MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hima-bindu5d4e613b-dcc4-4a29-a222-dc45fff7c89b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hima-bindu5d4e613b-dcc4-4a29-a222-dc45fff7c89b-415x250-IndiaHerald.jpgఈతరం మహిళల్లో మునుపెన్నడూ కనిపించని ఆత్మవిశ్వాసం, గతంలో లేని ధైర్యం రెండు కనిపిస్తున్నాయి. అందుకే ఎన్నో రంగాలలో విశేషంగా రాణించి తమ జీవితాన్ని తామే నిర్మించుకుంటున్నారు. ఒకరిపై ఆధారపడకుండా ఎంతో కష్టపడి చదివి జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదుగుతున్నారు. ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ ఇప్పటివరకు చాలామంది తమ జీవితాలలో విజయం సాధించగా భవిష్యత్తులో అందరూ ఆ విధంగానే జీవితాలను మలుచుకోవాలని వారు సందేశాన్ని ఇస్తున్నారు. ఆ విధంగా తాజాగా ఓ గిరిజన మహిళ జడ్జి పోస్టు దక్కించు కోవడం మహిళలకు స్ఫూర్తి నిస్తుందhima bindu{#}Nalgonda;Saturday;High court;court;Degree;March;mandalamజడ్జి పోస్ట్ లో గిరిజన మహిళజడ్జి పోస్ట్ లో గిరిజన మహిళhima bindu{#}Nalgonda;Saturday;High court;court;Degree;March;mandalamThu, 05 Aug 2021 11:41:00 GMTఈతరం మహిళల్లో మునుపెన్నడూ కనిపించని ఆత్మవిశ్వాసం, గతంలో లేని ధైర్యం రెండు కనిపిస్తున్నాయి. అందుకే ఎన్నో రంగాలలో విశేషంగా రాణించి తమ జీవితాన్ని తామే నిర్మించుకుంటున్నారు. ఒకరిపై ఆధారపడకుండా ఎంతో కష్టపడి చదివి జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదుగుతున్నారు. ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ ఇప్పటివరకు చాలామంది తమ జీవితాలలో విజయం సాధించగా భవిష్యత్తులో అందరూ ఆ విధంగానే జీవితాలను మలుచుకోవాలని వారు సందేశాన్ని ఇస్తున్నారు. ఆ విధంగా తాజాగా ఓ గిరిజన మహిళ జడ్జి పోస్టు దక్కించు కోవడం మహిళలకు స్ఫూర్తి నిస్తుంది.

నల్గొండ జిల్లాలోని పెద్దపుర మండలం లోనీ ఓ తండాకు చెందిన హిమబిందు శనివారం హై కోర్టు ప్రకటించిన ఫలితాల్లో జడ్జిగా ఎంపికయింది.  పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏమీ లేదని ఈ గిరిజన బిడ్డ నిరూపించింది. సాధారణ వ్యక్తులు కూడా సాధించలేని  ఈ ఘనత ను ఆమె సాధించి రికార్డుల్లోకి ఎక్కింది.  పేదరికంలో పుట్టిన ఆమెను, ఆమె ఎదుగుదలను ఆ పేదరికం ఏమాత్రం ఆపలేకపోయింది. 2019లో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యత్వం పొంది ప్రాక్టీస్ చేసింది. 

శనివారం హైకోర్టు ప్రకటించిన ఫలితాలలో తాను జడ్జ్ గా ఎంపిక అయినట్లు స్వయంగా వెల్లడించింది ఆమె. ఈ విషయం ఆమె తల్లిదండ్రులను గ్రామ వాసులను మండల ప్రజలను ఎంతగానో ఆనందపరిచింది. మహిళలపై చిన్నచూపు ఎప్పటినుంచో కొనసాగుతూ ఉండగా ఇప్పటి తరం వారు దానిని తుడిచి పెట్టే విధంగా తమ అడుగులు ముందుకు వేస్తున్నారు. వీరు ఎంతో మందిని చైతన్యవంతులుగా మార్చి వారిని కూడా తమ బాటలోకి తీసుకుని పోతున్నారు. ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో మహిళలు పురుషుల ను మించి తమ తమ రంగాలలో రాణిస్తారు అని తప్పకుండా చెప్పవచ్చు. ఇప్పటికే ప్రతి ఒక్కరు ఎదో సాధించాలనే ఆకాంక్షతో ఉన్నారు. 



రెడ్ ఫోర్ట్ వద్ద కలకలం!

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>