PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/spurious-liquoraa5debcb-243b-4db3-87a9-b513acdb5336-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/spurious-liquoraa5debcb-243b-4db3-87a9-b513acdb5336-415x250-IndiaHerald.jpgకల్తీ మద్యం అమ్మడం పెద్ద నేరం కాదనే అభిప్రాయం ఇప్పటి వరకూ ఉండేది. మహా అయితే కల్తీ మద్యం అమ్మేవారిపై జరిమానా విధించి వదిలేసేవారు. అది కూడా రూ.300 నుంచి రూ.2వేల వరకు ఉండేది. కానీ ఇప్పుడా జరిమానాను భారీగా పెంచడంతోపాటు.. ఏకంగా ఉరిశిక్ష కూడా విధించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముసాయిదా బిల్లుని ఆమోదించింది. spurious liquor{#}jeevitha rajaseskhar;Madhya Pradesh - Bhopal;Shivraj Singh Chouhan;Maha;Partyకల్తీ మద్యం అమ్మితే ఇకపై ఉరిశిక్ష..కల్తీ మద్యం అమ్మితే ఇకపై ఉరిశిక్ష..spurious liquor{#}jeevitha rajaseskhar;Madhya Pradesh - Bhopal;Shivraj Singh Chouhan;Maha;PartyWed, 04 Aug 2021 08:00:00 GMTకల్తీ మద్యం అమ్మడం పెద్ద నేరం కాదనే అభిప్రాయం ఇప్పటి వరకూ ఉండేది. మహా అయితే కల్తీ మద్యం అమ్మేవారిపై జరిమానా విధించి వదిలేసేవారు. అది కూడా రూ.300 నుంచి రూ.2వేల వరకు ఉండేది. కానీ ఇప్పుడా జరిమానాను భారీగా పెంచడంతోపాటు.. ఏకంగా ఉరిశిక్ష కూడా విధించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముసాయిదా బిల్లుని ఆమోదించింది.

మధ్యప్రదేశ్ లో కల్తీమద్యం కాటుకి ఏటా వేల సంఖ్యలో ప్రజలు బలవుతున్నారు. కల్తీ మద్యం అమ్ముతూ పట్టుబడినా వారిని నామమాత్రపు జరిమానాలతో వదిలి పెడుతుండటంతో ఎవరూ లెక్కచేయడంలేదు. మరోవైపు మందుబాబుల్లో అవగాహన తేవడం కూడా కష్టంగా మారింది. ఈ దశలో కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై ఎవరైనా తమ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మితే వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరిస్తోంది ప్రభుత్వం. ఈమేరకు సవరించిన ముసాయిదా బిల్లుని మంత్రివర్గం ఆమోదించింది.

కల్తీ మద్యం కారణంగా ఎవరైనా మరణిస్తే, అమ్మినవారికి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధిస్తారు. జరిమానా మొత్తాన్ని 25లక్షల రూపాయలకు పెంచారు. అక్రమ మద్యం అమ్మకాలను అడ్డుకోడానికి వచ్చిన ఎక్సైజ్ పోలీసులపై దాడి చేశారని రుజువైతే మూడేళ్లపాటు శిక్ష ఖాయం. ఇలా అక్రమ మద్యం అమ్మకాల విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిబంధనలు తెరపైకి తెస్తోంది.

అక్రమార్కుల గుండెల్లో గుబులు..
కల్తా మద్యం అమ్మకాలతో మధ్యప్రదేశ్ లో చాలామంది కోటీశ్వరులయ్యారు. వీరిలో కొందరికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. మద్యం మాఫియానే కొన్ని చోట్ల రాజకీయాలను శాసిస్తోంది. ఇకపై ఇలా జరక్కుండా ఉండేందుకే మద్యం కల్తీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామంటున్నారు అధికార పార్టీ నేతలు. అయితే కల్తీ మద్యం అమ్మితే ఏకంగా ఉరిశిక్ష విధించేలా బిల్లు తీసుకు రావడం మాత్రం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అంటున్నారు. ఈ కఠిన నిర్ణయంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.




బీ అలర్ట్... థర్డ్ వేవ్ కమింగ్.. సెంటర్ వార్నింగ్

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>