PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cyber-crimedcb04001-3880-42c5-a5d6-77b1a9669251-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cyber-crimedcb04001-3880-42c5-a5d6-77b1a9669251-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని, ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అన్‌నౌన్ నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకపోవడమే మంచిదని, ఒకవేళ లిఫ్ట్ చేసినా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. కానీ, కొందరు ఈ విషయాలు ఏం పట్టించుకోకుండా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. కేవైసీ అప్‌డేట్ అంటూ ఫోన్ చేసి సైబర్ నేరస్థలు ఐదు లక్షల రూపాయలు కాజేశారు. అసలేం జరిగిందంటే..సిటీలోని డీడీ కాలనీకి చెందిన కాలనీకి చెందిన సత్యనారcyber crime{#}police;Smart phoneకేవైసీ అప్‌డేట్ అంటూ కాల్.. రూ.లక్షలు కాజేసిన సైబర్ నేరస్థులుకేవైసీ అప్‌డేట్ అంటూ కాల్.. రూ.లక్షలు కాజేసిన సైబర్ నేరస్థులుcyber crime{#}police;Smart phoneThu, 05 Aug 2021 13:00:00 GMTఫోన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకపోవడమే మంచిదని, ఒకవేళ లిఫ్ట్ చేసినా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. కానీ.., కొందరు ఈ విషయాలు ఏం పట్టించుకోకుండా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. కేవైసీ అప్డేట్ అంటూ ఫోన్ చేసి సైబర్ నేరస్థలు ఏకంగా 5 లక్షల రూపాయలు కాజేశారు.

ఈ ఘటనకు సంబంధించి అసలేం జరిగిందంటే.. సిటీలోని డీడీ కాలనీకి చెందిన కాలనీకి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తికి రెండ్రోజుల కిందట ఓ వ్యక్తి కాల్ చేశాడు. తాను టెలికాం సంస్థ అని కాల్ చేస్తున్నట్లు పేర్కొని, సత్యనారాయణను బాగా నమ్మించాడు.  సత్యనారాయణకు సంబంధించిన పలు వివరాలు చెప్పి, సిమ్ కార్డును అప్డేట్ చేసుకోకపోతే సర్విస్ బ్లాక్ అవుతుందని తెలిపాడు. ఈ క్రమంలోనే సిమ్ కార్డు కొనసాగాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. ఇందుకుగాను ఆన్లైన్ పేమెంట్ చేయాలని అతడికి సూచించాడు. ఇందుకోసం మొబైల్ నెంబర్‌ కు ఓ లింక్ పంపిస్తానని చెప్పాడు. అంతే సత్యనారయణ ఆ లింక్ ఎందుకు..? అని ప్రశ్నించకుండానే సదరు లింక్ ఓపెన్ చేసి అతడి వివరాలు పూర్తిగా ఎంటర్ చేశాడు. అంతటితో ఆగకుండా సైబర్ నేరస్థుడికి ఓటీపీ కూడా తెలిపాడు. ఇంకేముంది సదరు వ్యక్తి అకౌంట్ నుంచి రూ. 5 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత తనకు కాల్ చేసిన నెంబర్‌ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో సత్యనారాయణ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని.. అప్డేట్స్, వెరిఫికేషన్ అంటూ వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పారు.


తాత వల్లే ఈ సినిమా వచ్చింది : వరుణ్ సందేశ్

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>