Illegal affair: భార్య పక్కా టైమ్ టేబుల్, భార్య ప్రియుడిని బెడ్ రూమ్ లో స్పాట్ లో చంపిన భర్త !
చెన్నై: హ్యాపీగా భర్తతో కాపురం చేసుకుంటున్న భార్య తప్పుదోవ పట్టింది. ఐరన్ షాపుకు వచ్చి వెలుతున్న వ్యక్తితో చనువు పెంచుకున్న భార్య అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త ఐరన్ షాపులో బిజీగా ఉంటే భార్య ప్రియుడితో కలిసి బెడ్ రూమ్ లో ఫుల్ బిజీ అయిపోయింది. కిలాడి భార్య పక్కా టైమ్ టేబుల్ రెడీ చేసుుకున్ని భర్త, ప్రియుడు క్లాష్ కాకుండా చూసుకుంది. చాలా కాలం భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలీలేదు. బట్టలు ఐరన్ చేపించుకోవడానికి వచ్చి వెలుతున్న వారు నీ భార్యకు ప్రియుడు ఉన్నాడు జాగ్రత్త ? అంటూ ఆమె భర్తకు చెవిలో ఊదారు. కొంతకాలం భార్య మీద నిఘా వేసిన భర్త టైమ్ చూసి దెబ్బ కొట్టాలని వేచి చూశాడు. ప్రియుడితో కలిసి భార్య రోమాన్స్ చేస్తున్న సమయంలో క్వాటర్ మందు తాగిన భర్త ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతే బెడ్ రూమ్ లో నుంచి భార్య ప్రియుడితో కలిసి బయటకు రావడంతో భర్త రగిలిపోయాడు. అప్పటికే నిషాలో ఉన్న భర్త కత్తి తీసకుని భార్య ప్రియుడిని స్పాట్ లో చంపేశాడు.

భర్తకు ఐరన్ షాపు
తమిళనాడులోని అంబూరు సమీపంలోని బాగలూరులో ఢిల్లీ బాబు నివాసం ఉంటున్నాడు. ఢిల్లీ బాబు అతని భార్య లక్ష్మీ, కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. బాగలూరులోనే ఢిల్లీ బాబు ఐరన్ షాపు (ఇస్త్రీ షాపు) నిర్వహిస్తున్నాడు. బాగలూరులో నివాసం ఉంటున్న చాలా మంది ఢిల్లీ బాబు షాపులోనే దస్తులు ఐరన్ చేపించుకుంటున్నారు.

ఐరన్ చేస్తున్న భార్య
సొంతంగా ఐరన్ షాపు పెట్టుకున్న ఢిల్లీ బాబు ఉదయం, సాయంత్రం అతనే బట్టలు ఐరన్ చేస్తున్నాడు. మద్యాహ్నం పూట ఢిల్లీ బాబు భార్య లక్ష్మీ బట్టలు ఐరన్ చేస్తోంది. భర్త ఢిల్లీ బాబు ఊరికి వెళ్లిన సమయంలో రోజంతా, రాత్రి భర్త మందు కొట్టడానికి వెళ్లిన సమయంలో అతని భార్య లక్ష్మీ బట్టలు ఐరన్ చేస్తోంది.

అదే ఊరిలో పొటుగాడు
బాగలూరులోనే నివాసం ఉంటున్న గోవిందస్వామి (54) అనే వ్యక్తి అగ్గిపులు తయారు చేసే ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. గోవిందస్వామికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకే ఊరిలో నివాసం ఉంటున్న ఢిల్లీ బాబు, అతని భార్య లక్ష్మికి గోవిందస్వామి ముందునుంచే బాగా తెలుసు. బట్టలు ఐరన్ చేయించుకోవడానికి వెళ్లి వస్తున్న గోవిందస్వామి ఐరన్ షాపు దగ్గర ఎక్కువ సేపు ఉంటున్నాడు.

