Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/venkatesh-and-soundarya-became-the-best-couple-with-that-movie963498c8-ccbd-47bd-ae54-e1e38c5b4c80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/venkatesh-and-soundarya-became-the-best-couple-with-that-movie963498c8-ccbd-47bd-ae54-e1e38c5b4c80-415x250-IndiaHerald.jpgవెంకటేష్, సౌందర్య సినీ కెరీర్ లను మలుపు తిప్పిన చిత్రం 'పవిత్రబంధం'. ఈ సినిమాలో అనుకోకుండా వీరిద్దరూ నటించాల్సి వచ్చింది. ఈ సినిమా నుండే బెస్ట్ హీరోహీరోయిన్ జంటగా సినిపరిశ్రమలో నిలిచిపోయారు. వెంకటేష్ తో ఈ సినిమా తెరకేక్కించాలని ఈ చిత్ర నిర్మాతలు అయిన శివరాజు, వెంకట్రాజు చాలా ప్రయత్నిస్తున్న సమయం అది. వారి ఆరాటం చూసిన సురేష్ బాబు సరే అనటం జరిగింది.ఈ కథకు దర్శకుడుగా ముత్యాల సుబ్బయ్యను తెచ్చుకోండి అని వెంకటేష్ బాబు డేట్స్ అడ్జస్ట్ చేస్తాం అని ఆ నిర్మాతలకు మంచి ఆఫర్ ఇచ్చాడు.Venkatesh{#}Soundarya;ramya krishnan;Suresh;raja;contract;Chitram;Venkatesh;Hero;Heroine;Darsakudu;Director;Cinemaఆ సినిమాతో బెస్ట్ జంటగా మారిన వెంకటేష్, సౌందర్య?ఆ సినిమాతో బెస్ట్ జంటగా మారిన వెంకటేష్, సౌందర్య?Venkatesh{#}Soundarya;ramya krishnan;Suresh;raja;contract;Chitram;Venkatesh;Hero;Heroine;Darsakudu;Director;CinemaWed, 04 Aug 2021 21:53:00 GMTవెంకటేష్, సౌందర్య సినీ కెరీర్ లను మలుపు తిప్పిన చిత్రం 'పవిత్రబంధం'. ఈ సినిమాలో అనుకోకుండా వీరిద్దరూ నటించాల్సి వచ్చింది. ఈ సినిమా నుండే బెస్ట్ హీరోహీరోయిన్ జంటగా సినిపరిశ్రమలో నిలిచిపోయారు. వెంకటేష్ తో ఈ సినిమా తెరకేక్కించాలని ఈ చిత్ర నిర్మాతలు అయిన శివరాజు, వెంకట్రాజు చాలా ప్రయత్నిస్తున్న సమయం అది. వారి ఆరాటం చూసిన సురేష్ బాబు సరే అనటం జరిగింది.ఈ కథకు దర్శకుడుగా ముత్యాల సుబ్బయ్యను తెచ్చుకోండి అని వెంకటేష్ బాబు డేట్స్ అడ్జస్ట్ చేస్తాం అని ఆ నిర్మాతలకు మంచి ఆఫర్ ఇచ్చాడు.అదే ఆరాటంలో శివరాజు, వెంకట్రాజు ముత్యాల సుబ్బయ్యకు అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. దర్శకుడు ముత్యాల సుబ్బయ్యకి భూపతిరాజా మంచి మిత్రుడు. పెద్ద హీరోతో సినిమా తెరకేక్కిస్తున్నాం మంచి కథ అవసరం అని చెప్పారట.భూపతి రాజా 'పవిత్రబంధం' కథ చెప్పాడట. కథ ముత్యాల సుబ్బయ్యకి చాలా నచ్చింది. ఈ కథతో సినిమా తీసి భారీ హిట్ సాధించవచ్చు అనే నమ్మకం సుబ్బయ్యలో బాగా కలిగిందట.

అయితే, భూపతిరాజా చెప్పిన కథ నిర్మాతలు శివరాజు, వెంకట్రాజులకు అంతగా నచ్చలేదు. ఫ్యామిలీ హీరో వెంకటేష్ కి ఆ కథ అస్సలు సూట్ కాదేమో అని వారి భయం వేసిందట. అందుకే, ఆ కథను వేరే హీరోతో చేద్దాం అన్నారట. వెంకటేష్ బాబుతో ఇంకో మంచి ఫ్యామిలీ కథ చేద్దాం అని అనుకున్నారట. కథ చాలా బాగుంది. దీని మీద బాగా వర్క్‌ చేద్దాం కచ్చితంగా ఇది చాలా వైవిధ్యమైన కథ.ఇది తప్పకుండా మనకు మంచి పేరు తీసుకొని వస్తుంది అంటూ చాలా రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడట ముత్యాల సుబ్బయ్యగారు.దర్శకుడి మాట కాదు అనలేక పూర్తి కథ సిద్ధం చేసిన తర్వాత చూద్దాం అంటూ నిర్మాతలు కచ్చితంగా చెప్పేశారట. వెంకటేష్ కోసం మరో కథ సిద్ధం చేయడం మొదలు పెట్టారు నిర్మాతలు. ఈ లోపు పూర్తి కథను సిద్ధం చేశారట దర్శక రచయితలు. కానీ, ఈ కథతో వెంకటేష్ తో సినిమా చేయడానికి నిర్మాతలు అంతగా ఆసక్తిగా లేరట.కాబట్టి ఈ కథను చాటుగా సురేశ్‌బాబుకి వినిపించారట ముత్యాల సుబ్బయ్య. సింగిల్‌ సిట్టింగ్‌లో కథను ఓకే చేసేశారట వెంకటేష్.

నిర్మాతలు షాక్ తిన్న చాల సంతోషపడ్డారు. ఆర్టిస్టుల ఎంపిక ప్రారంభించారు. ఈ కథలో హీరోయిన్ అంటే చాలా పెద్ద హీరోయిన్ ఉండాలి అని రకరకాల పేర్లు చెప్పుకొచ్చారు నిర్మాతలు. అందులో రమ్యకృష్ణ పేరును ఎంపిక చేసుకున్నారు. కానీ, దర్శకుడు సుబ్బయ్య మనసులో  సౌందర్య ఉంది. ఆమె అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయగలుగుతుంది అని ఆయన భావించారు. అలా చివరి సమయంలో రమ్యకృష్ణ స్థానంలో సౌందర్య రావడం జరిగింది. మొత్తానికి వెంకటేష్ - సౌందర్య ఇద్దరూ అనుకోకుండా నటించి గొప్ప జంటగా పేరు తెచ్చుకున్నారు.



ఆర్ ఆర్ ఆర్ వివాదం.. రామ్ చరణ్ నీ పొగిడి.. ఎన్టీఆర్ నీ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>