TVVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jabardasth-hyper-adhi7a16f450-7e83-4ef2-81ba-c8cd09f32652-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jabardasth-hyper-adhi7a16f450-7e83-4ef2-81ba-c8cd09f32652-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఈటీవీలో వారానికి రెండు సార్లు ప్రసారం అవుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ అంటే ఓ రేంజ్ లో హైప్ ఉంది. ప్రేక్షకులు జబర్దస్త్ ప్రోగ్రాం ను ఎంతగా ఆదరిస్తున్నారో చెప్పడానికి యూట్యూబ్ వ్యూస్ చూస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రతి ఒక్క టీం లీడర్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే జబర్దస్త్ మొత్తాన్ని ఒక రెండు టీం లు మాత్రమే ఏలేస్తున్నాయి అన్న నానుడి బయట ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది.JABARDASTH-HYPER ADHI{#}AdiNarayanaReddy;Jabardasth;you tube;Comedy;Varsham;Audience;Leader;thursdayహైపర్ ఆదిపై షాకింగ్ కామెంట్స్ ?హైపర్ ఆదిపై షాకింగ్ కామెంట్స్ ?JABARDASTH-HYPER ADHI{#}AdiNarayanaReddy;Jabardasth;you tube;Comedy;Varsham;Audience;Leader;thursdayThu, 05 Aug 2021 19:23:28 GMTబుల్లితెరపై ఈటీవీలో వారానికి రెండు సార్లు ప్రసారం అవుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ అంటే ఓ రేంజ్ లో హైప్ ఉంది. ప్రేక్షకులు జబర్దస్త్ ప్రోగ్రాం ను ఎంతగా ఆదరిస్తున్నారో చెప్పడానికి యూట్యూబ్ వ్యూస్ చూస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రతి ఒక్క టీం లీడర్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే జబర్దస్త్ మొత్తాన్ని ఒక రెండు టీం లు మాత్రమే ఏలేస్తున్నాయి అన్న నానుడి బయట ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. ఇదే విషయం జబర్దస్త్ నటుల్లోనూ ఉందనే విషయం తెలుస్తోంది. ముఖ్యంగా గురువారం రోజు ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో 'హైపర్ ఆది - రైజింగ్ రాజు' టీమ్ స్కిట్ లు బాగుంటాయని బయట పబ్లిక్ టాక్. ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్ లో... కాస్త కూడా గ్యాప్ లేకుండా పంచులు వర్షం కురిపిస్తూనే ఉంటాడు. దీనితో ఆయన స్కిట్ ను పదే పదే చూడాలనిపిస్తూ ఉంటుంది.శుక్రవారం రోజు ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో 'సుడిగాలి సుధీర్' టీమ్ అంటే చెవులు కోసుకునే ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే ఈ మధ్యనే జబర్దస్త్ నటుడు ఒకరు ఒక ఇంటర్వ్యూలో హైపర్ ఆది మరియు వారి టీమ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినట్లుగా ఈ స్కిట్ లో ఆది తప్పించి మిగతా వారికి ఏ మాత్రం పేరు రాకుండా చేస్తున్నాడనే అపవాదు ఉందని చెప్పడం జరిగింది. ఈ విషయం గురించి రైజింగ్ రాజును అడిగితే, "ఆదికి టాలెంట్ ఉంది...ఆది వల్ల నేనేదో కొంత డబ్బు సంపాదించుకుంటున్నాను అన్నాడట". అంతే కాకుండా నాకు కొంతైనా పేరు రావడానికి కారణమయ్యాడని చెప్పాడట. ఆయనంటే గౌరవం ఎప్పుసూ ఉంటుందని తన విశ్వాసాన్ని చూపాడు". ఎవరినో కించపరిస్తేనో, లేదా వారిని బాడీ షేమింగ్ చేస్తేనో హాస్యం వస్తుంది. ఈ విధమైన వైఖరిని చాలా మంది కుటుంబ సభ్యులు విమర్శిస్తున్నారు. అయినప్పటికీ వారి ధోరణి ఏ మాత్రం మార్చుకోకుండా కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా హైపర్ ఆది టీంలోని సభ్యులపై ఈయన వేసే పంచులను కూడా బయట తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.

ఈ విషయంపై ఆది టీమ్ సభ్యులు అయిన గణపతి, దొరబాబు, పరదేశి, నవీన్, శాంతి స్వరూప్ లలో ఈ రోజు ఎవరిని పిలిచి అడిగినా, "మీ మీద పంచులేస్తూ బ్రతికేస్తున్నాడు ఆది అంటే,  వాళ్ళేమన్నారంటే "మేము కాకపోతే ఇంకొకరిని పెట్టుకుని వారి మీద పంచులేస్తాడు. ఆయన మా మీద పంచులేస్తేనే మేము బ్రతుకుతాము" అని చెప్పడం వారి విశ్వాసానికి తార్ఖానం. ఆయనకు అంత టాలెంట్ ఉంది అని టీమ్ లోని సభ్యులు చెప్పారు. అంతలా ఆదిని తోటి టీమ్ సభ్యులు అభిమానిస్తున్నారు. కేవలం మా అవసరం కాబట్టే మేము మా మీద పంచులేసినా ఉంటున్నాం అని చెప్పారు.  అంతే కాకుండా ఆది పంచులకన్నా కూడా రాంప్రసాద్ పంచులే బాగుంటాయని బయట టాక్ అని చెప్పి షాక్ ఇచ్చాడు. రాంప్రసాద్ పంచుల్లో ఎవ్వరినీ ఉద్దేశించి కామెంట్లు ఉండవు. కానీ ఆది పంచుల్లో ఎక్కువగా ఎవరినో ఒకరిని అనందే పంచ్ రాదు అని చెప్పాడు. ఇలా ఎన్నో విషయాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.





అరే!యార్! ఓటీటీ దేఖో!

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>