PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag1619b385-0a80-41f2-8c9d-7fb5a13699e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag1619b385-0a80-41f2-8c9d-7fb5a13699e9-415x250-IndiaHerald.jpgకేంద్రంలో అధికారంలో ఉందిక‌దా అని అంట‌కాగుదామ‌నుకుంటే దేశంలోని ప్ర‌జ‌లంద‌రినీ అంట‌కాగేలా చేస్తోంది న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే వంట‌గ్యాస్ సిలిండ‌ర్ రూ.880 అయింది. అలాగే పెట్రోల్‌, డీజిల్ లీట‌రు రూ.110కి చేరాయి. రెండింటికీ పైస‌ల్లోనే తేడా క‌న‌ప‌డుతోంది. ఇవి ఎందుకు పెరుగుతున్నాయో ప్ర‌జ‌ల‌కు అర్థంకాక‌పోయినా ప్ర‌భుత్వానికైనా అర్థ‌మ‌వుతోందా అంటే ఆ విష‌యం ఎవ‌రికీ అర్థంకావ‌డంలేదు. కావాల‌నే పెంచుతున్నారంటూ బీజేపీలోనివారే చాటుగా విమ‌ర్శిస్తున్నారు. జీఎస్టీ ఆదాయానికి తోడు పెట్రోల్‌, డీజిల్‌పై ప‌న్నtag{#}Somu Veerraju;Yatra;Diesel;central government;Bharatiya Janata Party;Telugu Desam Party;YCPఎవ‌రికి వారే.. య‌మునా తీరే..ఎవ‌రికి వారే.. య‌మునా తీరే..tag{#}Somu Veerraju;Yatra;Diesel;central government;Bharatiya Janata Party;Telugu Desam Party;YCPThu, 05 Aug 2021 09:47:00 GMT

కేంద్రంలో అధికారంలో ఉందిక‌దా అని అంట‌కాగుదామ‌నుకుంటే దేశంలోని ప్ర‌జ‌లంద‌రినీ అంట‌కాగేలా చేస్తోంది న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే వంట‌గ్యాస్ సిలిండ‌ర్ రూ.880 అయింది. అలాగే పెట్రోల్‌, డీజిల్ లీట‌రు రూ.110కి చేరాయి. రెండింటికీ పైస‌ల్లోనే తేడా క‌న‌ప‌డుతోంది. ఇవి ఎందుకు పెరుగుతున్నాయో ప్ర‌జ‌ల‌కు అర్థంకాక‌పోయినా ప్ర‌భుత్వానికైనా అర్థ‌మ‌వుతోందా అంటే ఆ విష‌యం ఎవ‌రికీ అర్థంకావ‌డంలేదు. కావాల‌నే పెంచుతున్నారంటూ బీజేపీలోనివారే చాటుగా విమ‌ర్శిస్తున్నారు. జీఎస్టీ ఆదాయానికి తోడు పెట్రోల్‌, డీజిల్‌పై ప‌న్నుల రూపంలో వ‌చ్చే ఆదాయం కేంద్ర ప్ర‌భుత్వ ఖ‌జానాను నింపేస్తున్నాయి. ఈ త‌ర‌హా పాల‌న కొన‌సాగిస్తోన్న బీజేపీతో అంట‌కాగితే జ‌న‌సేన పార్టీకి భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్లున్నారు. అందుకే ఆయ‌న కూడా బీజేపీతో క‌లిసి ఏ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంలేదు. వంట‌గ్యాస్ ధ‌ర‌పై మ‌హిళ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోన్న వ్య‌తిరేక‌త త‌మ పార్టీపై ఎక్క‌డ ప్రభావం చూపుతుందోన‌ని జ‌న‌సేన నేత‌ల ఆదుర్దా ప‌డుతున్నారు.

జ‌న‌సేన‌తో సంబంధం లేకుండా ముందుకు
బీజేపీ నేత‌లు కూడా ఏపీలో ఎక్క‌డిక‌క్క‌డ త‌మ సొంత కార్య‌క్ర‌మాలు రూపొందించుకుంటున్నారు. టిప్పుసుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటుకు సంబంధించి బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అలాగే ఎమ్మిగ‌నూరు వైసీపీ ఎమ్మెల్యే గోవ‌ధ గురించి మాట్లాడ‌టాన్ని కూడా ఆయ‌న ఖండించారు. ఏపీలో కూడా గోవ‌ధ గురించి ప్ర‌త్యేక చ‌ట్టం తీసుకురావాల‌ని సోము డిమాండ్ చేశారు. ఇప్పుడు వారు ఆల‌యాల సంద‌ర్శ‌న యాత్ర చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదంతా వారికివారే సొంతంగా రూపొందించుకున్న కార్య‌క్ర‌మం. ఎక్క‌డా జ‌న‌సేన ప్ర‌స్తావ‌న రావ‌డంలేదు. బీజేపీ నేత‌లు కూడా జ‌న‌సేన‌తో సంబంధం లేకుండా ముందుకు వెళ్దామ‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

బీజేపీ ఇలా.. వైసీపీ అలా..
జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కు కూడా ఇప్పుడు ఏమీ పాలుపోని ప‌రిస్థితి. బీజేపీ తీరు చూస్తే ఇలా ఉంది.. వైసీపీ ఆగ‌డాలను అడ్డుకుందామంటే ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు.. ప‌వ‌న్ మ‌న‌సులో తెలుగుదేశం ఉందంటూ బీజేపీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న దాన్ని ఖండించ‌డంలేదు. భ‌విష్య‌త్తులో తెలుగుదేశం పార్టీతో క‌లిసి వెళ్ల‌డ‌మే మంచిద‌నే అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే అది ఎంత‌వ‌ర‌కు సాధ్య‌ప‌డుతుంద‌నేది జ‌న‌సేనానికే తెలియాలి. భ‌విష్య‌త్తులో సంభ‌వించ‌బోయే ప‌రిణామాల‌నుబ‌ట్టి ఒక అంచ‌నా వేసుకొని ఎవ‌రితో క‌లిసివెళ్లాల‌నేది నిర్ణ‌యించుకోవ‌చ్చంటున్నారు. ఇత‌ర నేత‌ల ఆలోచ‌న కూడా అలాగే ఉంటోందంటున్నారు.










క‌మ‌లంతో గులాబి స్నేహం..? ఇక్క‌డ ఇలా..అక్క‌డ అలా !

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>