MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sureka-vani09147c7f-5e47-4b1b-bbb7-cfaed2a9dc21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sureka-vani09147c7f-5e47-4b1b-bbb7-cfaed2a9dc21-415x250-IndiaHerald.jpgబుల్లితెర రియాల్టీ 'షో' లలో 'బిగ్ బాస్' చాలా ప్రముఖమైనది అని చెప్పవచ్చు. మొదట ఇండియాలో హిందీ లో ప్రారంభం అయిన ఈ రియాల్టీ 'షో' అక్కడ మంచి ప్రజాదరణ తెచ్చుకోవడంతో ఇండియాలోని ఇతర భాషలలో కూడా ఈ 'షో' లను నిర్వహిస్తున్నారు. తెలుగులో ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న 'బిగ్ బాస్' ఐదో సీజన్ ను ప్రారంభించడానికి రంగం సిద్ధం అవుతుంది. ఇప్పటికే సెట్ నిర్మాణం, సదుపాయాల ఏర్పాటు, సెలబ్రిటీల ఎంపిక ఇతర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా బిగ్ బాస్ అయిదవ సీజన్ లోగోను గాను కూడSureka vani{#}surekha vani;Instagram;Bigboss;Hindi;september;Heroine;Siddharth;king;Kingబిగ్ బాస్ ఎంట్రీ పై స్పందించిన సురేఖవాణి..!బిగ్ బాస్ ఎంట్రీ పై స్పందించిన సురేఖవాణి..!Sureka vani{#}surekha vani;Instagram;Bigboss;Hindi;september;Heroine;Siddharth;king;KingThu, 05 Aug 2021 07:15:00 GMTబుల్లితెర రియాల్టీ 'షో' లలో 'బిగ్ బాస్'  చాలా ప్రముఖమైనది అని చెప్పవచ్చు. మొదట ఇండియాలో హిందీ లో ప్రారంభం అయిన ఈ రియాల్టీ 'షో' అక్కడ మంచి ప్రజాదరణ తెచ్చుకోవడంతో ఇండియాలోని  ఇతర భాషలలో కూడా ఈ 'షో' లను నిర్వహిస్తున్నారు. తెలుగులో ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న 'బిగ్ బాస్' ఐదో సీజన్ ను ప్రారంభించడానికి రంగం సిద్ధం అవుతుంది. ఇప్పటికే సెట్ నిర్మాణం, సదుపాయాల ఏర్పాటు, సెలబ్రిటీల ఎంపిక ఇతర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా బిగ్ బాస్ అయిదవ సీజన్ లోగోను గాను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే ప్రతిసారి లాగే ఈసారి కూడా 'బిగ్ బాస్ హౌస్'   లోకి ఎంట్రీ ఇవ్వబోయే  వీరే అంటూ కొంత మంది పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఈ లిస్టులో యాంకర్ రవి, యాంకర్ వర్షిని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్య స్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్,  హీరోయిన్ ఇషా చావ్లా, లోబో, యాంకర్ శివ,  యాంకర్ ప్రత్యూష, సింగర్ మంగ్లీ, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ -విష్ణు ప్రియ జంటల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో  మరీ ముఖ్యంగా సురేఖ వాణి పేరు బాగా ప్రచారంలో ఉంది.


తాజాగా 'బిగ్ బాస్' షో కి వెళ్లడం లేదు అని దయచేసి  ఇలాంటి తప్పుడు వార్తలను రాయకండి అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్టు పెట్టింది. దీంతో సురేఖ వాణి 'బిగ్ బాస్ షో'  కి వెళ్లడం లేదు అని క్లారిటీ కి వచ్చేలోపు ఈ పోస్ట్ ను సురేఖ వాణి డిలీట్ చేసి ట్విస్ట్  ఇచ్చింది . పోస్ట్ ను పెట్టిన కొద్ది నిమిషాల్లోనే దానిని తొలగించింది. దీనితో సురేఖ వాణి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఉంటుందా...లేదా అనేది...మరోసారి ప్రశ్నార్థకంగానే మారింది. ఇక అన్నీ సవ్యంగా జరిగితే బిగ్ బాస్ ఐదవ సీజన్ ను సెప్టెంబర్ 5న ప్రారంభించాలని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్ కూడా కింగ్ నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించబోతు నట్లు ఉన్నట్లు తెలుస్తోంది.



మాజీ మంత్రిగారు... ఏమయ్యారో... ఎక్కడున్నారో...

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>