PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/yamini934a1b68-8384-4e2b-a2f3-d1eb2f20ee73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/yamini934a1b68-8384-4e2b-a2f3-d1eb2f20ee73-415x250-IndiaHerald.jpgసాధినేని యామిని...మొన్నటివరకు తెలుగుదేశం పార్టీలో బాగా హైలైట్ అయిన పేరు. ఎన్‌ఆర్‌ఐగా రాజకీయాల్లోకి వచ్చిన యామిని కొంతకాలం టీడీపీలో కీలకపాత్ర పోషించారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం యామిని బాగా హడావిడి చేశారు కూడా. ప్రతిరోజూ యామిని మీడియాలో కనిపించడం...ప్రత్యర్ధులపై విమర్శలు చేయడం చేసేవారు. ముఖ్యంగా గత ఎన్నికల ముందు ఈమె...వైసీపీ, జనసేనలపై గట్టిగానే ఫైర్ అయ్యేవారు. yamini{#}yamini;Janasena;Telugu Desam Party;Party;Hanu Raghavapudi;TDP;Andhra Pradeshయామిని రూట్ మారుస్తున్నారా? ఆ హడావిడి ఏది?యామిని రూట్ మారుస్తున్నారా? ఆ హడావిడి ఏది?yamini{#}yamini;Janasena;Telugu Desam Party;Party;Hanu Raghavapudi;TDP;Andhra PradeshThu, 05 Aug 2021 10:54:00 GMTసాధినేని యామిని...మొన్నటివరకు తెలుగుదేశం పార్టీలో బాగా హైలైట్ అయిన పేరు. ఎన్‌ఆర్‌ఐగా రాజకీయాల్లోకి వచ్చిన యామిని కొంతకాలం టీడీపీలో కీలకపాత్ర పోషించారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం యామిని బాగా హడావిడి చేశారు కూడా. ప్రతిరోజూ యామిని మీడియాలో కనిపించడం...ప్రత్యర్ధులపై విమర్శలు చేయడం చేసేవారు. ముఖ్యంగా గత ఎన్నికల ముందు ఈమె...వైసీపీ, జనసేనలపై గట్టిగానే ఫైర్ అయ్యేవారు.

అలాగే అటు ప్రత్యర్ధుల నుంచి యామినికి గట్టిగానే కౌంటర్లు వచ్చేవి. ఒకానొక సందర్భంలో యామినిపై వ్యక్తిగతమైన విమర్శలు కూడా చేశారు. అప్పుడు యామిని పలువురు వైసీపీ, జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రత్యర్ధి పార్టీ వాళ్ళు తనపై విమర్శలు చేసినప్పుడు సొంత పార్టీ నేతలుగానీ, కార్యకర్తలు గానీ తనకు అండగా నిలబడలేదనే అసంతృప్తి యామినిలో ఉంది.

ఇక ఈ అసంతృప్తితోనే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక ఆ పార్టీని వదిలేసి బయటకొచ్చేశారు. అదే సమయంలో ఆమె బీజేపీలో చేరిపోయారు. ఇక బీజేపీలో చేరేటప్పుడు నారా లోకేష్, పలువురు టీడీపీపై ఆమె విమర్శలు చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరాక ఆమె రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా టీడీపీలో ఉన్న స్వేచ్ఛ...బీజేపీలో లేదని తెలుస్తోంది. అందుకే గతంలో మాదిరిగా ఆమె ఏపీ రాజకీయాల్లో హడావిడి చేయలేకపోతున్నారు.

తాజాగా ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రానికి సంబంధించిన ఓ పాటలో హిందూ మతాన్ని కించపరిచే విధంగా లిరిక్స్ ఉన్నాయని చెప్పి, యామిని ఆ చిత్రబృందంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాజకీయ పరమైన అంశాల్లో యామినికి బీజేపీలో పెద్ద స్కోప్ ఉండటం లేదని తెలుస్తోంది. అందుకే ఆమె మళ్ళీ వేరే పార్టీలోకి జంప్ చేసే అవకాశం కూడా లేకపోలేదని ప్రచారం జరుగుతుంది. రానున్న రోజుల్లో రాజకీయాలని బట్టి వైసీపీలోకి కూడా వెళ్లొచ్చని టాక్. మరి చూడాలి టీడీపీలో ఉండగా హడావిడి చేసిన యామిని...మళ్ళీ ఎప్పుడు రాజకీయాల్లో దూకుడుగా ఉంటారో?





ర‌జినీని `గ‌ని` ఢీ కొడ‌తాడా..దీపావ‌ళికి మెగా ప్రిన్స్ మూవీ..?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>