PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ayodya-ramamandhira-update5ccd51f9-6773-4d1b-acf5-52b7b9d69d36-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ayodya-ramamandhira-update5ccd51f9-6773-4d1b-acf5-52b7b9d69d36-415x250-IndiaHerald.jpgభారతదేశంలో దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరామునికి చిహ్నంగా అయోధ్య మందిరాన్ని నిర్మించడానికి తల పెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ అయోధ్య మందిరానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం భక్తులకు సంతోషాన్ని ఇచ్చేలా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మిస్తున్న ఈ రామమందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు.AYODYA-RAMAMANDHIRA-UPDATE{#}Ayodhya;ram mandir;Telangana Chief Minister;ram pothineni;Newsగుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?AYODYA-RAMAMANDHIRA-UPDATE{#}Ayodhya;ram mandir;Telangana Chief Minister;ram pothineni;NewsThu, 05 Aug 2021 09:00:00 GMTఅయోధ్య మందిరాన్ని నిర్మించడానికి తల పెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ అయోధ్య మందిరానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం భక్తులకు సంతోషాన్ని ఇచ్చేలా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మిస్తున్న ఈ రామమందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు. ఈ రామమందిరాన్ని 2023 సంవత్సరాంతంలో తెరుస్తారని తెలుస్తోంది. అప్పటి నుండి భక్తులు నిరంతరాయంగా పూజలు నిర్వహించవచ్చు. ఇది హిందువులకు చాలా ముఖ్యమైన వార్తగా పరిగణించవచ్చు. తాత్కాలికంగా 2023 లో పూజలు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో దేవాలయ నిర్మాణం మొత్తం పూర్తవడానికి 2025 వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే దశల వారీగా ఈ నిర్మాణములు పూర్తి చేయడానికి ప్రణాళికలు చేసిన సంగతి తెలిసిందే. వీరు చెబుతున్నట్లుగా 2023 సంవత్సరం చివరి నాటికి రామ మందిరం యొక్క గ్రౌండ్ ఫ్లోర్ అలాగే గర్భ గృహంలోని అయిదు మండపాలు మాత్రమే పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇవి కాకుండా ఆలయంలోని రాళ్లు, ఆలయ కాంప్లెక్స్ కు సంబంధించిన పనులన్నీ కూడా 2025 వరకు కొనసాగుతాయని అధికారిక సమాచారం.  ఈ మందిర పునాదులను కాంక్రీట్ తో నింపే పనులు సగం పూర్తయినట్లు చెబుతున్నారు. కేవలం ఈ పునాదుల పని పూర్తి కావడానికి ఇంకో రెండు నెలల సమయం పడుతుందని అంచనా.  ఈ ఆలయాన్ని 110 ఎకరాల విస్తీర్ణములో నిర్మిస్తున్నారు.

ఇందులో కొత్త రకపు డిజిటల్ మ్యూజియం, డిజిటల్ ఆర్చీవ్స్, భక్తులు ఉండడానికి ప్రదేశం, మంచి ఆడిటోరియం లు మరియు పాలనా భవనాలు, పూజారులకు ప్రత్యేక గృహ సముదాయాలు నెలకొల్పుతున్నారు. ఇందులో మొదటి అంతస్థులో... మూడు అంతస్తులు మరియు రామ్ దర్బార్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ కి అయ్యే ఖర్చు సుమారుగా 1000 కోట్లు కానున్నట్లు సమాచారం. కానీ ఇందు కోసం సేకరించిన విరాళాలు 3000 కోట్లు ఉన్నాయట. సరిగ్గా ఈ రోజుకి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని మొదలుపెట్టి సంవత్సరం అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పరిశీలించనున్నారు.  



గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>