PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-letter-to-jagan-400c0455-ef66-42ec-83c6-15184fc5f015-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-letter-to-jagan-400c0455-ef66-42ec-83c6-15184fc5f015-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌ పై మరోసారి తెలుగు దేశ్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాలు మాత్రమే చెబుతాడని మండిపడ్డ నారా లోకేష్‌...జగన్ రెడ్డి అనే వ్యక్తి మోసాలు చేస్తూనే ఉంటాడని ఫైర్‌ అయ్యారు. జగన్ రెడ్డి అనే వ్యక్తి చెయ్యలేనివి కూడా చేస్తానని భ్రమ‌లు క‌ల్పిస్తాడ‌నేందుకు ఉదాహ‌ర‌ణ జాదూ క్యాలెండ‌ర్‌ అని చురకలు అంటించారు. అధికారంలోకి రాక ముందు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాన‌న్న జగన్ రెడ్డి... సీఎం అయ్nara lokesh{#}Lokesh;Vijayawada;job;Lokesh Kanagaraj;Reddy;CM;Telangana Chief Minister;Party;Andhra Pradesh;Jagan;Minister;Teluguజగన్‌ కోసం కొత్త వెబ్‌సైట్‌ పెట్టిన లోకేష్‌?జగన్‌ కోసం కొత్త వెబ్‌సైట్‌ పెట్టిన లోకేష్‌?nara lokesh{#}Lokesh;Vijayawada;job;Lokesh Kanagaraj;Reddy;CM;Telangana Chief Minister;Party;Andhra Pradesh;Jagan;Minister;TeluguThu, 05 Aug 2021 17:46:07 GMTఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌ పై మరోసారి తెలుగు దేశ్‌ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు.  జగన్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాలు మాత్రమే చెబుతాడని మండిపడ్డ నారా లోకేష్‌...జగన్ రెడ్డి అనే వ్యక్తి మోసాలు చేస్తూనే ఉంటాడని ఫైర్‌ అయ్యారు.  జగన్ రెడ్డి అనే వ్యక్తి చెయ్యలేనివి కూడా చేస్తానని భ్రమ‌లు  క‌ల్పిస్తాడ‌నేందుకు ఉదాహ‌ర‌ణ జాదూ క్యాలెండ‌ర్‌ అని చురకలు అంటించారు.  

అధికారంలోకి రాక ముందు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ  చేస్తాన‌న్న జగన్ రెడ్డి...   సీఎం అయ్యాక  10 వేల ఉద్యోగాల‌తో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసి..పండగ చేసుకోండంటూ నిరుద్యోగ యువత భవితకు మరణ శాసనం రాసేసారని మండి పడ్డారు నారా లోకేష్‌.  మోస‌పూరిత జాదూ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ విజయవాడ ధర్నా చౌక్ లో నిరాహారదీక్ష చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి సభ్యులకు నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు నారా లోకేష్‌.  

వైకాపా పాలనలో నిరుద్యోగ యువతకి జరిగిన అన్యాయం, యువతని ఉద్యమంలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో రూపొందించిన www.jagancheatedapyouth.com వెబ్ సైట్ లో అంతా రిజిస్టర్ అయ్యి నియంత కొమ్ములు వంచి ఉద్యోగాలు సాధించుకునే మహోద్యమంలో పాల్గొనాలని కోరుతున్నానని నారా లోకేష్‌ వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చాలా ఓపికగా చూస్తున్నారని... సమయం వచ్చినప్పుడు జగన్‌ రెడ్డికి తగిన బుద్ది చెబుతారని నిప్పులు చెరిగారు. జగన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలు ఎవరూ కూడా సంతో షంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి బుద్ది చెబుతారని హెచ్చరించారు నారా లోకేష్‌.





300 ల కుక్కలను చంపిన సర్పంచ్

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>