar;Janasena;tuesday;TDP;Reddy;history;KTR;Yevaru;Telangana Rashtra Samithi TRS;Sharmila;KCR;Congress;Party;Telangana;TeluguSat, 07 Aug 2021 09:43:00 GMTదివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చరిత్ర ఉంది. రాజశేఖరరెడ్డి పాలనలో తెలుగు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెబుతుంటారు. ఆయన పాలనలో విద్యార్థులకు, మరియు రైతులకు న్యాయం జరిగిందన్న మాట తరచూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ రెడ్డి వారసురాలు వైయస్ షర్మిల... తెలంగాణలో పార్టీ పెట్టారు. రాజన్న రాజ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పార్టీ ప్రకటించక ముందే... కెసిఆర్ ప్రభుత్వాన్ని వైయస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి పై కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు షర్మిల. ఇక వైయస్ షర్మిల పార్టీ ప్రకటించిన అనంతరం మరింత దూకుడుగా వెళుతున్నారు.

ప్రతి మంగళవారం నిరుద్యోగుల సమస్యలపై.. షర్మిల దీక్షలు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా గులాబీ బాస్ కెసిఆర్ మరియు తెలంగాణ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారు షర్మిల. అసలు కేటీఆర్ అంటే ఎవరు ? అనే తరహా లో షర్మిల ప్రెస్ మీట్ లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ కంటే కేటీఆర్ ని షర్మిల టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే టిఆర్ఎస్ పార్టీపై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు.. గులాబీ నేతలు ఎవరు స్పందించడం లేదు. అసలు షర్మిల పార్టీ గురించి ఎక్కడా కూడా... ప్రస్తావించడం లేదు గులాబీ నేతలు. అటు కాంగ్రెస్ బిజెపి పార్టీలు సైతం... ఇదే ధోరణిని అమలు చేస్తున్నాయి. అన్న మీద కోపంతో తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టిందని పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

అసలు షర్మిల పార్టీ తెలంగాణలో మనుగడ లేకుండా పోతుందని అధికార టీఆర్ఎస్ పార్టీ తో పాటు కాంగ్రెస్ మరియు బి.జె.పి లు చెబుతున్నాయి. స్వయంగా గులాబీ బాస్ కెసిఆర్... పాన్ డబ్బా పెట్టినంత ఈజీగా పార్టీ పెట్టడం కాదని చురకలు అంటించిన విషయం తెలిసిందే. ఇక... 2023 లో షర్మిల పార్టీ ఏ మేరకు ఓటర్లను ప్రభావితం చేస్తుందా? లేదా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. వాస్తవానికి ఆంధ్రా నుంచి వచ్చిన ఏ పార్టీనీ కూడా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. దీనికి ఉదాహరణ టిడిపి పార్టీ. 2018 ఎన్నికల్లో టిడిపి పార్టీ పోటీ చేయడమే కాకుండా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఈ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలతీర్పు బలి కావాల్సి వచ్చింది.

 ఆంధ్ర నుంచి వచ్చిన పార్టీని టిఆర్ఎస్ పార్టీ చాలా ధీటుగా ఎదుర్కొంటుంది. ఒకవేళ 2023 ఎన్నికల్లో షర్మిల పార్టీ బరిలో నిలిస్తే... గులాబీ పార్టీ కి మరోసారి తెలంగాణ ప్రజలు పట్టం కట్టడం ఖాయం గా కనిపిస్తోంది. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ నువ్వు వాడుకోవడంలో గులాబీ పార్టీ నేతలు  ఆరితేరి ఉన్నారు. గులాబీ పార్టీ నేతల వ్యూహాలకు... షర్మిల పార్టీ బలి కాక తప్పదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.  ఏపీలో జనసేన పార్టీ అలాగే తెలంగాణలో షర్మిల పార్టీకూడా అయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రశ్నించడానికి తప్ప.... షర్మిల పార్టీ సీట్లు గెలవక పోవచ్చని అందరూ భావిస్తున్నారు.



బ‌న్నీకి ఆ ఒక్క విష‌యంలో 100 మార్కులు వేసిన రాఘ‌వేంద్ర‌రావు ?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?

చైల్డ్ పోర్నోగ్రఫిని అరికట్టడానికి ఆపిల్ సరికొత్త టెక్నాలజీ..

"ఎస్ఆర్ కళ్యాణమండపం"లో ఆ 20 నిమిషాలే కీలకమట !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>