PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagdc0a5b74-c56b-4992-9b1a-c9347ffcb5de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagdc0a5b74-c56b-4992-9b1a-c9347ffcb5de-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల్లోను హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ఆస‌క్తిక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌ర‌ఫున పోటీచేస్తున్న ఈటెల రాజేంద‌ర్‌ను ఓడించ‌డానికి తెలంగాణ రాష్ట్ర స‌మితి త‌న శ‌క్తియుక్తుల‌న్నింటినీ ప్ర‌ద‌ర్శిస్తోంది. అందులో భాగంగానే ద‌ళిత బంధు ప‌థ‌కం కూడా ప్ర‌వేశ‌పెట్టింది. ఈటెల ఓట‌మి బాధ్య‌త‌ను భుజానికెత్తుకున్న మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌కు బీజేపీ భారీ షాక్ ఇచ్చింది. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్‌ద్వారా ఈ షాక్ త‌గిలే ఏర్పాటు చేసింది. tag{#}swetha;Bharatiya Janata Party;Telangana;Minister;Teluguహుజూరాబాద్‌లో మంత్రి గంగుల‌కు బీజేపీ చెక్‌?హుజూరాబాద్‌లో మంత్రి గంగుల‌కు బీజేపీ చెక్‌?tag{#}swetha;Bharatiya Janata Party;Telangana;Minister;TeluguThu, 05 Aug 2021 10:47:53 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోను హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ఆస‌క్తిక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌ర‌ఫున పోటీచేస్తున్న ఈటెల రాజేంద‌ర్‌ను ఓడించ‌డానికి తెలంగాణ రాష్ట్ర స‌మితి త‌న శ‌క్తియుక్తుల‌న్నింటినీ ప్ర‌ద‌ర్శిస్తోంది. అందులో భాగంగానే ద‌ళిత బంధు ప‌థ‌కం కూడా ప్ర‌వేశ‌పెట్టింది. ఈటెల ఓట‌మి బాధ్య‌త‌ను భుజానికెత్తుకున్న మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌కు బీజేపీ భారీ షాక్ ఇచ్చింది. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్‌ద్వారా ఈ షాక్ త‌గిలే ఏర్పాటు చేసింది.

గ్రానైట్ కంపెనీల‌పై దృష్టిపెట్టిన ఈడీ
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఈటెల‌ను ఓడించ‌డ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తున్న మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌కు ఈడీ గ‌ట్టి షాక్ ఇచ్చింది. గంగుల‌కు మొద‌టినుంచి ఉన్న గ్రానైట్ కంపెనీల‌పై ఈడీ దృష్టిపెట్టింది. శ్వేత ఎంట‌ర్ ప్రైజెస్ పేరుతో ఈ గ్రానైట్ కంపెనీ ఉంది. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఆయ‌న ఈ వ్యాపారంపై మంచి ప‌ట్టుంది. కొద్దికాలం నుంచి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని గ్రానైట్ వ్యాపారులు ప్ర‌భుత్వాన్ని మోసం చేస్తున్నార‌ని, గ్రానైట్ ఎగుమ‌తి చేస్తూ ప‌న్నులు చెల్లించ‌డంలేద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీటిపై గ‌తంలోనే ఈడీకి పిర్యాదులు వెల్లువలా వ‌చ్చాయి.

ప‌న్ను ఎగ్గొట్టిన మంత్రి కంపెనీలు
శ్వేత ఏజెన్సీస్‌, శ్వేత గ్రానైట్స్ పేరుతోపాటు మ‌రికొన్ని కంపెనీల‌ను శ్వేత ఎంట‌ర్ ప్రైజెస్ నిర్వ‌హిస్తోంది. సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ప‌న్నులు ఎగ్గొడుతున్నాయ‌ని, రాయ‌ల్టీలు కూడా చెల్లించ‌డంలేదంటూ ఈడీ దాడిచేసింది. అనుమ‌తి ఉన్న‌దానిక‌న్నా ఎక్కువ‌గా గ్రానైట్ బ్లాక్స్ ను విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్నార‌ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 2013లోనే వీటికి రూ.750 కోట్ల జ‌రిమానా చెల్లించాలంటూ నోటీసులిస్తే కేవ‌లం రూ.11 కోట్లు చెల్లించారు. కాకినాడ‌, కృష్ణ‌ప‌ట్నం పోర్టుల‌ద్వారా ఎంత‌మేర‌కు ఎగుమ‌తి చేశారు? అనే అంశంతోపాటు రూ.11 కోట్లు మాత్ర‌మే చెల్లించ‌డ‌మ‌నే అంశంపై కూడా ఈడీ లోతుగా ద‌ర్యాప్తు చేస్తోంది. ఇదంతా కూడా మంత్రిని హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో నిలువ‌రించేందుకేన‌ని, ఉప ఎన్నిక ఖ‌ర్చంతా ఆయ‌నే పెట్టుకుంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బీజేపీ గంగుల‌ను ల‌క్ష్యంగా ఎంచుకోవ‌డంతో టీఆర్ ఎస్‌లో అల‌జ‌డి రేపుతోంది.







బీజేపీకి ఆ సీన్ ఉందా? ఎమ్మెల్యేగా గెలిచేది ఎవరు?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>