CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-herald-cokking4a674455-92d6-4f26-b8fb-a887e9d31086-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-herald-cokking4a674455-92d6-4f26-b8fb-a887e9d31086-415x250-IndiaHerald.jpgమీ అందరికి సాంప్రదాయ వంటకం అయిన పాల తాలికలు గురించి తెలిసే ఉంటుంది. పాల తాలికలు ఎంతో ఫేమస్ అయిన వంటకం.చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ పాలతాలికలు చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు. సరైన కొలతలతో సరైన పద్దతిలో చేస్తే చాలా బాగుంటాయి. మరి కావలిసిన పదర్ధాలు ఏంతో ఒకసారి చూద్దామా. ! కావాల్సిన పదార్ధాలు 1 cup తడి బియ్యం పిండి 1 cup బెల్లం 1 cup సగ్గుబియ్యం 1/2 liter చిక్కటి పాలు 250 ml నీళ్ళు 1 tsp యలకలపొడి 3 tsp నెయ్యి 3 tsp జీడిపప్పు 2 tsp ఎండుకొబ్బరి తురుము 2 tsp కిస్మిస్స్ తయాindia-herald-cokking{#}Jaggery;Gas Stove;Gheeపాల తాలికలు ఎలా చేయాలో తెలుసా..?పాల తాలికలు ఎలా చేయాలో తెలుసా..?india-herald-cokking{#}Jaggery;Gas Stove;GheeThu, 05 Aug 2021 12:13:00 GMTమీ అందరికి సాంప్రదాయ వంటకం అయిన పాల తాలికలు గురించి తెలిసే ఉంటుంది. పాల తాలికలు ఎంతో ఫేమస్ అయిన వంటకం.చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ పాలతాలికలు చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు. సరైన కొలతలతో సరైన పద్దతిలో చేస్తే చాలా బాగుంటాయి. మరి కావలిసిన పదర్ధాలు ఏంతో ఒకసారి చూద్దామా. !

కావాల్సిన పదార్ధాలు

1 cup తడి బియ్యం పిండి

1 cup బెల్లం

1 cup సగ్గుబియ్యం

1/2 liter చిక్కటి పాలు

250 ml నీళ్ళు

1 tsp యలకలపొడి

3 tsp నెయ్యి

3 tsp జీడిపప్పు

2 tsp ఎండుకొబ్బరి తురుము

2 tsp కిస్మిస్స్

తయారీ విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో  కొద్దిగా బెల్లం తీసుకుని అందులో  కొంచెం నీళ్ళు పోసి బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కేవలం తడి బియ్యం పిండి మాత్రమే ఉండలు లేకుండా బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా మాత్రం ఉండకూడదు. మిగిలిన బెల్లంలో మళ్ళీ కొద్దిగా  నీళ్ళుపోసి ఓ పొంగు రానిచ్చి దించేసి పక్కన పెట్టుకోండి.  ఇప్పుడు తడి బియ్యం పిండి ముద్దని చిన్న సైజు ఉండలు చేసి వాటిని పొడవుగా కాస్త మందంగా బారుగా చేసుకోవాలి.అయితే ఈ పిండిని చక్రాలు గిద్దలలో పెట్టి కూడా ఒత్తుకోవచ్చు. తర్వాత పొయ్యి వెలిగించి  పాలు,  నీళ్ళు కలిపి మరిగించండి ఓ పొంగు రాగే 30 నిమిషాలు నానా బెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించండి. యాలుక్కాయ పొడి కూడా వేయాలి. ఇప్పుడు ముందుగా బియ్యపిండితో చేసుకున్న తాలికలు పాలల్లో వేసి 5 నిమిషాలు గరిటతో కదపకుండా వదిలేయండి.గరిటెతో కలిపితే విరిగిపోతాయి. ఒక 5 నిమిషాల అయ్యాక నిదానంగా కలుపుకుని మూత పెట్టి సన్నని సెగ మీద 12-15 నిమిషాల పాటు ఉడకనివ్వండి.ఇప్పుడు అందులో చల్లారిన బెల్లం సిరప్ పోయండి. ఒక 5 నిముషాలు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేయండి.ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి కిస్మిస్, జీడిపప్పు వేపి పాల తాలికలలో వేయండి.అంతే పాల తాలికలు  రెడీ అయిపోయినట్లే.. !



నిన్న దొంగతనం చేసి దొరికిపోయిన పంత్...?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>