PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/north-koriaedd4af0c-0471-44c9-ada1-19958016ea46-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/north-koriaedd4af0c-0471-44c9-ada1-19958016ea46-415x250-IndiaHerald.jpgఉత్త‌ర కొరియా.. ఈ దేశం ఉండేది చిన్న‌గ అయిన అగ్ర‌రాజ్యం జంకుతుంది. దీనికి కార‌ణం ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌. ప్ర‌పంచానికి దూరంగా ఉత్త‌ర కొరియాను ఉంచిన ఘ‌న‌త ఆయ‌నకే చెందుతుంది. అణ్వాయుధాల‌తో ప్ర‌పంచాన్ని భ‌య‌పెట్టాల‌ని చూస్తోంది ఆ దేశ ప్ర‌భుత్వం. నియంతృత్వానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా కిమ్ పేరును చెప్పొచ్చు ఎందుకంటే ఆ దేశ ప్ర‌జ‌ల‌ను చూస్తే మ‌నం ఎంత స్వేచ్ఛ‌గా బ‌తుకుతున్నామో తెలుస్తుంది. కిమ్ కు గాని ఆయ‌న కుటుంబానికి ఎవ‌రు ఎద‌రు చెప్పినా వారిని చంపేయ‌డ‌మే వారి ఆన‌వాయితిగా వ‌స్తుంది. దీంతో ఆ దేశంలోనిnorth koria{#}Korea; South;Army;Juneకిమ్ త‌ల‌కు ర‌హ‌స్య మ‌ర‌క‌..! అస‌లేమ‌యింది.?కిమ్ త‌ల‌కు ర‌హ‌స్య మ‌ర‌క‌..! అస‌లేమ‌యింది.?north koria{#}Korea; South;Army;JuneWed, 04 Aug 2021 07:58:39 GMT ఉత్త‌ర కొరియా.. ఈ దేశం ఉండేది చిన్న‌గ అయిన అగ్ర‌రాజ్యం జంకుతుంది. దీనికి కార‌ణం ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌. ప్ర‌పంచానికి దూరంగా ఉత్త‌ర కొరియాను ఉంచిన ఘ‌న‌త ఆయ‌నకే చెందుతుంది. అణ్వాయుధాల‌తో ప్ర‌పంచాన్ని భ‌య‌పెట్టాల‌ని చూస్తోంది ఆ దేశ ప్ర‌భుత్వం. నియంతృత్వానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా కిమ్ పేరును చెప్పొచ్చు ఎందుకంటే ఆ దేశ ప్ర‌జ‌ల‌ను చూస్తే మ‌నం ఎంత స్వేచ్ఛ‌గా బ‌తుకుతున్నామో తెలుస్తుంది. కిమ్ కు గాని ఆయ‌న కుటుంబానికి ఎవ‌రు ఎద‌రు చెప్పినా వారిని చంపేయ‌డ‌మే వారి ఆన‌వాయితిగా వ‌స్తుంది. దీంతో ఆ దేశంలోని అధికారులు ప్ర‌జ‌లు ఎంత ద‌య‌నీయ స్థితిలో ఉన్నార‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది. అక్క‌డి నియంతల చర్య‌ల వ‌ల్ల ఉత్త‌ర కొరియా ఇప్ప‌టికీ వంద ఏండ్లు వెనుక‌బ‌డి ఉందంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

   కిమ్ ఉన్ జోంగ్ ఉన్ ప్ర‌తి చిన్న క‌ద‌లిక‌పై  ప్ర‌పంచ వ్యాప్తంగాప్ర‌త్యేక దృష్టి ఉంటుంది. అయితే, ఆయ‌న త‌ల‌కి బ్యాండేజీతో కూడిన ఓ మ‌చ్చ ఉండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. జూలై 24 నుంచి 27 వరకు కొరియన్ పీపుల్స్ ఆర్మీ కార్యక్రమాల్లో కిమ్ పాల్గొన్నారని ఆయన తలకు వెనుక భాగంలో మచ్చ బ్యాండేజ్ కనిపించాయని ప్రకటించింది ఎన్ కే న్యూస్ సైట్.  జూలై 27 నుంచి 29 వరకు పాల్గొన్న మరికొన్ని కార్యక్రమాల్లో కూడా ఇదే విధంగా కిమ్ కనిపించారని ఆయ‌న‌ తల వెనుక భాగంలో తపాలా స్టాంపు పరిమాణంలో ముదురు ఆకుపచ్చ రంగులో మచ్చ లేదా వాపు కనిపించినట్లు వెల్ల‌డించింది.

 అయితే ఈ మ‌చ్చ‌ను బ్యాండేజీతో క‌ప్పి ఉంచిన‌ట్లు, దీనికి కార‌ణాల‌ను ఫోటోల ద్వారా నిర్థరించడం కష్టమని జూన్ 29న ఆయన పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్నపుడు ఈ మచ్చ కనిపించలేదని జూలై 11న ఆయన మ్యుజిషియన్లతో కలిసి కనిపించినపుడు విడుదల చేసిన ఫొటోలలో ఆయన తల వెనుక భాగాన్ని చూపించలేదని ఎన్ కే న్యూస్ సైట్ వివ‌రించింది. కిమ్ ఆరోగ్యానికి సంబంధించిన ప్ర‌త్యేక విష‌యాలు ఏమీ లేవు. ఆయ‌న త‌ల‌పై వేసిన ప్యాచ్‌ను తొల‌గించార‌ని ఆ త‌రువాత ఎలాంటి మ‌చ్చ కూడా క‌నిపించ‌న‌ట్టుగా తెలుస్తోంది.

కిమ్ జొంగ్ ఉన్ ఆరోగ్యం విష‌యంలో అధికారుల ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటారు. ఆయ‌న ఇటీవ‌ల 20 కిలోల బ‌రువు త‌గ్గ‌న‌ట్టు మీడియాలో వార్త‌లు కూడా వ‌చ్చాయి. కిమ్ ఎక్క‌డికి వెళ్లిన ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కేటాయించిన టాయిలెట్ లో మాత్ర‌మే ఆయ‌న కాల‌కృత్యాలు తీర్చుకుంటారు. ఆ వ్య‌ర్థాల‌ను కిమ్ ఆరోగ్య  ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించేందుకు అధికారులు ప‌రీక్షిస్తార‌ని స‌మాచారం. అక్క‌డి ప్ర‌జ‌లకు ఎలాంటి స్వేచ్ఛ ఉండ‌దు. బాహ్య ప్ర‌పంచానికి సంబంధించిన విష‌యాలు తెలుసుకోవ‌డానికి ఇంట‌ర్నెట్ కూడా ఉండ‌దు.





బీ అలర్ట్... థర్డ్ వేవ్ కమింగ్.. సెంటర్ వార్నింగ్

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>