Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/deatb753e0d0-af2c-4d12-af55-26077827e182-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/deatb753e0d0-af2c-4d12-af55-26077827e182-415x250-IndiaHerald.jpgఅంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఎన్నో ఊహించని ఘటనలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటాయి. అంతే కాదు ఎన్నో కుటుంబాలను తీరని శోకం లోకి నెడుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా కూల్ డ్రింక్ అనేది ఎవరైనా తాగుతారూ. చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా కూల్ డ్రింక్ తాగడాన్ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కూల్ డ్రింక్ తాగడమే ఆ బాలిక పాలిట మృత్యు శకటం గా మారిపోయింది. కూల్ డ్రింక్ తాగిన కొద్ది నిమిషాల్లోనే ఆమె శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. అంతలో స్పృహ కోల్పోయి కDeat{#}dharani;Huzur Nagar;Postmortem;Tamilnadu;Parents;Chennai;policeబాలిక ప్రాణం తీసిన కూల్ డ్రింక్.. తాగిన ఐదు నిమిషాలకే?బాలిక ప్రాణం తీసిన కూల్ డ్రింక్.. తాగిన ఐదు నిమిషాలకే?Deat{#}dharani;Huzur Nagar;Postmortem;Tamilnadu;Parents;Chennai;policeThu, 05 Aug 2021 15:30:00 GMTఅంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఎన్నో ఊహించని ఘటనలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటాయి.  అంతే కాదు ఎన్నో కుటుంబాలను తీరని శోకం లోకి నెడుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా కూల్ డ్రింక్ అనేది ఎవరైనా తాగుతారూ. చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా కూల్ డ్రింక్  తాగడాన్ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కూల్ డ్రింక్  తాగడమే ఆ బాలిక పాలిట మృత్యు శకటం గా మారిపోయింది. కూల్ డ్రింక్ తాగిన కొద్ది నిమిషాల్లోనే ఆమె శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. అంతలో స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయింది బాలిక.



 తమిళనాడు రాజధాని ప్రాంతమైన చెన్నై నగరంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంతో సంతోషంగా కూల్ డ్రింక్ తాగిన బాలిక కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో అప్పటివరకూ సంతోషంగా కళ్ళముందే ఆడుకున్న కూతురు నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆరోగ్యంగా ఉన్న తమ కూతురు కూల్ డ్రింక్ తాగడం వల్లనే చనిపోయిందని అంటూ ఇక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 చెన్నైలోని బీసెంట్ నగర్ కు చెందిన సంతోష్, గాయత్రి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు  అయితే ఇటీవలే రెండవ కుమార్తె 13 ఏళ్ల ధరణి స్థానికంగా ఉన్న ఒక కిరాణా షాపులో కూల్ డ్రింక్  కొనుగోలు చేశారు. సంతోషంగా ఆ కూల్ డ్రింక్ తాగింది. కానీ కేవలం ఐదు నిమిషాలకే ఆమె శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇక బాలికను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు . దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు నిమిషాల్లో కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. కూల్ డ్రింక్  తాగడం వల్లనే చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక కు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమయ్యారు పోలీసులు.



300 ల కుక్కలను చంపిన సర్పంచ్

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>