MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr26a3a829-d064-484d-84f3-8b3d47c8525c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr26a3a829-d064-484d-84f3-8b3d47c8525c-415x250-IndiaHerald.jpgవిశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఆయన. ఎన్టీయార్ అంటే నటనకు సరికొత్త భాష్యం చెప్పిన మేటిగా అంతా కొనియాడతారు. ఆయన మొదటి సినిమాలో ఎలా కష్టపడ్డారో చివరి వరకూ అదే విధంగా చిత్తశుద్ధిని చూపిస్తూ వచ్చారు. తాను స్టార్ హీరో అయ్యాను కదా అని తన మాట చెల్లాలనుకోలేదు ntr{#}NTRఎన్టీయార్ కమిట్మెంట్ చూసి అంతా షాక్... ?ఎన్టీయార్ కమిట్మెంట్ చూసి అంతా షాక్... ?ntr{#}NTRThu, 05 Aug 2021 20:00:00 GMTవిశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఆయన. ఎన్టీయార్ అంటే నటనకు సరికొత్త భాష్యం చెప్పిన మేటిగా అంతా కొనియాడతారు. ఆయన మొదటి సినిమాలో ఎలా కష్టపడ్డారో చివరి వరకూ అదే విధంగా చిత్తశుద్ధిని చూపిస్తూ వచ్చారు.

తాను స్టార్ హీరో అయ్యాను కదా అని తన మాట చెల్లాలనుకోలేదు. నిత్య విద్యార్ధిగానే ఉన్నారు. కాబట్ట మహా నటుడు కాగలిగారు. ఇదిలా ఉండగా ఎన్టీయార్ 1980 టైమ్ లో చాలా జోరుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన దాసరి కాంబోలో సర్దార్ పాపారాయుడు మూవీ తీస్తున్న రోజులవి. ఆ మూవీలో బుల్లెట్ మీద ఎన్టీయార్ శ్రీదేవిని టీజ్ చేస్తూ పాడే పాట ఒకటి ఉంది.

ఆ పాటలో ఎన్టీయార్ ఒక వైపు బుల్లెట్ డ్రైవ్ చేస్తూ నటించాలి. ఆ టైమ్ లో అనుకోకుండా ఆయన బుల్లెట్ మీద నుంచి పడిపోయారు. యాక్సిడెంట్ అయి కుడి చేయికి పెద్ద దెబ్బ తగిలింది. దాంతో కట్టు కట్టాల్సి వచ్చింది. కొన్నాళ్ళు షూటింగులు ఆపాలని కూడా డాక్టర్లు చెప్పారు. అయితే ఎన్టీయార్ కొద్ది రోజులు కూడా రెస్ట్ తీసుకోకుండా వెంటనే షూటింగులకు హాజరు కావడం నిర్మాతలకు దర్శకులకు ఆశ్చర్యం అనిపించిందిట.

ఆయన ఆ టైమ్ లో పెండింగులో ఉన్న తన సినిమాలలోని సాంగ్స్ పార్ట్ ని కంప్లీట్ చేశారుట. ఆయన కోటు తొడుక్కుని కట్టు కట్టిన కుడి చేయిని కోటు జేబులో ఉంచుకుని దాన్నే ఒక స్టైల్ గా మార్చి కేవలం ఎడమ చేతితోనే డ్యాన్స్ చేస్తూ మొత్తానికి  బాగా మ్యానేజ్ చేశారు. అప్పట్లో వచ్చిన కొన్ని సినిమాల్లో ఎన్టీయార్ కంప్లీట్ గా తన కుడి చేతిని అలా ఉంచేసి డ్యాన్సులు చేయడం జాగ్రత్తగా చూస్తే స్పష్టంగా  కనిపిస్తుంది. మామూలుగా అయితే ఎవరూ పోల్చలేరు కూడా. అలా ఎన్టీయార్ తన కమిట్మెంట్ ఏంటో చూపించి నిర్మాతలకు సేవ్ చేయడమే కాకుండా తాను మహా నటుడిని అనిపించుకున్నారు.





జమిలి అంటే గుబులే ...?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>