PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan7e17f9f7-94e8-425d-b6f8-22a823842a99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan7e17f9f7-94e8-425d-b6f8-22a823842a99-415x250-IndiaHerald.jpgపాతికేళ్ల ప్రస్థానం అంటూ పవన్ కల్యాణ్ రాజకీయాలు ప్రారంభించారు. ఇప్పటికిప్పుడు అధికారం అక్కర్లేదు, పాతికేళ్లయినా సరే ప్రజలకోసం పోరాటం చేస్తానన్నారు. మరి ఆ దిశగా పవన్ అడుగులు పడుతున్నాయా..? జనసేన నిజంగానే అదే రూట్లో వెళ్తోందా..? అన్ని వర్గాలను జనసేనాని కలుపుకొని వెళ్లగలుగుతున్నారా..? దీనిపై స్పష్టత మాత్రం కరువైంది. pawan kalyan{#}Grama Sachivalayam;Janasena;Pawan Kalyan;politics;Prasthanam;Corporate;job;CMపాతికేళ్ల ప్రస్థానంలో పవన్ కి యువత అవసరం లేదా..?పాతికేళ్ల ప్రస్థానంలో పవన్ కి యువత అవసరం లేదా..?pawan kalyan{#}Grama Sachivalayam;Janasena;Pawan Kalyan;politics;Prasthanam;Corporate;job;CMWed, 04 Aug 2021 08:16:24 GMTపాతికేళ్ల ప్రస్థానం అంటూ పవన్ కల్యాణ్ రాజకీయాలు ప్రారంభించారు. ఇప్పటికిప్పుడు అధికారం అక్కర్లేదు, పాతికేళ్లయినా సరే ప్రజలకోసం పోరాటం చేస్తానన్నారు. మరి ఆ దిశగా పవన్ అడుగులు పడుతున్నాయా..? జనసేన నిజంగానే అదే రూట్లో వెళ్తోందా..? అన్ని వర్గాలను జనసేనాని కలుపుకొని వెళ్లగలుగుతున్నారా..? దీనిపై స్పష్టత మాత్రం కరువైంది.

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు కులాల కుంపట్లుగా మారిపోయాయి. రెండు ప్రధాన సామాజిక వర్గాలు రెండు పార్టీలవైపు వెళ్లిపోయాయి. ఇక మిగిలినవారిలో పవన్ కల్యాణ్ ఎంతమందిని ఆకర్షిస్తారు, ఆకట్టుకుంటారు, తనవైపు తిప్పుకుంటారనేదే ప్రధానాంశం. అందులోనూ యువతను ఆకట్టుకోగలిగితే కుల మతాలకతీతంగా ఓట్లు పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అదే బలం.. అదే బలహీనత..
పవన్ కల్యాణ్ కి యువత పెద్ద బలం, ఆయన ఎక్కడికి వెళ్లినా, ఏ సభలో ప్రసంగించినా ఆయన చుట్టూ చేరేది యువతే. సీఎం సీఎం అంటూ పవన్ పేరుని జపం చేసేది వారే. అలాంటి యువత ఎన్నికల ప్రచారంలో కనపడతారు కానీ, బ్యాలెట్ బాక్స్ ల వరకు వెళ్లడంలేదనేది ప్రధాన కంప్లయింట్. మరి వారికి సరైన మార్గనిర్దేశనం చేయాలంటే, యువత సమస్యలపై పవన్ దృష్టిపెట్టాలి. కానీ అదే ఇప్పుడు జరగడంలేదని తెలుస్తోంది.

నిరుద్యోగుల్ని, యువతను ఓన్ చేసుకుంటే పవన్ కి మంచి ప్లాట్ ఫామ్ దొరుకుతుంది. పాతికేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో యువత ఆయన వెంట నడిచి, ఆయన మాటల్ని నమ్మి కలసి వచ్చారంటే అది కచ్చితంగా జనసేనకు ప్లస్ అవుతుంది. కానీ పవన్ నిరుద్యోగ సమస్యల విషయంలో అంటీముట్టనట్టుగా ఉండటం విచిత్రం. జాబ్ క్యాలెండర్ పై కూడా పోరాటం చేసినట్టే చేసి చల్లబడ్డారు. సచివాలయం పోస్ట్ లు, వాలంటీర్ పోస్ట్ లు ఇచ్చినా కూడా.. ఏపీలో ప్రైవేటు రంగంలో, కార్పొరేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెద్దగా పెరగలేదు. అటు ప్రభుత్వ రంగంలో కూడా భర్తీ చేయాల్సిన పోస్ట్ లు చాలానే ఉన్నాయి. వీటన్నిటిపై సమగ్రంగా పవన్ అధ్యయనం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పడితే యువత ఎక్కడికీ పోదు, పవన్ వెంటే నిలబడుతుంది.



బీ అలర్ట్... థర్డ్ వేవ్ కమింగ్.. సెంటర్ వార్నింగ్

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>