ఫ్రెండ్ భార్యను గోకేశాడు
ఢిల్లీ బాబు షాపులో లేని సమయంలో అక్కడికి వెలుతున్న గోవిందస్వామి బట్టలు ఐరన్ చేస్తున్న లక్ష్మీకి లైన్ వేశాడు. భర్త, ఇద్దరు బిడ్డలు ఉన్నారు అని మరిచిపోయిన లక్ష్మీ కూడా గోవిందస్వామిని రెచ్చగొట్టి కైపు ఎక్కించే మాటలు మాట్లాడి అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే అప్పటి నుంచి గోవిందస్వామి, లక్ష్మీ ఇద్దరూ ఫోన్లు చేసుకుని మాట్లాడుకుంటున్నారు.

మొగుడు బార్ లో..... ప్రియుడు బెడ్ రూమ్ లో
గోవిందస్వామి, లక్ష్మీ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఐరన్ షాము మూసివేస్తున్న ఢిల్లీ బాబు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు లిక్కర్ షాపులో మద్యం సేవించి తరువాత ఇంటికి వెలుతున్నాడు. భర్త మందు టైమింగ్ బాగా తెలిసిన అతని భార్య లక్ష్మి ప్రియుడు గోవిందస్వామిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేస్తోంది.

భర్త చెవిలో ఊదిన స్నేహితులు
భర్త ఢిల్లీ బాబు ఐరన్ షాపులో బిజీగా ఉంటే అతని భార్య లక్ష్మీ ఆమె ప్రియుడు గోవిందస్వామితో కలిసి బెడ్ రూమ్ లో ఫుల్ బిజీ అయిపోయింది. చాలా కాలం భార్య లక్ష్మీ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త ఢిల్లీ బాబుకు తెలీలేదు. బట్టలు ఐరన్ చేపించుకోవడానికి వచ్చి వెలుతున్న వారు నీ భార్య లక్ష్మీకి గోవిందస్వామి ప్రియుడు అయ్యాడు జాగ్రత్త ? అంటూ ఢిల్లీ బాబు భర్తకు చెవిలో ఊదారు.

భార్య మీద నిఘా వేసిన భర్త
కొంతకాలం భార్య లక్ష్మీ మీద నిఘా వేసిన ఆమె భర్త ఢిల్లీ బాబు టైమ్ చూసి గోవిందస్వామిని దెబ్బ కొట్టాలని వేచి చూశాడు. రాత్రి 9 గంటలకు ఢిల్లీ బాబు మందు కొట్టడానికి వెళ్లాడు. ఆ సమయంలో ప్రియుడు గోవిందస్వామిని ఇంటికి పిలిపించుకున్న లక్ష్మీ రోమాన్స్ లో మునిగిపోయింది. తరువాత క్వాటర్ మందు తాగిన భర్త ఢిల్లీ బాబు రాత్రి 10 గంటలకు అతని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ప్రియుడు ఔట్..... పెళ్లామ్ జస్ట్ మిస్
రాత్రి 10 గంటల సమయంలో బెడ్ రూమ్ లో నుంచి భార్య లక్ష్మీ, ఆమె ప్రియుడు గోవిందస్వామితో కలిసి బయటకు రావడంతో భర్త ఢిల్లీ బాబు రగిలిపోయాడు. వెంటనే కత్తి తీసుకున్న ఢిల్లీ బాబు ఇంటికి వచ్చిన భార్య ప్రియుడు గోవిందస్వామిని ఇష్టం వచ్చినట్లు పొడిచి స్పాట్ లో చంపేశాడు. ఆ సమయంలో గట్టిగా కేకలు వేసిన లక్ష్మీ భర్త నుంచి తప్పించుకుని ఇంటి నుంచి బయటకు పరుగు తీసింది. భార్య లక్ష్మీ ప్రియుడిని చంపేసిన ఢిల్లీ బాబు కత్తి జోబులో పెట్టుకుని దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

చంపేసి చెక్కేసిన మొగుడు
అక్రమ సంబంధం కారణంగా ప్రియురాలి ఇంటిలోనే గోవిందస్వామి దారుణ హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి గోవిందస్వామి శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్రమ సంబంధం కారణంగా గోవిందస్వామి హత్యకు గురైనాడని, హత్య చేసి పారిపోయిన ఢిల్లీ బాబు కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.