NRISuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/indian-lawyer492de1b3-de36-4b0d-8e78-9bfbd1301700-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/indian-lawyer492de1b3-de36-4b0d-8e78-9bfbd1301700-415x250-IndiaHerald.jpgవెనిజువెలా దేశం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో 160 కోట్ల యూరోల విలువైన బంగారం డిపాజిట్ చేసింది. అయితే అత్యవసరంగా బంగారం కావాలని వెనిజువెలా ప్రభుత్వం ఇంగ్లాండ్ బ్యాంకును అడిగింది. ఈ మేరకు కొన్ని సూచనలు పాటిస్తూ గోల్డ్ ట్రాన్స్ఫర్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ నిరాకరించింది. దీంతో వెనిజువెలా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పై కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో కొనసాగుతుండగా.. భారత్ కు చెందిన కార్తీక్ మిట్టల్ వెనిజువెలా దేశం తరఫున వాదించడానికి సిద్ధమయ్యాడు. కార్తీక్ మిట్టలindian lawyer{#}Indian;Bank;gold;Government;England;India;Karthik;london;University;Pune;college;Coronavirusఇంగ్లాండ్‌లో హైప్రొఫైల్ కేసును డీల్ చేయనున్న ఇండియన్ అమెరికన్..!ఇంగ్లాండ్‌లో హైప్రొఫైల్ కేసును డీల్ చేయనున్న ఇండియన్ అమెరికన్..!indian lawyer{#}Indian;Bank;gold;Government;England;India;Karthik;london;University;Pune;college;CoronavirusThu, 05 Aug 2021 09:00:00 GMTబ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో 160 కోట్ల యూరోల విలువైన బంగారం డిపాజిట్ చేసింది. అయితే అత్యవసరంగా బంగారం కావాలని వెనిజువెలా ప్రభుత్వం ఇంగ్లాండ్ బ్యాంకును అడిగింది. ఈ మేరకు కొన్ని సూచనలు పాటిస్తూ గోల్డ్ ట్రాన్స్ఫర్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ నిరాకరించింది. దీంతో వెనిజువెలా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పై కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో కొనసాగుతుండగా.. భారత్ కు చెందిన కార్తీక్ మిట్టల్ వెనిజువెలా దేశం తరఫున వాదించడానికి సిద్ధమయ్యాడు.

కార్తీక్ మిట్టల్ యూకేలోని లండన్ నగరంలో ప్రతిష్టాత్మక న్యాయ సంస్థ అయిన 'జైవాలా & కో' లో భాగస్వామిగా ఉన్నాడు. ఇతడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌పై వేసిన వ్యాజ్యంలో వెనిజువెలా ప్రభుత్వం, బ్యాంకో సెంట్రల్ డి వెనిజువెలాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2018వ సంవత్సరం నుంచి వెనిజువెలా సెంట్రల్ బ్యాంక్ సంబంధించి రెండు ప్రత్యర్థి బోర్డుల మధ్య తగాదా కొనసాగుతోంది. అయితే ఈ రెండు బోర్డులలో ఏ బోర్డుకు బంగారం బదిలీ చేయాలనే విషయంపై కార్తీక్ మిట్టల్ వాదనలు వినిపించనున్నారు.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో భద్రపరిచిన బంగారంపై ఎవరికి అధికారం ఉందో తేల్చేందుకు కార్తీక్ మిట్టల్ యూకే న్యాయస్థానాలను ప్రశ్నించనున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన కార్తీక్ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ పూర్తి చేశారు. అంతకుముందు ఆయన పూణే సింబయాసిస్ లా కాలేజీ నుంచి లా బ్యాచిలర్ డిగ్రీని పొందారు. కరోనా మహమ్మారి సమయంలో ఔషధాలు, వైద్య సామాగ్రి కొనుగోలు చేసేందుకు బంగారం తిరిగి తీసుకోవాలని వెనిజువెలా నిర్ణయించింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు € 1 బిలియన్ విలువైన బంగారాన్ని బదిలీ చేయాలని ఇంగ్లాండ్ బ్యాంకును కోరింది. కానీ బ్యాంకో సెంట్రల్ డి వెనిజువెలా ఆదేశాల మేరకు బదిలీ చేసేందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నిరాకరించింది. దీంతో వెనిజువెలా సెంట్రల్ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌పై దావా వేసింది.


గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>