Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona27488f47-eb77-415c-96b5-11d89021bdc1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona27488f47-eb77-415c-96b5-11d89021bdc1-415x250-IndiaHerald.jpgమొన్నటి భారత్ లో కరోనా వైరస్ ఎంత అల్లకల్లోల పరిస్థితులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి దశ కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్ రెండో దశ కరోనా వైరస్ ను మాత్రం సరిగ్గా అంచనా వేయలేకపోయింది. దీంతో ఇక వైరస్ ను అంచనా వేసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకానొక దశలో దేశంలో ఏకంగా ప్రతిరోజూ నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఎంతోమంది కూడా ఊపిరాడక ఇబ్బంది పడిన పరిస్థితులు ఏర్పడ్డCorona{#}oxygen;Vidyasagar;Hyderabad;Coronavirus;India;October;Teluguకరోనా థర్డ్ వేవ్.. అంతంత మాత్రమే?కరోనా థర్డ్ వేవ్.. అంతంత మాత్రమే?Corona{#}oxygen;Vidyasagar;Hyderabad;Coronavirus;India;October;TeluguThu, 05 Aug 2021 10:50:00 GMTమొన్నటి భారత్ లో కరోనా వైరస్ ఎంత అల్లకల్లోల పరిస్థితులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  మొదటి దశ కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్ రెండో దశ కరోనా వైరస్ ను మాత్రం సరిగ్గా అంచనా వేయలేకపోయింది. దీంతో ఇక వైరస్ ను అంచనా వేసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకానొక దశలో దేశంలో ఏకంగా ప్రతిరోజూ నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఎంతోమంది కూడా ఊపిరాడక ఇబ్బంది పడిన పరిస్థితులు ఏర్పడ్డాయి.



 దీంతో వెంటనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమై లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చాయ్. దీంతో ప్రజలందరూ ఇంటిపట్టునే ఉండేవిధంగా చర్యలు తీసుకున్నాయి. తద్వారా క్రమక్రమంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే దేశం సెకండ్ వేవ్ ప్రభావం  నుంచి బయట పడుతుంది.  దీంతో దేశ ప్రజానీకం మొత్తం ఊపిరి పీల్చు కుంటుంది. కానీ అంతలోనే మళ్ళీ మూడవ దశ కూడా దూసుకు వస్తుంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  అందరూ థర్డ్ వేవ్ కరోనా వైరస్ తో పోరాటం చేసేందుకు ప్రజలు అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ ప్రజలందరిలో భయం పట్టుకుంది.


 థర్డ్ వేవ్ ఫై ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలుమూడవ దశ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. ఇక దీని ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది అని అంటున్నారు.  ఇక ఇటీవల ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ మాత్రం మూడవ దశ కరోనా ప్రభావం గురించి కొత్త విషయాలు చెప్పుకొచ్చారు.  కరోనా వైరస్ ప్రభావం ఉంటుందని ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దీని ప్రభావం కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఈసారి సెకండ్ వేవ్ లాగా భారీ ఎత్తున వైరస్ సోకే ప్రమాదం మాత్రం తక్కువగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అంతగా ప్రభావం ఉండకపోవచ్చని దీంతో ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడే అవకాశం లేదు అంటూ చెప్పుకొచ్చారు. కానీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించారు.



రెండు రోజులుగా మ్యాన్‌ హోల్‌ లోనే కార్మికుడు అంతయ్య ?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>