MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money3a9ebf27-e7b6-4328-bdd4-62758eafb138-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money3a9ebf27-e7b6-4328-bdd4-62758eafb138-415x250-IndiaHerald.jpgరోజు రోజుకి సైబర్ నేరగాళ్ల ఉధృతి ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా అమాయకులను, పేద ప్రజలను టార్గెట్ చేసి వివిధ రకాల ఆఫర్ లను చూపిస్తూ, వారిని బుట్టలో వేసుకుంటున్నారు. ఏదో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయి.. ఇక్కడ మెసేజ్ ను క్లిక్ చేయండి.. డబ్బులు వస్తాయి.. అని ఫేక్ మెసేజ్ లతో అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. అంతే కాదు మన మొబైల్లో ఉన్న పర్సనల్ డేటా మొత్తం హ్యాక్ చేసి , మానసికంగా కూడా కొంతమందిని క్షోభకు గురి చేస్తూ , డబ్బు ను సొమ్ము చేసుకుంటున్నారు .MONEY{#}Prize;Gift;Cheque;Nijam;Application;central governmentమనీ : కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకు రూ.1.3 లక్షలు.. ఇందులో నిజమెంత..?మనీ : కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకు రూ.1.3 లక్షలు.. ఇందులో నిజమెంత..?MONEY{#}Prize;Gift;Cheque;Nijam;Application;central governmentThu, 05 Aug 2021 11:00:00 GMTరోజు రోజుకి సైబర్ నేరగాళ్ల ఉధృతి ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా అమాయకులను, పేద ప్రజలను టార్గెట్ చేసి వివిధ రకాల ఆఫర్ లను చూపిస్తూ, వారిని బుట్టలో వేసుకుంటున్నారు. ఏదో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయి.. ఇక్కడ మెసేజ్ ను క్లిక్ చేయండి.. డబ్బులు వస్తాయి.. అని ఫేక్ మెసేజ్ లతో అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. అంతే కాదు మన మొబైల్లో ఉన్న పర్సనల్ డేటా మొత్తం హ్యాక్ చేసి , మానసికంగా కూడా కొంతమందిని క్షోభకు గురి చేస్తూ , డబ్బు ను సొమ్ము చేసుకుంటున్నారు
.
అయితే ఇలాంటి సైబర్ నేరగాళ్లను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు  సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అధికారులు  ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది .దీనిపై  కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అదేమిటంటే , గత కొద్ది వారాల నుండి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 1.3 లక్షలను ప్రతినెలా నగదు బహుమతి కింద ఇవ్వనుంది అనే వార్త.. సోషల్ మీడియాను కుదిపేస్తోంది.

అంతేకాదు ఒక లింకును కూడా షేర్ చేసి , ఈ లింక్ పై క్లిక్ చేసి, మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటూ కూడా కొంతమంది సైబర్ నేరగాళ్లు ఒక లింక్ ను  క్రియేట్ చేసి , సోషల్ మీడియాలో వదలడం జరిగింది. ఇప్పటికే అమాయక ప్రజలు ఈ లింక్ పై క్లిక్ చేసి , హ్యాకర్ల బారిన పడిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం క్లారిటీ ఇచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన PIB ఇందులో ఉన్న నిజం ఎంతో చెక్ చేసి స్పష్టం చేసింది. అంతే కాదు ఇలాంటి మోసపూరిత మెసేజ్లను నమ్మవద్దని కూడా సూచించడం జరిగింది. ఇలాంటి విషయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని లేకపోతే మోస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. అని మెసేజ్ రూపంలో వచ్చే లింకును కూడా క్లిక్ చేయవద్దు అని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం.





ర‌జినీని `గ‌ని` ఢీ కొడ‌తాడా..దీపావ‌ళికి మెగా ప్రిన్స్ మూవీ..?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>