MoviesGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tag7a007f88-453d-43b8-9416-60923aab73df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tag7a007f88-453d-43b8-9416-60923aab73df-415x250-IndiaHerald.jpg తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబుది ప్ర‌త్యేక‌శైలి. ఏ విష‌య‌మైన కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడ‌తారు. ఎవ‌రినైనా విమ‌ర్శించాల‌న్నా వెనుకంజ వేయ‌రు. వాడే ప‌ద‌జాలం మాత్రం కాస్తంత పరుషంగా ఉంటుంది. తెలుగు న‌టీన‌టుల‌కు సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌తిసారీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర వ్య‌తిరేక వ‌స్తోంది. అయినా ఆయ‌న మాత్రం త‌న మానాన తాను మాట్లాడుతూనే ఉంటారు. మా ప్ర‌తిష్ట మ‌స‌క‌బారిందంtag{#}Chiranjeevi;Cinema;Teluguనాగ‌బాబుపై చ‌ర్య‌లు తీసుకునేది ఎప్పుడు?నాగ‌బాబుపై చ‌ర్య‌లు తీసుకునేది ఎప్పుడు?tag{#}Chiranjeevi;Cinema;TeluguWed, 04 Aug 2021 17:43:00 GMT
తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబుది ప్ర‌త్యేక‌శైలి. ఏ విష‌య‌మైన కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడ‌తారు. ఎవ‌రినైనా విమ‌ర్శించాల‌న్నా వెనుకంజ వేయ‌రు. వాడే ప‌ద‌జాలం మాత్రం కాస్తంత పరుషంగా ఉంటుంది. తెలుగు న‌టీన‌టుల‌కు సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌తిసారీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర వ్య‌తిరేక వ‌స్తోంది. అయినా ఆయ‌న మాత్రం త‌న మానాన తాను మాట్లాడుతూనే ఉంటారు. మా ప్ర‌తిష్ట మ‌స‌క‌బారిందంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య కూడా ఈ కోవ‌లోకే వ‌స్తుంది. మా అధ్య‌క్షుడిగా చేసిన నాగ‌బాబు త‌న హ‌యాంలోనే మా సంస్థ‌ను అభివృద్ధి చేసివుంటే బాగుండేది.. అలా కాకుండా ఇప్పుడున్న‌వారంతా అభివృద్ధి చేయాలంటూ మాట్లాడ‌ట‌మే కాస్తంత విడ్డూరంగా ఉంది.

చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించిన న‌రేష్‌
మా ప్ర‌తిష్ట మ‌స‌క‌బారిందంటూ వ్యాఖ్యానించిన నాగ‌బాబుపై ప్ర‌స్తుత మా అధ్య‌క్షుడ న‌రేష్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. మాకు సంబంధించి ఏమైన మంచి ఉంటే మైకులో చెప్పాల‌ని, చెడు ఉంటే చెవిలో చెప్పాల‌ని చిరంజీవి అన్నార‌ని, అటువంటిది నాగ‌బాబు పైకి మాట్లాడ‌టం ఏమాత్రం స‌రైంది కాద‌న్నారు. నాగ‌బాబాఉ వ్యాఖ్య‌ల‌కు సంబంధించి చిరంజీవి, కృష్ణంరాజుతో కూడిన క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ప్ర‌కాష్‌రాజ్‌కు మ‌ద్ద‌తిచ్చేది ఎవ‌రు?
ప్ర‌కాష్‌రాజ్‌కు మ‌ద్ద‌తుగా నాగ‌బాబు మాట్లాడుతూ ప్ర‌స్తుత కార్య‌వ‌ర్గంపై విమ‌ర్శ‌లు చేశారు. దీన్ని కార్య‌వ‌ర్గ స‌భ్యులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ప్ర‌కాష్‌రాజ్‌కు చిరంజీవి మ‌ద్ద‌తు ఉంద‌ని నాగ‌బాబు అన్నారేకానీ చిరంజీవి అన‌లేదుగా అని న‌రేష్ అన్నారు. మా ఎన్నిక‌లు ఏక‌గ్రీవ‌మైతే మ‌హాపాప‌మ‌ని అన్నార‌ని, ఏక‌గ్రీవ‌మ‌వ‌డం త‌ప్పా అని ప్ర‌శ్నించారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌రుచుగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్న నాగ‌బాబుపై చ‌ర్య‌లు తీసుకుంటారా?  లేదా? అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. చిరంజీవి సోద‌రుడు కాబ‌ట్టి చ‌ర్య‌లు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని కొంద‌రు అంటున్నారు.. మ‌రికొంద‌రు మాత్రం చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. చివ‌రికి ఏమ‌వుతుందో చూడాలి మ‌రి..!!








పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... "పిఎస్పికే28" అప్డేట్ అప్పుడే...!?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>