Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila98fb56ac-038c-4b19-9b19-6151afe3d5d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila98fb56ac-038c-4b19-9b19-6151afe3d5d5-415x250-IndiaHerald.jpgఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇలా ప్రస్తుతం ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పటికీ అప్పటివరకు వైసీపీలో కీలక నేతగా కొనసాగిన వైయస్ షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది. వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ఇక తెలంగాణలో క్రీయాశీలక రాజకీయ నాయకురాలలిగా మారేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఏపీలో వైసీపీ గెలవడానికి షర్మిల కూడా ఒక కారణం అనSharmila{#}YCP;Prasthanam;Andhra Pradesh;Y. S. Rajasekhara Reddy;Sharmila;Jagan;Bharatiya Janata Party;Party;Telanganaనాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?Sharmila{#}YCP;Prasthanam;Andhra Pradesh;Y. S. Rajasekhara Reddy;Sharmila;Jagan;Bharatiya Janata Party;Party;TelanganaSat, 07 Aug 2021 10:30:00 GMTఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇలా ప్రస్తుతం ఏపీలో  జగన్ అధికారంలో ఉన్నప్పటికీ అప్పటివరకు వైసీపీలో కీలక నేతగా కొనసాగిన వైయస్ షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది. వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి  ఇక తెలంగాణలో క్రీయాశీలక రాజకీయ నాయకురాలలిగా మారేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తుంది.  అయితే ఏపీలో వైసీపీ గెలవడానికి షర్మిల కూడా ఒక కారణం అనే చెప్పాలి.



 అప్పట్లో జగన్ నిర్వహించిన పాదయాత్ర హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జగన్ పాదయాత్ర మధ్యలోనే వదిలేసి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ సమయంలో పాదయాత్ర ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అదే సమయంలో ఇక ప్రజా జీవితంలోకి అధికారికంగా వచ్చారు వైయస్ షర్మిల. అన్న జగన్ జైలుకు వెళ్లినప్పటికీ పాదయాత్రను ముందుండి నడిపించారు. ఇక వైసీపీ ని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకు ఎంతగానో ప్రయత్నం చేశారు వైయస్ షర్మిల. జగన్ జైలుకు వెళ్ళాడు అని ఇక పార్టీ శ్రేణులు నిరుత్సాహ పడకుండా అందరిలో ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపుతూ ప్రజా ప్రస్థానం అనే పేరుతో పాదయాత్రను కొనసాగించారు.



 ఇలా ఆనాడు జగన్ జైలుకు వెళ్లినప్పటికీ పాదయాత్రను కొనసాగించి ఇక వైసీపీ పార్టీని ప్రజలకు దగ్గర చేసిన షర్మిల ఇక ఇప్పుడు అన్న జగన్ అధికారంలో ఉండడానికి ముఖ్య కారణం గా మారిపోయారు.  అలాంటి షర్మిల ఇక ఇప్పుడు తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనే కొత్తపార్టీని స్థాపించింది. అయితే ఇప్పటికే ఇక తెలంగాణలో తిరుగులేని పార్టీగా కొనసాగుతుంది టిఆర్ఎస్.  అదే సమయంలో ఇక కొత్త అధ్యక్షుడి తో మరోసారి సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది కాంగ్రెస్.  ఇక వరుసగా అధికారపార్టీకి షాకులు ఇస్తున్న బిజెపి 2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఇలాంటి సమయంలో ఇక కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల ఒకప్పుడు వైసిపిని నిలబెట్టినట్టు గానే ఇక ఇప్పుడు తన పార్టీని నిలబెట్టుకుంటా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.



సుమ‌న్‌ను స్టార్ హీరో కాకుండా తొక్కేసింది ఎవ‌రు ?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>