MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-sandesh4e4fa9a1-4c26-4649-b85b-45ba079773dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-sandesh4e4fa9a1-4c26-4649-b85b-45ba079773dd-415x250-IndiaHerald.jpgహ్యాపీడేస్ సినిమాతో హీరోగా తన కెరీర్ ను ప్రారంభించిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత చేసిన కొత్త బంగారులోకం సినిమా తో బ్యాక్ టు బ్యాక్ హిట్ లు సంపాదించి ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆ రెండు సినిమాల తరువాత వరుణ్ సందేశ్ అదే రేంజ్ లో సినిమాలు చేయలేక పోయాడు. కథల ఎంపికలో లోపం స్పష్టంగా కనిపించడంతో మంచి సినిమాలకు దూరమవుతూ వచ్చాడు. క్రమక్రమంగా సినిమాలకు సైతం ఆయన దూరం అయిపోయాడు. హిట్ సినిమాలను ఎంపిక చేసుకోలేకపోవడం వరుణ్ సందేశ్ కు మైనస్ గా మారింది. దాంతో అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులు ఆయన్నిvarun sandesh{#}k raghavendra rao;madhavi;varun sandesh;Winner;producer;Producer;Bigboss;Hero;Audience;November;Cinemaతాత వల్లే ఈ సినిమా వచ్చింది : వరుణ్ సందేశ్తాత వల్లే ఈ సినిమా వచ్చింది : వరుణ్ సందేశ్varun sandesh{#}k raghavendra rao;madhavi;varun sandesh;Winner;producer;Producer;Bigboss;Hero;Audience;November;CinemaThu, 05 Aug 2021 12:10:00 GMT
హ్యాపీడేస్ సినిమాతో హీరోగా తన కెరీర్ ను ప్రారంభించిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత చేసిన కొత్త బంగారులోకం సినిమా తో బ్యాక్ టు బ్యాక్ హిట్ లు సంపాదించి ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆ రెండు సినిమాల తరువాత వరుణ్ సందేశ్ అదే రేంజ్ లో సినిమాలు చేయలేక పోయాడు. కథల ఎంపికలో లోపం స్పష్టంగా కనిపించడంతో మంచి సినిమాలకు దూరమవుతూ వచ్చాడు. క్రమక్రమంగా సినిమాలకు సైతం ఆయన దూరం అయిపోయాడు. హిట్ సినిమాలను ఎంపిక చేసుకోలేకపోవడం వరుణ్ సందేశ్ కు మైనస్ గా మారింది. దాంతో అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులు ఆయన్ని మర్చిపోయారు. 

కాగా మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోలో ఆయన పాల్గొని మళ్లీ ప్రేక్షకులకు కొంత చేరువయ్యాడు. ఈ నేపథ్యంలోనే సీజన్ 4 విన్నర్ గా మారి పోయిన వైభవాన్ని తెచ్చుకునేలా చేసుకున్నాడు. ఇక తన ఆఖరి ప్రయత్నం గా ఇప్పుడు హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందువదన అనే సినిమాలో వరుణ్ సందేశ్ ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్నారు. మాధవి ఆదుర్తి నిర్మాత కాగా ఎం ఎస్ ఆర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

హైదరాబాదులో జరిగిన ఈ సినిమా టీజర్ కార్యక్రమంలో రాఘవేంద్రరావు టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత హీరో గా ఓ సినిమా చేస్తున్నా.. నేను ఈ విషయం చెప్పగానే టీజర్ విడుదల చేయడానికి వచ్చిన రాఘవేంద్ర రావు గారికి థాంక్స్. నా చిన్నప్పటి నుంచి ఆయన నాకు చాలా బాగా తెలుసు. మా తాతయ్య జీడిగుంట రామచంద్రమూర్తి గారు ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు పనిచేశారు. గత ఏడాది నవంబర్ లో చనిపోవడంతో నేను ఎప్పుడు సినిమా చేస్తానీ అని ఆయన చూసిన ఎదురు చూపులకు ఫలితం దక్కకుండా పోయింది. ఇప్పుడు ఈ సినిమాను ఆయన ఆశీర్వాదం తోనే చేస్తున్న. వారు ఈ సినిమా చూసి సంతోషిస్తారని ఆశిస్తున్నా. ఇటువంటి సినిమా నేను ఇంతవరకు చేయలేదు. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించే ఈ సినిమా చేస్తున్నా. డబ్బింగ్ లో కొంత చూసా. సినిమా చాలా బాగుంది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు. 



నిన్న దొంగతనం చేసి దొరికిపోయిన పంత్...?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>