PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-tdpe8f23f88-764b-4cf7-a5a0-6f288b1fb7bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-tdpe8f23f88-764b-4cf7-a5a0-6f288b1fb7bd-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు టీడీపీ నుంచి వైసీపీ లోకి వలసలు జరిగాయి. అయితే ఇప్పుడు వైసిపి లో ఉన్న ఓ ఎమ్మెల్యే టిడిపి వైపు చూస్తున్నారన్న వార్తలు వైసీపీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయ‌న‌ టిడిపికి , చంద్రబాబు కు వీరాభిమాని, ఆయన వరుసగా రెండుసార్లు విశాఖ సౌత్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచిన గణేష్ తన సొంత పనులు చక్కబెట్టుకోవచ్చు అన్న‌ ఉద్దేశం తో వైసీపీ చెంత చేరి పోయారు. చంద్రబాబుని , టిడిపిని తీవ్రంగా విమర్శించారు.jagan tdp{#}prabhakar reddy;ATCHANNAIDU KINJARAPU;GANESH KUMAR VASUPALLI;devineni avinash;KARANAM BALARAMA KRISHNA MURTHY;MADDALI GIRIDHARA RAO;Vallabhaneni Vamsi;Narendra;Kollu Ravindra;Vishakapatnam;CBN;News;MLA;YCP;TDP;Jaganఏపీ పాలిటిక్స్‌లో జ‌గ‌న్‌కు మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్‌... ఆ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకే ?ఏపీ పాలిటిక్స్‌లో జ‌గ‌న్‌కు మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్‌... ఆ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకే ?jagan tdp{#}prabhakar reddy;ATCHANNAIDU KINJARAPU;GANESH KUMAR VASUPALLI;devineni avinash;KARANAM BALARAMA KRISHNA MURTHY;MADDALI GIRIDHARA RAO;Vallabhaneni Vamsi;Narendra;Kollu Ravindra;Vishakapatnam;CBN;News;MLA;YCP;TDP;JaganThu, 05 Aug 2021 09:00:00 GMT ఏపీలో అధికార వైసిపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దెబ్బకు ప్రతిపక్ష టీడీపీ నేతలకు ప్రతిరోజు చుక్కలు కనపడుతున్నాయి. టిడిపికి చెందిన ఏ నేత అయినా ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు రోడ్డెక్కితే చాలు... ఏదో ఒక సాకు చూపి అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి - దూళిపాళ్ల నరేంద్ర - అచ్చెన్నాయుడు - కొల్లు రవీంద్ర తాజాగా దేవినేని ఉమామహేశ్వరరావు ఇలా చెప్పుకుంటూ పోతే టిడిపిలో కీలక నేతలు అందరిని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వైసీపీ దెబ్బకు ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు , మాజీ మంత్రులు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఇక గత ఎన్నికల్లో గెలిచిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం జగన్ చెంత‌ చేరిపోయారు. వీరిలో కరణం బలరాం - మద్దాలి గిరిధర్ రావు - వల్లభనేని వంశీ మోహన్ - వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు.

ఇప్పటివరకు టీడీపీ నుంచి వైసీపీ లోకి వలసలు జరిగాయి. అయితే ఇప్పుడు వైసిపి లో ఉన్న ఓ ఎమ్మెల్యే టిడిపి వైపు చూస్తున్నారన్న వార్తలు వైసీపీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయ‌న‌ టిడిపికి , చంద్రబాబు కు వీరాభిమాని, ఆయన వరుసగా రెండుసార్లు విశాఖ సౌత్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచిన గణేష్ తన సొంత పనులు చక్కబెట్టుకోవచ్చు అన్న‌ ఉద్దేశం తో వైసీపీ చెంత చేరి పోయారు. చంద్రబాబుని , టిడిపిని తీవ్రంగా విమర్శించారు.

అయితే ఇప్పుడు వైసీపీలో ఆయన పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఇటీవల జీవీఎంసీ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం లో వైసీపీ కి అంత సానుకూల ఫలితాలు రాలేదు. ఈ క్రమంలోనే మరోవైపు వైసీపీ కేడర్ సైతం ఆయన పక్కన పెట్టేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల వరకు వేచి చూసి ఎన్నికలకు ముందే ఆయన టిడిపిలోకి వెళ్లిపోవచ్చని అంటున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత మొదలైంది అంటే గణేష్ గోడదూకేందుకు రెడీగా ఉన్నట్టే అంటున్నారు.



యోగి రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం.. !

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>