PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu-pawan-kalyan23d4d589-1b8f-4e24-8ac4-a91118235b7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu-pawan-kalyan23d4d589-1b8f-4e24-8ac4-a91118235b7a-415x250-IndiaHerald.jpgమరి మతలబు ఎక్కడ ఉంది అంటే. చాలానే ఉంది అని చెప్పాలి. మనోహర్ కి టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది. కానీ ఆయన వెళ్లకుండా పవన్ వైపు మొగ్గారు. దానికి కారణం ఆయన అక్కడ ఉంటేనే లాభమని భావించడం వల్లట. మనోహర్ కి టీడీపీ నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఏకంగా చంద్రబాబుతోనే మంచి సాన్నిహిత్యం ఉందని చెబుతారు. మరో వైపు చూస్తే టీడీపీ అనుకూల మీడియాకు కూడా ఆయన ఇష్టుడేనట. పవన్ కి రాజకీయ వ్యూహాలు పెద్దగా తెలియవు. అందువల్ల జనసేనకు సంబంధించి ప్రతీ విషయన్ని మనోహరే చూస్తారు అంటున్నారు.Chandra Babu Pawan Kalyan{#}mithra;Telugu Desam Party;Janasena;Hanu Raghavapudi;Heart;Nagababu;Dookudu;media;TDP;CMటీడీపీకి జనసేన పొత్తుకు ఆ నేతే మ‌ధ్య‌వ‌ర్తా ?టీడీపీకి జనసేన పొత్తుకు ఆ నేతే మ‌ధ్య‌వ‌ర్తా ?Chandra Babu Pawan Kalyan{#}mithra;Telugu Desam Party;Janasena;Hanu Raghavapudi;Heart;Nagababu;Dookudu;media;TDP;CMWed, 04 Aug 2021 13:40:20 GMTజనసేనలో ఆయనంటే చాలా మందికు గుస్సా ఉంది. కానీ ఎవరూ ఆయన్ని ఏమీ బయటకు అనలేరు. ఆయన మాత్రం  తనకు పవన్ పార్టీలో దక్కుతున్న మర్యాదకు చాల హ్యాపీగా ఉన్నారు. ఆయనే నాదెండ్ల   మనోహర్. అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేసిన మనోహర్ దూకుడు కలిగిన నాయకుడు కాడు. ఫేస్ వాల్యూ ఉన్న నేత కానే  కాదు, కనీసం తన నియోజకవర్గంలో గట్టిగా బలమున్న నేత కూడా కాడు. కానీ ఆయనంటే పవన్ విపరీతమైన ఇష్టాన్ని చూపిస్తారు. ఒక విధంగా జనసేనలో వ్యవహారాలను అన్నీ కూడా  ఆయన చక్కబెడతారు. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న నాదెండ్ల పవన్ పార్టీని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నారు అని జనసైనికులు విమర్శించవచ్చు కాక కానీ పవన్ ఆయన్నే నమ్ముతారు. ఆయన సలహాలనే స్వీకరిస్తారు.

మరి మతలబు ఎక్కడ ఉంది అంటే. చాలానే ఉంది అని చెప్పాలి. మనోహర్ కి టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది. కానీ ఆయన వెళ్లకుండా పవన్ వైపు మొగ్గారు. దానికి కారణం ఆయన అక్కడ ఉంటేనే లాభమని భావించడం వల్లట. మనోహర్ కి టీడీపీ నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఏకంగా చంద్రబాబుతోనే మంచి సాన్నిహిత్యం ఉందని చెబుతారు. మరో వైపు చూస్తే టీడీపీ అనుకూల మీడియాకు కూడా ఆయన ఇష్టుడేనట. పవన్ కి రాజకీయ వ్యూహాలు పెద్దగా తెలియవు. అందువల్ల జనసేనకు సంబంధించి ప్రతీ విషయన్ని మనోహరే చూస్తారు అంటున్నారు.

ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయం కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటుందని కూడా కరడుకట్టిన జనసనికులు బాధడితే పడవచ్చు కానీ పవన్ మాత్రం అంతా ఆయన మీదనే పార్టీని  వదిలేశారు. ఇక 2019 ఎన్నికల వేళ కూడా టీడీపీ జనసేనల మధ్యన లోపాయికారీ ఒప్పందాన్ని నాదెండ్ల కుదిర్చారు అని చెబుతారు. ఈసారి మాత్రం బాహాటంగానే పొత్తులు ఉంటాయట. తెలుగుదేశం ఏపీలో అధికారంలోకి రావాలని బలంగా కోరుకునే ఒక మీడియా అధిపతి కూడా నాదెండ్లను సలహాలు ఇస్తూంటారు అని అంటారు. మొత్తానికి టీడీపీని, జనసేనకు కలిపే అనుసంధానంగా మనోహర్ పనిచేస్తున్నారు అని చెబుతారు.

ఆయన వల్లనే జనసేన తమ మిత్ర పక్షమే అని టీడీపీ పెద్దలు గుండె మీద చేయి వేసి హాయిగా నిద్రపోతూ  ఉంటారని కూడా సెటైర్లు పడతాయి. ఈ నాదెండ్ల జనసేనలో ఎంత కీలకమంటే ఏకంగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈయన ఆధిపత్యాన్ని తట్టుకోలేక సైలెంట్ గా ఉండేటంత అని చెబుతారు. ఏపీలో ఎప్పటికైనా కాపును సీఎం గా చూడాలని ఆ సామాజికవర్గం ఆశిస్తూంటే నాదెండ్ల వంటి వారు జనసేనలో ఉండడం వల్ల టీడీపీకే మేలు జరుగుతుంది అన్న ఆవేదన అయితే ఆ పార్టీలో ఉంది. కానీ నాదెండ్లను అక్కడ నుంచి ఎవరూ కదపలేరు. అదే సత్యం.





RC15: షూటింగ్ లేట్... వాళ్లకు తలనొప్పులే ?

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>