PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefined ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీ ఒంట‌రిగా ముందుకు వెళ్దామ‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. జ‌న‌సేన‌తో పొత్తు ఉన్న‌ప్ప‌టికీ తిరుప‌తి ఉప ఎన్నిక‌లు అయిపోయిన త‌ర్వాత ప‌వ‌న్ బీజేపీకి దూరం జ‌రుగుతున్న‌ట్లు ఆ పార్టీ నేత‌లు అనుమానిస్తున్నారు. పొత్తు పెట్టుకొని రెండు సంవ‌త్స‌రాల‌వుతున్న‌ప్ప‌టికీ త‌మ‌కు కూడా పెద్ద‌గా ఒన‌గూరింది ఏదీ లేద‌ని ఆ పార్టీ త‌ల‌పోస్తోంది. అందుకే బీజేపీ కూడా జ‌న‌సేన‌తో సంబంధం లేకుండా ఒంట‌రిగా వెళ్ల‌డానికే మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప‌వ‌న్ మ‌న‌సులో తెలుtag{#}Jayanthi;tippu;Somu Veerraju;Yatra;Aqua;Bharatiya Janata Party;Andhra Pradesh;District;Party;MLA;Telugu Desam Party;YCPప‌వ‌న్‌ను కాద‌ని మ‌తాన్ని న‌మ్ముకున్న బీజేపీ?ప‌వ‌న్‌ను కాద‌ని మ‌తాన్ని న‌మ్ముకున్న బీజేపీ?tag{#}Jayanthi;tippu;Somu Veerraju;Yatra;Aqua;Bharatiya Janata Party;Andhra Pradesh;District;Party;MLA;Telugu Desam Party;YCPWed, 04 Aug 2021 11:48:02 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీ ఒంట‌రిగా ముందుకు వెళ్దామ‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. జ‌న‌సేన‌తో పొత్తు ఉన్న‌ప్ప‌టికీ తిరుప‌తి ఉప ఎన్నిక‌లు అయిపోయిన త‌ర్వాత ప‌వ‌న్ బీజేపీకి దూరం జ‌రుగుతున్న‌ట్లు ఆ పార్టీ నేత‌లు అనుమానిస్తున్నారు. పొత్తు పెట్టుకొని రెండు సంవ‌త్స‌రాల‌వుతున్న‌ప్ప‌టికీ త‌మ‌కు కూడా పెద్ద‌గా ఒన‌గూరింది ఏదీ లేద‌ని ఆ పార్టీ త‌ల‌పోస్తోంది. అందుకే బీజేపీ కూడా జ‌న‌సేన‌తో సంబంధం లేకుండా ఒంట‌రిగా వెళ్ల‌డానికే మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప‌వ‌న్ మ‌న‌సులో తెలుగుదేశం పార్టీ ఉంద‌నేది బీజేపీ నేత‌ల అనుమానం. అంతేకాకుండా త‌న రాజ‌కీయం ఏదో, త‌న ప్ర‌క‌ట‌న‌లేవో ఆయ‌నే ఇచ్చుకుంటున్నార‌ని, ఆయ‌నంత‌ట ఆయ‌నే బీజేపీ నుంచి దూరం జ‌రుగాల‌ని భావిస్తున్నారేమోన‌ని ఏపీ బీజేపీ నేత‌లంటున్నారు.

టిప్పుసుల్తాన్ స్వాతంత్ర్య యోధుడు కాదా?
ప‌వ‌న్‌క‌ల్యాణ్ తో క‌లిసి ముందుకు వెళ్ల‌డంవ‌ల్ల ఎటువంటి ఉప‌యోగం లేద‌ని బీజేపీ నేత‌లు గ‌ట్టిగానే భావిస్తున్న‌ట్లున్నారు. అందుకే వారు మ‌తాన్ని ఎంచుకున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. క‌డ‌ప‌లో పార్టీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మ‌తం గురించి గ‌ట్టిగా మాట్లాడారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు కూడా చేశారు. టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటుకు సంబంధించి ఆయ‌న మాట్లాడారు. అయితే క‌ర్ణాట‌క‌లోని చాలా ప్రాంతాల్లో టిప్పు సుల్తాన్ విగ్ర‌హాలుంటాయి.. అన్ని పార్టీల‌వారు ఆయ‌న జయంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తుంటారు. ఆయ‌న పేరునుబ‌ట్టి ముస్లిం అయినంత‌మాత్రాన హిందుత్వ కార్డును ఎలా ఉప‌యోగిస్తారో సోముకే తెలియాలి. టిప్పు సుల్తాన్ ఆంగ్లేయుల‌కు వ్య‌తిరేకంగా పోరాడారు. ఆయ‌న స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు. అటువంటి వ్య‌క్తిని ప‌ట్టుకొని మ‌తం కార్డు ప్ర‌యోగించి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందాల‌ని చూడ‌టం ఇక్క‌డి నేత‌ల అవివేకంగా క‌న‌ప‌డుతోంది.

గోవ‌ధ‌కు సంబంధించి ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌కు ఖండ‌న‌
క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు వైసీపీ ఎమ్మెల్యే గోవ‌ధ‌కు సంబంధించి చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ఏపీలో గోవ‌ధ‌కు సంబంధించి చ‌ట్టం చేయాల‌ని బీజేపీ నేత‌లు కోరుతున్నారు. దీనికితోడు తాజాగా ఆ పార్టీ నేత‌లంతా ఆల‌యాల యాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలో దేవాల‌యాల ధ్వంసం, విగ్ర‌హాల ధ్వంసం జ‌రిగిన ఆల‌యాల‌ను ఇందుకు ఎంచుకున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లు కానీ, ఈ యాత్ర‌లు కానీ, ఈ వ్యాఖ్య‌ల‌ను కానీ ప‌రిశీలిస్తే బీజేపీ నేత‌లు ఏపీలో కూడా మతం ప్రాతిప‌దిక‌న రాజ‌కీయాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా నీటి ప్రాజెక్టుల‌కు సంబంధించి అన్యాయం జ‌రుగుతోందంటూ ఆందోళ‌న‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఏపీలో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా బీజేపీ అభ్య‌ర్థులు నిల‌బ‌డేలా చూసుకోవాల‌ని సీనియ‌ర్ నేత‌లంతా సూచిస్తున్నారు.






హ్యాపీ బర్త్ డే : ప్రజా సేవకుడు ఒబామా !

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>