PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/karnataka-new-cabinet655e100c-2d59-4b2a-89c5-719dfc04f469-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/karnataka-new-cabinet655e100c-2d59-4b2a-89c5-719dfc04f469-415x250-IndiaHerald.jpgకర్ణాటక రాష్ట్రములో వివిధ రాజకీయ కారణాల వలన మాజీ సీఎం యడ్డ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తదుపరి కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఎన్నో రాజకీయ ఉత్కంట పరిస్థితుల మధ్య కర్ణాటక మాజీ సీఎం కుమారుడు బసవరాజు బొమ్మైనే సీఎంగా అధిష్టానం ఎంపిక చేసింది. ఈ ఎంపిక విషయంలో మాజీ సీఎం యడ్డ్యూరప్ప చేయి కూడా ఉందనేది పైమాట.KARNATAKA-NEW-CABINET{#}రాజీనామా;Deputy Chief Minister;Cabinet;Telangana Chief Minister;Bharatiya Janata Party;Minister;CMకర్ణాటక 'డిప్యూటీ సీఎం' పదవికి ఎవరూ సరిపోరా ?కర్ణాటక 'డిప్యూటీ సీఎం' పదవికి ఎవరూ సరిపోరా ?KARNATAKA-NEW-CABINET{#}రాజీనామా;Deputy Chief Minister;Cabinet;Telangana Chief Minister;Bharatiya Janata Party;Minister;CMWed, 04 Aug 2021 19:34:26 GMTకర్ణాటక రాష్ట్రములో వివిధ రాజకీయ కారణాల వలన మాజీ సీఎం యడ్డ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తదుపరి కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఎన్నో రాజకీయ ఉత్కంట పరిస్థితుల మధ్య కర్ణాటక మాజీ సీఎం కుమారుడు బసవరాజు బొమ్మైనే సీఎంగా అధిష్టానం ఎంపిక చేసింది. ఈ ఎంపిక విషయంలో మాజీ సీఎం యడ్డ్యూరప్ప చేయి కూడా ఉందనేది పైమాట. ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి నేతృత్వంలో నూతన కేబినెట్ ను ఏర్పరిచారు. బొమ్మై కేబినెట్ లో 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రెండు మూడు రోజుల నుండి ప్రచలంలో ఉన్న విధంగానే ఒక్క పదవిని మాత్రం ఏ ఒక్కరికీ కేటాయించలేదు. అదేమిటంటే సీఎం స్థానం తర్వాత ముఖ్యమైన డిప్యూటీ సీఎం పదవి. ఇది సాహసోపేతమైన నిర్ణయం అనే చెప్పవచ్చు.

అంతే కాకుండా ఈ కేబినెట్ కూర్పులో బీజేపీ అధిష్టానం సలహా మేరకే చేసినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. అయితే డిప్యూటీ సీఎం ను ఎవ్వరికీ ఇవ్వకపివడానికి గల కారణాలను పరిశీలిస్తే, కర్ణాటక బీజేపీలో ఈ పదవిపై ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈ పదవి కోసం వారం ముందు నుండే కేంద్రంలో తిష్ట వేసి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ అంశాలన్నింటినీ తీక్షణంగా ఆలోచించిన బీజేపీ అధిష్టానం ఈ పదవిని ఎవరికీ కేటాయించకపోవడమే సబబని నిర్ణయించుకుంది. అందుకే ఈ పదవి ఖాళీగానే ఉండిపోయింది. ఏ ఒక్కరికయినా ఈ పదవి ఇస్తే, పార్టీలో బేదాభిప్రాయాలు వస్తాయనే ముందు చూపుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.

కేబినెట్ ఎంపికలో అన్ని కులాలవారికి ప్రాధాన్యం కల్పించడం కొసమెరుపు. అత్యధికంగా ఎప్పటిలాగే లింగాయత్ సామజిక వర్గానికి చెందిన వారికి 8 మంత్రి పదవులిచ్చారు. ఇందులో యడ్డ్యూరప్ప కీలకంగా వ్యవహరించారని సమాచారం. మొత్తం 34 మంత్రులను కేటాయించే అవకాశం ఉన్నా కూడా 29 మందినే మంత్రులుగా ఎంపిక చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. మరి కొత్త ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన బసవరాజ్ బొమ్మై ఏ విధంగా తన పాలనను కొనసాగిస్తారో చూడాలి.








సీమ ఎత్తిపోతల సందర్శన ఇప్పట్లో లేనట్లే...

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>