PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagf42ee20f-5f25-4f58-8e2f-de66803453f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagf42ee20f-5f25-4f58-8e2f-de66803453f5-415x250-IndiaHerald.jpgహుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు జ‌ర‌గ‌నుందో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కూడా తెలియ‌దు. ఎప్పుడు ఎన్నిక ఉంటుంద‌నేది ఏ పార్టీకి స్ప‌ష్ట‌త లేదు. కానీ నియోజ‌క‌వ‌ర్గం మాత్రం తాజాగా స‌ర్వేల పేరుతో వేడెక్కింది. ఆయా రాజ‌కీయ పార్టీలు ఎలాగూ స‌ర్వే నిర్వ‌హించుకుంటాయి. ఇవి కాకుండా మీడియా సంస్థ‌లు, ఇత‌ర సంస్థ‌లు కొన్ని ఎవ‌రికివారే హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నారు. దీనికోసం మండ‌లానికి వంద‌మంది యువ‌త‌ను ఉప‌యోగించుకుంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గం మొత్తంమీద ఎక్క‌డ చూసినా స‌ర్వేtag{#}Revanth Reddy;youth;KCR;Bharatiya Janata Party;media;Congress;Telangana;central government;Partyహుజూరాబాద్‌పై మీరేమ‌నుకుంటున్నారు?హుజూరాబాద్‌పై మీరేమ‌నుకుంటున్నారు?tag{#}Revanth Reddy;youth;KCR;Bharatiya Janata Party;media;Congress;Telangana;central government;PartyThu, 05 Aug 2021 17:32:00 GMT
హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు జ‌ర‌గ‌నుందో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కూడా తెలియ‌దు. ఎప్పుడు ఎన్నిక ఉంటుంద‌నేది ఏ పార్టీకి స్ప‌ష్ట‌త లేదు. కానీ నియోజ‌క‌వ‌ర్గం మాత్రం తాజాగా స‌ర్వేల పేరుతో వేడెక్కింది. ఆయా రాజ‌కీయ పార్టీలు ఎలాగూ స‌ర్వే నిర్వ‌హించుకుంటాయి. ఇవి కాకుండా మీడియా సంస్థ‌లు, ఇత‌ర సంస్థ‌లు కొన్ని ఎవ‌రికివారే హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నారు. దీనికోసం మండ‌లానికి వంద‌మంది యువ‌త‌ను ఉప‌యోగించుకుంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గం మొత్తంమీద ఎక్క‌డ చూసినా స‌ర్వేల హ‌డావిడే క‌న‌ప‌డుతోంది.

నియోజ‌క‌వ‌ర్గం మొత్తం స‌ర్వేల‌తో హ‌డావిడి?
ఒకేసారి ప‌లు సంస్థ‌లు ప్ర‌జ‌ల నాడి తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం అరుదుగానే జ‌రుగుతుంటుంది. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం ఎక్క‌డ చూసినా స‌ర్వేల పేరుతో య‌వ‌తే క‌న‌ప‌డుతోంది. ఏ పార్టీ త‌ర‌ఫున ఏ అభ్య‌ర్థి నిల‌బ‌డ‌తాడు?  మీరు ఎవ‌రికి ఓటేయాల‌నుకుంటున్నారు? ఈటెల రాజేంద‌ర్ స్వ‌తంత్రంగా పోటీచేస్తే బాగుంటుందా?  భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌ర‌ఫున పోటీచేస్తే బాగుంటుందా? ఆయ‌న మీద మీ అభిప్రాయం ఏమిటి?  ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న ఎలా ఉంది?  తెలంగాణ రాష్ట్ర స‌మితి నుంచి ఈటెల‌ను బ‌య‌ట‌కు పంపించేయ‌డంపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? ఈటెల‌ను కేసీఆర్ అవ‌మానించార‌ని మీరు భావిస్తున్నారా?  నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఏమిటి?  రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అవ‌డానికి ముందు ప‌రిస్థితి ఏమిటి? అయిన త‌ర్వాత ఆ పార్టీ ప‌రిస్థితి ఏమిటి? ఈటెల ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు ఇక్క‌డ అభివృద్ధి ఎలా జ‌రిగింది? ఆయ‌న బీజేపీ త‌ర‌ఫున రంగంలోకి దిగ‌డంపై మీ అభిప్రాయం ఏమిటి? ఆయ‌న‌పై ఉన్న భూక‌బ్జాల ఆరోప‌ణ మీరు న‌మ్ముతున్నారా?  కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు పోటీచేస్తే బాగుంటుంది?  లాంటి ప్ర‌శ్న‌ల‌తో యువ‌త నియోజ‌క‌వ‌ర్గం మొత్తం హ‌డావిడి చేస్తున్నారు.

రాజ‌కీయంగా వేడెక్కిన హుజూరాబాద్‌
ఇప్ప‌టికే హుజూరాబాద్ మొత్తం రాజ‌కీయంగా వేడెక్కింది. ఈ వేడిని మ‌రింత పెంచేలా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈనెల 16వ తేదీన నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌బోతున్నారు. ఇక్క‌డ ఆయ‌న ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ ప‌థ‌కంపై ఇప్ప‌టికే ప‌లు కుల సంఘాలు, ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో పైల‌ట్ ప్రాజెక్టుగా 100మందికి ఎలా వ‌ర్తింప‌చేస్తార‌ని, రాష్ట్ర‌మంత‌టా ఉన్న ద‌ళితుల‌కు ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 16వ తేదీన ముఖ్య‌మంత్రి కేసీఆర్ వీరంద‌రికీ ఎలాంటి స‌మాధానం చెబుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.





ధనుష్‌కు మద్రాస్‌ హైకోర్టు చివాట్లు

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>