PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/shock-to-rahul-gandhi-child-rights-commission-issues-notices-d661bf78-b0fd-46f7-af10-c12b342ef17c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/shock-to-rahul-gandhi-child-rights-commission-issues-notices-d661bf78-b0fd-46f7-af10-c12b342ef17c-415x250-IndiaHerald.jpgఇటీవ‌ల ఢీల్లీలో హ‌త్యాచారానికి గురైన ద‌ళిత బాలిక రాహుల్ గాంధీ ప‌రామ‌ర్శించారు. అయితే దీనికి రాహుల్‌ను ప్ర‌శంసించాలి. కానీ వారిని ప‌రామ‌ర్శించిన సంద‌ర్భంలో వారితో దిగిన ఫోటోను ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ ట్వీట్ వ‌ల్ల బాలిక వివ‌రాల‌ను బ‌హిరంగ ప‌ర్చ‌డం వ‌ల్ల ఆయ‌న వ్య‌వ‌హారం వివాద‌స్ప‌దంగా మారుతోంది. ఈ క్ర‌మంలో జాతీయ బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ ట్విట్ట‌ర్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. అలాగే రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన ఫోటోను తొల‌గించాల‌ని ట్విట్ట‌ర్ ఇండియాను బాల‌ల హcongress rahul{#}rahul;Rahul Gandhi;Rahul Sipligunj;Delhi;policeరాహుల్ గాంధీకి షాక్‌.. బాల‌ల హ‌క్కుల క‌మిష‌న్ నోటీసులు జారీ..!రాహుల్ గాంధీకి షాక్‌.. బాల‌ల హ‌క్కుల క‌మిష‌న్ నోటీసులు జారీ..!congress rahul{#}rahul;Rahul Gandhi;Rahul Sipligunj;Delhi;policeThu, 05 Aug 2021 12:56:58 GMT ఇటీవ‌ల ఢీల్లీలో హ‌త్యాచారానికి గురైన ద‌ళిత బాలిక రాహుల్ గాంధీ ప‌రామ‌ర్శించారు. అయితే దీనికి రాహుల్‌ను ప్ర‌శంసించాలి. కానీ వారిని ప‌రామ‌ర్శించిన సంద‌ర్భంలో వారితో దిగిన ఫోటోను ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ ట్వీట్ వ‌ల్ల బాలిక వివ‌రాల‌ను బ‌హిరంగ ప‌ర్చ‌డం వ‌ల్ల ఆయ‌న వ్య‌వ‌హారం వివాద‌స్ప‌దంగా మారుతోంది. ఈ క్ర‌మంలో జాతీయ బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ ట్విట్ట‌ర్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. అలాగే రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన ఫోటోను తొల‌గించాల‌ని ట్విట్ట‌ర్ ఇండియాను బాల‌ల హ‌క్కుల క‌మిష‌న్ ఈ మేర‌కు ఆదేశించింది. ఢిల్లీ కంటోన్మెంట్ లోని ఓల్డ్ నంగల్‌లోని హ‌త్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని క‌లిసిన రాహుల్ అనంత‌రం బుధ‌వారం వారితో ఉన్న‌ ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

   అయితే ఈ ఫోటోలో బాధితురాలి త‌ల్లిదండ్రులు క‌నిపిస్తున్నారు. వాహ‌నం లోప‌ల కూర్చున్న రాహుల్ బాలిక త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడుతున్న‌ట్టు ఉండే ఫోటోను ఆయ‌న పోస్ట్ చేశారు. అయితే ఫోక్సో చ‌ట్టం ప్ర‌కారం హ‌త్యాచారానికి గురైన బాధితుల వివ‌రాల‌ను బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌కూడ‌దు. ఈ ఫోటో ద్వారా రాహుల్ బాలిక త‌ల్ల‌దండ్రులు ఎవ‌రో తెలిసిపోతుంది. దీని వ‌ల్ల ఆమె వివ‌రాలు కూడా తెలిసే అవ‌కాశం కూడా ఉంది. దీంతో పోక్సో చ‌ట్టం ఉల్లంఘించిన రాహుల్‌పై జాతీయ బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ సీరియ‌స్ అయింది. రాహుల్ తో పాటు ఫోటోను తొల‌గించాల‌ని ట్విట్ట‌ర్ ఇండియాకు నోటీసులు జారీ చేసిన‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా క‌మిష‌న్ పేర్కొంది.

  అంతే కాకుండా, ఏ మిడియా సంస్థ లేదా ఏ విధంగానైనా బాధితురాలి వివ‌రాలు వెల్ల‌డించే లేదా తెలిపే ఫోటో లేదా స‌మాచారం, ఇత‌ర విధాలుగానైనా ఎలాంటి చిన్న విష‌యాన్ని వెల్ల‌డించ‌డం జువైన‌ల్ జ‌స్టిస్‌, పోక్సో యాక్టు ప్ర‌కారం నేరంగా ప‌రిగ‌ణించ‌బుతుంద‌ని వెల్ల‌డించింది. 9 సంవ‌త్స‌రాల‌ బాలిక‌ను కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని ఓల్డ్ నంగ‌ల్ శ్మ‌శాన వాటిక‌లో పూజారి, ముగ్గురు వ్య‌క్తులు సామూహికంగా లైంగిక దాడి చేసి హ‌త్య చేశారు. ఈ కేసులో బాధితురాలి త‌ల్లి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు వారిపై కేసులు న‌మోదు చేశారు. దీనిపై రాహుల్ స్పందించి బాధితురాలి త‌ల్లిదండ్రుల‌ను క‌లిసి ఓదార్చారు. ఇదే క్ర‌మంలో వారితో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.






తెలంగాణ : ఆ పల్లెను వణికిస్తున్న కరోనా.. !

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>