Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/punjud827984e-37cd-4fb1-a548-b2a0f0ccadf6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/punjud827984e-37cd-4fb1-a548-b2a0f0ccadf6-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎంతో చిత్రవిచిత్ర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. జన్యుపరమైన మార్పుల కారణంగా కొన్ని జంతువులకు వేరే జంతువుల పోలికలతో ఉన్న పిల్లలు పుట్టడం లాంటివి కూడా ఇటీవలి కాలంలో చాలానే జరిగాయి. ఇక్కడ ఇలాంటి ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్రకృతి ధర్మం ప్రకారం కోడి పెట్ట గుడ్డు పెడుతుంది. అంతేకాదు ఇక ఆ గుడ్లను పొదిగి పిల్లలను కూడా తీస్తుంటుంది కోడిపెట్ట. ఇది సాధారణంగా ఎక్కడైనా జరిగేదే. కానీ కోడిపుంజు గుడ్డు పెట్టడం ఎప్పుడైనా విన్నారా.. కోడిపుంజు గుడ్డు పెట్టడం ఏంటండీ.. సృష్టి ధర్Punju{#}prakruti;Scheduled caste;East Godavari;Egg;mandalam;Doctor;Reddyవైరల్ : కోడిపుంజు గుడ్లు పెట్టింది?వైరల్ : కోడిపుంజు గుడ్లు పెట్టింది?Punju{#}prakruti;Scheduled caste;East Godavari;Egg;mandalam;Doctor;ReddyThu, 05 Aug 2021 10:14:00 GMTఇటీవల కాలంలో ఎంతో చిత్రవిచిత్ర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. జన్యుపరమైన మార్పుల కారణంగా కొన్ని జంతువులకు వేరే జంతువుల పోలికలతో ఉన్న పిల్లలు పుట్టడం లాంటివి కూడా ఇటీవలి కాలంలో చాలానే జరిగాయి. ఇక్కడ ఇలాంటి ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్రకృతి ధర్మం ప్రకారం కోడి పెట్ట గుడ్డు పెడుతుంది.  అంతేకాదు ఇక ఆ గుడ్లను పొదిగి పిల్లలను కూడా తీస్తుంటుంది కోడిపెట్ట. ఇది సాధారణంగా ఎక్కడైనా జరిగేదే.

 కానీ కోడిపుంజు గుడ్డు పెట్టడం ఎప్పుడైనా విన్నారా.. కోడిపుంజు గుడ్డు పెట్టడం ఏంటండీ.. సృష్టి ధర్మం ప్రకారం అలా అసలు జరుగుతుందా..  అన్నీ తెలిసి కూడా మీరు కూడా జోకులు వేస్తారేందుకు అంటూ పగలబడి నవ్వుకుంటారు ఈ విషయం చెబితే ఎవరైనా. కానీ అలా నవ్వుకున్నారు అంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే నిజంగానే ఇక్కడ కోడిపుంజు గుడ్డు పెట్టింది. ఇక్కడ జరిగిన ఘటన నిజంగానే సృష్టి ధర్మానికి విరుద్ధంగా జరిగింది.. కోడి పుంజు గుడ్డు పెట్టడమే కాదు పిల్లలను కూడా పొదిగింది. ఈ ఘటన ఎక్కడో జరగలేదు తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చి వైరల్ గా మారిపోయింది.



 తొట్టంబేడు మండలం లోని పెద్ద కన్నలి ఎస్సీ కాలనీలో ఉండే సుబ్రహ్మణ్యం రెడ్డి ఇంట్లో నాలుగు కోళ్లతో పాటు ఒక పుంజు కూడా ఉంది. అయితే ఇటీవలే పుంజు 5 గుడ్లు పెట్టింది. ఇక తమ వద్ద ఉన్న నాలుగు కోళ్ల లో ఏదో ఒకటి గుడ్లు పెట్టి ఉంటుంది అని మొదట యజమాని లైట్ తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఓ రోజు గమనించి ఆశ్చర్యపోయాడు. ఇక ఇంకా అనుమానంతో ఆ గుడ్లు తీసుకెళ్లి ఆ కోడిపుంజు కింద పెట్టాడు. దీంతో ఆ కోడిపుంజు ఏకంగా ఐదు గుడ్లను కూడా పొదిగి పిల్లలను తీసింది. అంతేకాదు కోడిపెట్ట లాగానే కోడిపుంజు 5 పిల్లలను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంది. ఇక ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అందరూ ఆ కోడిపుంజు, కోడి పిల్లలను కూడా చూసేందుకు వస్తున్నారు. అయితే జన్యుపరమైన కారణాలతో నే ఇలా అరుదుగా జరుగుతూ ఉంటుందని వెటర్నిటీ డాక్టర్ వీరభద్రారెడ్డి చెబుతున్నారు.



వాట్సాప్ లో ఒక్క మెసేజ్.. 40 లక్షలు గాన్?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>